చర్మం సాగినా, దగ్గరగా అయినా చారలు పడుతాయి.

హార్మోన్లలో వచ్చే మార్పుల వల్ల ఛాతీ, తొడలు, పిరుదులపై ఈ మార్క్స్ ఏర్పడుతాయి.

మహిళలకు ప్రెగ్నెన్సీ సమయంలో ఈస్ట్రోజన్ పెరగడంతో ఛాతీ పెరిగి స్ట్రెచ్ మార్క్స్ పడతాయి.

రోజుకు కనీసం 8-10 గ్లాసుల నీరు తాగితే ఇవి రావు.

చర్మానికి మాయిశ్చరైజర్ రాయాలి, అలాగే మృతకణాలను పోగొట్టేందుకు ఎక్స్ ఫోలియేషన్ చేయాలి

విటమిన్ సి అధికంగా ఉండే పండ్లు తినాలి.

అలాగే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉండే ఆహారాలను తీసుకోవాలి.

వాల్ నట్స్,  అవిసెగింజలు,  చియాసీడ్స్, సాల్మన్ ఫిష్,  క్యాలీ ఫ్లవర్లలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి.

ఆలివ్ నూనెతో స్ట్రెచ్ మార్క్స్ పై మర్దనా చేస్తే సమస్య తగ్గుతుంది.

కొబ్బరినూనెలో కొలాజెన్ ను దెబ్బతినకుండా కాపాడే గుణం ఉంది.

కొబ్బరినూనెతో స్ట్రెచ్ మార్క్స్ పై ఇంకిపోయేలా మర్దనా చేసినా సమస్య తగ్గుతుంది.