EPAPER

Stree 2 Boxoffice: బాక్సాఫీస్ వద్ద ‘స్త్రీ 2’ డామినేషన్.. అక్షయ్ కుమార్, జాన్ అబ్రహంలకు సవాల్?

Stree 2 Boxoffice: బాక్సాఫీస్ వద్ద ‘స్త్రీ 2’ డామినేషన్.. అక్షయ్ కుమార్, జాన్ అబ్రహంలకు సవాల్?

Stree 2 Boxoffice: శ్రద్ధా కపూర్, రాజ్ కుమార్ రావ్, పంకజ్ త్రిపాఠీ, అపార్ శక్తి ఖురానా, అభిషేక్ బెనర్జీ ప్రధాన పాత్రల్లో నటించిన హారర్ కామెడీ చిత్రం ‘స్త్రీ 2’ కు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఆగస్టు 15న విడుదలైన ఈ బాలీవుడ్ చిత్రం రెండు రోజుల్లోనే రూ.90 కోట్లకు పైగా బాక్సాఫీస్ కలెక్షన్లు సాధించింది. గురువారం ఆగస్టు 16 రెండో రోజు సినిమా కలెక్షన్లు కాస్త తగ్గాయి.


సినిమా కలెక్షన్ల సినిమా వెబ్ సైట్ ‘sacnilk’ ప్రకారం.. స్త్రీ 2 రెండో రోజు కలెక్షన్లు రూ.30 కోట్లు ఉండగా. సినిమా ప్రి వ్యూ షోల ద్వారా రూ.8.5 కోట్లు వసూలు చేసింది. అయితే రెండో రోజు శుక్రవారం సెలవు రోజు కాకపోయినా రూ.30 కోట్ల వసూళ్లు సాధించడం మామూలు విషయం కాదు. సినిమాకు ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో మంచి కలెక్షన్స్ రాబడుతోంది. ఇదే స్పీడు కొనసాగితే.. సినిమా రూ.200 కోట్లు సాధించడం పక్కా అని సినీ పండితుల అభిప్రాయం.

ఇండిపెండెన్స్ డే, రక్షా బంధన్ సెలవులు ఉండడంతో ఈ వీకెండ్ కు అదనపు రోజులు కలిసి వచ్చాయి. దీంతో ఈ వారం విడుదలైన సినిమాలకు మంచి అడ్వాంటేజ్ లభించింది. 2024 సంవత్సరంలో బాలీవుడ్ లో సినిమాలు కరువైన సమయంలో ఒక్క స్టార్ హీరో కూడా లేని సినిమా 200 కోట్లు కలెక్షన్స్ సాధించడం చాలా పెద్ద విషయం. పైగా ‘స్త్రీ 2కు పోటీగా అక్షయ్ కుమార్, జాన్ అబ్రహం సినిమాలు విడుదలయ్యాయి. అక్షయ్ కుమార్ నటించిన ‘ఖేల్ ఖేల్ మే’, జాన్ అబ్రహం నటించిన ‘వేదా’ సినిమాలు కూడా ఆగస్టు 15న రిలీజ్ అయ్యాయి. జాన్ అబ్రహం ‘వేదా’ పక్కా యాక్షన్ సినిమా కాగా.. అక్షయ్ కుమార్ నటించిన మల్టీ స్టారర్ సినిమా ‘ఖేల్ ఖేల్ మే’ ఒక రొమాంటిక్ కామెడీ చిత్రం. పైగా అక్షయ్ తోపాటు ఫర్దీన్ ఖాన్, తాప్సీ పన్ను, ప్రగ్యా జైస్వాల్, వాణి కపూర్ నటించారు. మరోవైపు జాన్ అబ్రహంకు జోడీగా మిల్కీ బ్యూటీ తమన్నా నటించింది.


ఈ రెండు సినిమాలతో పోల్చితే ‘స్త్రీ 2’ లో తారాగణం చాలా చిన్నది. చిన్నపాటి టౌన్ లో జరిగే హారర్ కథాంశంతో సినిమా సాగుతుంది. అక్షయ్ కుమార్ నటించిన ‘ఖేల్ ఖేల్ మే’ సినిమా కలెక్షన్ల విషయానికి వస్తే.. రెండు రోజు కేవలం రూ.1.9 కోట్లు వసూళ్లు రాబట్టింది. మొత్తం రెండు రోజుల వసూళ్లు చూస్తే కేవలం రూ.6.95 కోట్లు మాత్రమే వచ్చాయి.

మరోవైపు జాన్ అబ్రహం ‘వేదా’ సినిమాకు శుక్రవారం రెండో రోజు కలెక్షన్స్ రూ.1.6 కోట్లు ఉండగా.. మొత్తం రెండు రోజు వసూళ్లు.. రూ. 7.9 కోట్లు ఉన్నాయి. ఆగస్టు 19 వరకు సెలవులు ఉండడంతో కలెక్షన్స్ పెరిగే అవకాశం ఉంది.

2024లో ఇప్పటివరకు రెండో రోజు అత్యధిక కలెక్షన్స్ సాధించిన సినిమా హృతిక్ రోషన్ నటించిన ‘ఫైటర్’. ఆ సినిమా రెండో రోజు రూ.39.5 కోట్లు కొల్లగొట్టింది. ఇప్పుడు ‘స్త్రీ 2’ , ఫైటర్ తరువాతి స్థానంలో ఉంది. అయితే ‘స్త్రీ 2’ లైఫ్ టైమ్ కలెక్షన్ విషయంలో ఫైటర్ ను అధిగమించే అవకాశాలున్నాయి.

Also Read: ఓటీటీలోకి ‘కల్కి’.. డేట్ ఇదే..

Related News

Johnny Master: ఢీ 11 లో ఎలిమినేట్.. జానీ మాస్టర్ ఇంత కథ నడిపారా.?

Pushpa 2: వార్నర్ మామ ఇండస్ట్రీ ఎంట్రీ,రీల్స్ నుంచి రియల్ సినిమాలోకి

Devara: ఒకవైపు రాజమౌళి హీరో, మరో వైపు త్రివిక్రమ్ చీఫ్ గెస్ట్ ఇక శివ ను ఆ శివయ్యే కాపాడాలి

Prabhas – Hanu : గప్ చుప్ గా షూటింగ్… ఇంత సీక్రెట్ గా ఎందుకో..?

SSMB29 : మహేష్- రాజమౌళి మూవీ బిగ్ అప్డేట్.. ఫ్యాన్స్ రెడీ అవండమ్మా..!

Devara Pre Release Event : దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ ఫిక్స్.. చీఫ్ గెస్టులు గా స్టార్ డైరెక్టర్స్?

10 Years For Aagadu: అంచనాల మీద వచ్చాడు, ఆగకుండా పోయాడు

Big Stories

×