EPAPER

Raksha Bandhan 2024: రాఖీ పండగ రోజు భద్ర సమయంలో రాఖీ కట్టకూడదు.. ఎందుకో తెలుసా ?

Raksha Bandhan 2024: రాఖీ పండగ రోజు భద్ర సమయంలో రాఖీ కట్టకూడదు.. ఎందుకో తెలుసా ?

Raksha Bandhan 2024: రాఖీ పండగను ఆగస్టు 19వ తేదీన జరుపుకోనున్నాము. రాఖీ ఫండగ రోజు అన్నా తమ్ముల్లకు అక్కా, చెల్లెల్లు రాఖీలను కడుతూ ఉంటారు. అయితే ఈ రాఖీని శుభ సమయంలో కట్టకపోతే దురదృష్టం వస్తుంది. అందుకే ఈ సమయంలో వచ్చే ప్రతికూలతలను తొలగించడానికి ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.


భద్ర సమయం: రాఖీ పండగ రోజు సోదరుల శ్రేయస్సు కోసం అక్కాచెల్లెల్లు రాఖీని కడతారు. రాఖీ కడుతూ సోదరుల దీర్ఘాయువు కోసం ప్రార్థిస్తూ ఉంటారు. ఈ సారి రక్షా బంధన్ భద్ర ప్రభావంలో ఉంటుంది. ఇటువంటి సమయంలో రాఖీ కట్టకూడదని నమ్ముతారు. ఈ సారి పౌర్ణమి తిథి ఆగస్టు 19 వ తేదీ తెల్లవారుజామున 03:04 గంటలకు ప్రారంభమై ఆగస్టు 19వ తేదీన రాత్రి 11: 55 గంటలకు ముగుస్తుంది. అయితే ఈ రోజు భద్ర సమయం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఆగస్టు 19న 02:21 గంటలకు భద్ర సమయం ప్రారంభం అవుతుంది. భద్ర పూంచ్ ఉదయం 09:51 నుంచి 10:53 వరకు ఉంటుంది. భద్ర ముఖం ఉదయం 10:53 నుంచి మధ్యాహ్నం 12:37 వరకు ఉంటుంది. మధ్యాహ్నం 01: 30 గంటకు భద్ర యాత్ర ముగుస్తుంది.
అయితే ఈ భద్ర సమయం అశుభ సమయంగా పరిగణించబడుతుంది. అందుకే ఈ సమయంలో ఎలాంటి శుభ కార్యక్రమాలు కూడా చేయకుండా ఉంటారు. ఆగస్టు 19న మధ్యాహ్నం 01:30 తర్వాత మాత్రమే రాఖీ కట్టవచ్చు.


రాఖీ కట్టడానికి అనుకూలమైన సమయం:

ఆగస్టు 19 న రాఖీ కట్టడానికి అత్యంత శుభ సమయం మధ్యాహ్నం 01:43 నుంచి 04:20 వరకు. ఈ సమయంలో మాత్రమే మీరు రాఖీని కట్టండి. రాఖీ కట్టడానికి మీకు మొత్తం 2 గంటల 37 నిమిషాల సమయం ఉంటుంది. ఇది రాఖీ పండగ రోజు అత్యంత పవిత్రమైన రోజుగా పరిగణించబడుతుంది. అంతే కాకుండా ప్రదోష కాలంలో సాయంత్రం 06: 56 గంటల నుంచి రాత్రి 09:07 వరకు ఉంటుంది.

భద్రలో రాఖీ పని ఎందుకు కట్టకూడదు ?

రాఖీ పండగ రోజు భద్ర కాలంలో రాఖీని కట్టకూడదు. దీని వెనక ఒక పౌరాణిక కథ కూడా ఉంది. భద్ర కాలంలో లంకాధిపతి రావణుడు సోదరి అతడి మణికట్టుకు రాఖీ కట్టిందని చెబుతుంటారు. అందుకే ఆ సంవత్సరంలోనే అతడి రాజ్యం నాశనం అయిందని అంటారు. భద్ర శని దేవుడి యొక్క సోదరిగా చెబుతారు. భద్రలో ఎవరు ఏ శుభ కార్యాలు చేసినా దాని ఫలితం అశుభంగా మారుతుందని బ్రహ్మ దేవుడు శాపం ఇచ్చాడు.

