EPAPER

Digestion Problem: వర్షాకాలంలో అజీర్ణ సమస్యతో ఇబ్బంది పడుతున్నారా ? అయితే ఈ ఫుడ్ అస్సలు తినకండి

Digestion Problem: వర్షాకాలంలో అజీర్ణ సమస్యతో ఇబ్బంది పడుతున్నారా ? అయితే ఈ ఫుడ్ అస్సలు తినకండి

Digestion Problem: వర్షాకాలంలో చాలా మంది ఎదుర్కునే సమస్యల్లో అజీర్ణం కూడా ఒకటి. వాతావరణంలో అధిక తేమ కారణంగా జీర్ణవ్యవస్థ మందగిస్తుంది. శరీరంలో బ్యాక్టీరియా పెరుగుదల ఎక్కువగా ఉంటుంది. ఫలితంగా శరీరం అనారోగ్యాల బారిన పడుతుంది. అంతే కాకుండా వర్షాకాలంలో ఎక్కువ మంది వేయించిన ఆహారం, స్పైసీ ఫుడ్ తినడం వల్ల కూడా జీర్ణ వ్యవస్థపై బారం పడుతుంది. దీంతో అరుగుదల దెబ్బతింటుంది. వర్షాకాలంలో ఎక్కువ మంది ఎదుర్కునే సమస్యను తగ్గించుకోవడాని ఎలాంటి ఫుడ్ తినకూడదో ఇప్పుడు తెలుసుకుందాం.


గోధుమలు: గ్లూటాన్ కంటెంట్ గోధుమల్లో అధికంగా ఉంటుంది. దీని వల్ల ఉబ్బరం వంటి అసౌకర్యాన్ని కలిగిస్తుంది. గ్లూటాన్ సెన్సిటివిటీలతో పాటు ఉదరకుహర వ్యాధి ఉన్న వారిలో అజీర్ణం సమస్య  ఎక్కువగా ఉంటుంది. వర్షాకాలంలో జీర్ణ సమస్య వల్ల గ్లూటాన్ ఉన్న  ఆహారాలను జీర్ణం అవడం కష్టంగా మారుతుంది. వర్షాకాలంలో వీలైనంత వరకు బ్రెడ్, పేస్ట్రీలు వంటి గోధుమ ఉత్పత్తులకు దూరంగా ఉండటం మంచిది.

బార్లీ: బార్లీలో పోషకాలు ఎక్కువగా ఉంటాయి. అయినా దీనిని తినడం వల్ల బరువు పెరిగే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. ఇదిలా ఉంటే ముఖ్యంగా వర్షాకాలంలో బార్లీతో తయారు చేసిన ఆహారం జీర్ణం అవడం చాలా కష్టం అవుతుంది. అజీర్ణంతో పాటు గ్యాస్ వంటి సమస్యలు రావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది.


మిల్లెట్స్: వీటిలో పోషకాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి జీర్ణం అవడం చాలా కష్టం. ముఖ్యంగా వర్షాకాలంలో జీర్ణ క్రియ మందగించినప్పుడు మిల్లెట్స్ వంటి ధాన్యాలు తినకుండా ఉంటే బాగుంటుంది. ధాన్యాలను ప్రాసెస్ చేయడం వల్ల జీర్ణ వ్యవస్థకు ఇది సవాలుగా మారుతుంది.

ఓట్స్ : మన శరీరం ఆరోగ్యంగా ఉండటానికి ఓట్స్ ఎంతగానో ఉపయోగపడతాయి. కానీ కొన్ని సార్లు అజీర్ణం సమస్యకు ఇది కారణం అవుతుంది. అందుకే సున్నితమైన జీర్ణ వ్యవస్థ ఉన్న వారు వర్షాకాలంలో ఓట్స్ కు దూరంగా ఉండటం మంచిదని నిపుణులు చెబుతున్నారు. ఇందులో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. అయినప్పటికీ ఈ సీజన్ లో ఓట్స్ తినకుండా ఉంటేనే మంచిది.

జొన్నలు: మొక్కజొన్నలతో పాటు జొన్నలు కూడా అజీర్ణ సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. అలాంటి వారు జొన్నలు తినకుండా ఉంటే చాలా మంచిది. వర్షాకాలంలో అధిక పిండి పదార్థం కలిగిన జొన్నలు తినడం వల్ల అనేక అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ సీజన్లో జొన్నలు తినడం వల్ల గ్యాస్, ఉబ్బరం, అజీర్ణం సమస్య పెరుగుతుంది.

Also Read: పొట్ట పెరిగి ముడతలు పడ్డాయా ? ఈ పొడిని రోజా రాత్రి తీసుకుంటే మొత్తం కరిగిపోద్ది

జంక్ ఫుడ్ : మైదాతో తయారు చేసిన జంక్ ఫుడ్ తినడం వల్ల అనేక అనారోగ్య సమస్యలు వస్తాయి. ముఖ్యంగా వర్షాకాలంలో జంక్ ఫుడ్స్ తినడం వల్ల ఈ సమస్యలు మరింత పెరుగుతాయి. నూడిల్స్, పిజ్జా, బర్గర్ వంటి వాటి వల్ల జీర్ణ సమస్యలు పెరుగుతాయి. అందుకే వర్షాకాలంలో ఇలాంటి ఫుడ్ తీసుకోకుండా ఉంటే మంచిదని నిపుణులు చెబుతున్నారు. వీటికి బదులుగా బియ్యం, క్వినోవాతో పాటు ధాన్యాలను, సులభంగా జీర్ణమయ్యే ఆహారాలను తీసుకోవడం వల్ల వర్షాకాలంలో అజీర్ణం సమస్య పెరుగుతుంది.

Related News

Multani Mitti Face Pack:ముల్తానీ మిట్టితో స్మూత్, గ్లోయింగ్ స్కిన్..

Rosy Cheeks: ఇలా చేస్తే మేకప్ వేసుకోకుండానే ముఖం లేత గులాభీ రంగులో మెరిసిపోతుంది

Ginger Juice Benefits : అల్లం రసం తీసుకుంటే శరీరంలో ఎన్ని మార్పులు జరుగుతాయో తెలుసా !

2050 నాటికి 4 కోట్లకు పైగా మరణాలు.. వాటివల్లే ఆ ముప్పు, తాజా స్టడీలో షాకింగ్ విషయాలు వెల్లడి

Burping: తేన్పులు అతిగా వస్తున్నాయా? మీరు డేంజర్‌లో ఉన్నట్టే!

Tomato Face Pack: పార్లర్‌కు వెళ్లకుండానే టమాటో ఫేస్ ప్యాక్‌తో రెట్టింపు అందం మీ సొంతం !

Prawns Masala: ఆంధ్ర స్టైల్‌లో రొయ్యల మసాలా కూర ఇలా వండారంటే నోరూరిపోతుంది, రెసిపీ ఇదిగోండి

Big Stories

×