EPAPER

Homemade Face Bleach: ఫేషియల్స్ కోసం బ్యూటీపార్లర్‌కు వెళ్తున్నారా ? ఇంట్లోనే చేసుకోండిలా !

Homemade Face Bleach: ఫేషియల్స్ కోసం బ్యూటీపార్లర్‌కు వెళ్తున్నారా ?  ఇంట్లోనే చేసుకోండిలా !

Homemade Face Bleach: చర్మం నిగనిగలాడుతూ కనిపించాలని అందరూ కోరుకుంటారు. ముఖ్యంగా మహిళలు అందం విషయంలో ఎక్కువగా శ్రద్ధ తీసుకుంటారు. ముఖం కాంతి వంతంగా మెరవడం కోసం రకరకాల ఫేస్ ప్రొడక్ట్స్ కూడా వాడుతూ ఉంటారు. తరుచుగా పార్లర్ల చుట్టూ తిరిగే వారు కూడా ఎక్కువగానే ఉంటారు. ఈ మధ్య కాలంలో ఫేషియల్స్, బ్లీచ్ చేయించుకునే వారి సంఖ్య కూడా ఎక్కువగానే ఉంటోంది. అందుకోసం వేలల్లో ఖర్చు చేసే వారు కూడా లేకపోలేదు.


అయితే ఫేషియల్స్, బ్లీచ్ చేయించినప్పుడు వాటి వల్ల చర్మం తాత్కాలికంగా మెరిసిపోయినా కూడా తర్వాత చాలా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయని నిపుణులు చెబుతునన్నారు. ఎందుకంటే బ్యూటీ పార్లర్‌లో వాడే ప్రొడక్ట్స్ రసాయనాలతో తయారు చేస్తారు. అందుకే ఇలాంటి వాటిని ఉపయోగించకుండా ఉంటేనే మంచిది. ఇంట్లోనే తయారు చేసుకుని బ్లీచ్ వాడటం వల్ల చర్మం అందంగా కనిపిస్తుంది. మరి సహజసిద్ధంగా ఆరోగ్యానికి హాని కలిగించని నేచురల్ హెర్బల్ బ్లీచ్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు.. తయారు చేసుకునే విధానం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

కావాల్సిన పదార్థాలు:


  • పావుకప్పు – పుల్లటి పెరుగు
  • పావు టీ స్పూన్ – పసుపు
  • పావు టీ స్పూన్- చందనం
  • 2 టీ స్పూన్‌ల – తేనె
  • ఒక టీ స్పూన్- నిమ్మరసం
  • పావు టీ స్పున్ – నారింజ తొక్కల పొడి
  • పావు టీ స్పున్- నిమ్మ తొక్కల పొడి

తయారీ విధానం:
ముందుగా ఒక కప్పులో పైన చెప్పిన పదార్థాలు అన్నింటినీ వేసి మిశ్రమం లాగా తయారు చేసుకోవాలి. ఆ తర్వాత ముఖాన్ని చల్లని నీటితో కడుక్కోవాలి. అనంతరం మనం తయారు చేసుకున్న మిశ్రమాన్ని ఫేస్ పై అప్లై చేసుకోవాలి. దీనిని 20 నుంచి 25 నిమిషాల పాటు ఉంచుకోవాలి. తర్వాత చేతితో మసాజ్ చేస్తూ గోరువెచ్చటి నీటితో కడిగేయాలి.

ఈ బ్లీచ్ తయారు చేయడానికి ఉపయోగించిన పసుపులో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఎక్కువగా ఉంటాయి. అంతే కాకుండా ఇందులో ఉండే యాంటీ మైక్రోబయల్ లక్షణాలు చనిపోయిన చర్మ కణాలకు తొలగించడంలో ఉపయోగపడతాయి. మొటిమలు తగ్గించడంలో కూడా సహాయపడతాయి. పసుపును బ్లీచ్ తయారీలో వాడటం వల్ల అందులోని కర్కుమిన్ చర్మం సహజంగా మెరిసేలా చేస్తుంది.

ఇలా వారానికి ఒక సారి ఇంట్లోనే బ్లీచ్ తయారు చేసుకుని వాడటం వల్ల చర్మ సమస్యలు రాకుండా ఉంటాయి. అంతే కాకుండా చర్మం నిగనిగలాడుతూ ఉంటుంది. సున్నితమైన చర్మం ఉన్న వారు దీనిని వాడే విషయంలో వ్యక్తిగత సౌందర్య నిపుణులను సంప్రదించడం మంచిది.

Also Read: వర్షాకాలంలో వచ్చే చర్మ సమస్యలకు చెక్ పెట్టండిలా ?

అందంగా కనిపించడం కోసం ఉదయం సాయంత్రం స్కిన్ కేర్ రొటీన్ పాటించడం చాలా అవసరం. ఇవి ముఖంపై ఉన్న మురికిని తొలగిస్తాయి. అంతే కాకుండా పింపుల్స్ రాకుండా కూడా చేస్తాయి. స్కిన్ కేర్ ఫాలో అవడం వల్ల మేకప్ లేకుండా కూడా అందంగా కనిపించవచ్చు. బ్యూటీ ప్రొడక్స్ట్‌తో పాటు మేకప్ ప్రొడక్స్ వాడేవారు వీటిని తొలగించిన తర్వాతే రాత్రి పడుకోవాలి. అంతే కాకుండా వారానికి రెండు సార్లయినా ఎక్స్ ఫోలియేటింగ్ చేయడం వల్ల ముఖంలో మంచి గ్లో కూడా వస్తుంది.

Related News

Multani Mitti Face Pack:ముల్తానీ మిట్టితో స్మూత్, గ్లోయింగ్ స్కిన్..

Rosy Cheeks: ఇలా చేస్తే మేకప్ వేసుకోకుండానే ముఖం లేత గులాభీ రంగులో మెరిసిపోతుంది

Ginger Juice Benefits : అల్లం రసం తీసుకుంటే శరీరంలో ఎన్ని మార్పులు జరుగుతాయో తెలుసా !

2050 నాటికి 4 కోట్లకు పైగా మరణాలు.. వాటివల్లే ఆ ముప్పు, తాజా స్టడీలో షాకింగ్ విషయాలు వెల్లడి

Burping: తేన్పులు అతిగా వస్తున్నాయా? మీరు డేంజర్‌లో ఉన్నట్టే!

Tomato Face Pack: పార్లర్‌కు వెళ్లకుండానే టమాటో ఫేస్ ప్యాక్‌తో రెట్టింపు అందం మీ సొంతం !

Prawns Masala: ఆంధ్ర స్టైల్‌లో రొయ్యల మసాలా కూర ఇలా వండారంటే నోరూరిపోతుంది, రెసిపీ ఇదిగోండి

Big Stories

×