రాఖీ పండగ పూజా విధి:

రాఖీ కట్టే ముందు సోదర సోదరీమణులు ఉపవాసం ఉండాలి. రాఖీ కట్టే శుభ సమయంలో ముందుగా ఒక ప్లేట్ తీసుకోండి. ప్లేట్‌లో రాఖీ, గంధం, అక్షింతలు, పెరుగు, స్వీట్లు కూడా ఉంచండి. ఆ తర్వాత ఒక నెయ్యి దీపం వెలిగించండి. ఆ తర్వాత సోదరులను తూర్పు, ఉత్తర దిశలో కూర్చోబెట్టి ముందుగా తిలకం దిద్ది రాఖీని కట్టండి. ఆ తర్వాత సోదరులకు హారతి ఇచ్చి, స్వీట్ తినిపించండి. అనంతరం సోదరుల శ్రేయస్సు కోసం ప్రార్థించండి.

సోదరీమణులు రాఖీని కట్టిన తర్వత రాఖీ కట్టించుకున్న వారు తల్లిదండ్రలతో ఆశీర్వాదం తీసుకోవాలి. ఆ తర్వాత మీ స్థాయికి అనుగుణంగా బహుమతిని ఇవ్వండి. రాఖీ కట్టుకునే సమయంలో నల్లని బట్టలు ధరించకుండా ఉంటే మంచిది.

రక్షా సూత్రం లేదా రాఖీ ఎలా ఉండాలి ?
రక్షా సూత్రం ఎరుపు, పసుపు , తెలుపు మూడు దారాలతో కలిసి ఉండాలి. రక్షా సూత్రంలో చందనాన్ని ఉపయోగిస్తే శుభ ప్రదంగా ఉంటుంది.

Also Read: రాఖీ పౌర్ణమి రోజు అద్భుతమైన యోగాలు.. ఈ రాశుల వారి కష్టాలు తొలగిపోయే టైమ్ వచ్చేసింది.

రక్షా బంధన్ రోజు ఈ మంత్రాన్ని జపించండి..

హిందూ మతంలో రాఖీ పండగకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుంది. అటువంటి పరిస్థితిలో మీరు మీ సోదరులకు రాఖీ కట్టేటప్పుడు కూడా ప్రత్యేక మంత్రాన్ని జపించండి ఈ మంత్రాన్ని పఠిస్తూ రాఖీ కట్టడం వల్ల సోదర సోదరీమణుల మధ్య ప్రేమ బలపడటంతో పాటు శాశ్వతంగా ఉంటుంది.
రాక్షసుల రాజు, పరాక్రమవంతుడు అయిన బలి ఎవరిచేత బంధించబడ్డాడో.. మచల్- మచల్ నిన్ను రక్షించడానికి నేను కట్టుబడి ఉన్నాను.

Related News

Horoscope 20 September 2024: ఈ రాశి వారికి పట్టిందల్లా బంగారమే! శ్రీలక్ష్మి ధ్యానం శుభప్రదం!

Lucky Rashi from Durga Sasthi 2024: దుర్గా షష్ఠి నుండి ఈ రాశులకు వరుసగా 119 రోజులు లక్ష్మీ అనుగ్రహం

Mahalaya Surya Grahan 2024: మహాలయలో సూర్యగ్రహణం, ఈ 3 రాశుల వారి జీవితంలో అన్నీ అద్భుతాలే

Surya Grahan 2024: త్వరలో సూర్య గ్రహణం.. ఈ రోజు ఈ పొరపాట్లు అస్సలు చేయకండి

Vriddhi Yog Horoscope: ఈ రాశుల వారిపై ప్రత్యేక యోగం వల్ల కోటీశ్వరులు కాబోతున్నారు

Guru Vakri 2024 : మరో 20 రోజుల్లో బృహస్పతి తిరోగమనం కారణంగా లక్ష్మీదేవి అనుగ్రహం పొందబోతున్నారు

Budh Shani Yuti Horoscope: బుధ-శని సంయోగంతో ఈ 3 రాశుల వారు సంపదను పొందబోతున్నారు

Big Stories

×