EPAPER

Vinesh Phogat Coach: ఆ రాత్రి ఏం జరిగిందంటే: వినేశ్ ఫోగట్ కోచ్

Vinesh Phogat Coach: ఆ రాత్రి ఏం జరిగిందంటే: వినేశ్ ఫోగట్ కోచ్

Vinesh Phogat coach Reveals Shocking Behind-the-Scenes Details: ఒలింపిక్స్ లో సెమీఫైనల్ బౌట్ అయ్యింతర్వాత చూస్తే, వినేశ్ ఫోగట్ 2.7 కేజీల బరువు పెరిగింది. ఎలాగైనా పెరిగిన బరువు తగ్గిద్దామని విశ్వప్రయత్నం చేశామని వినేశ్ ఫోగట్ కోచ్ హాలండ్ కి చెందిన వోలర్ ఎకోస్ తెలిపాడు. ఆ రోజు రాత్రి ఏం జరిగిందో తను ఒక పోస్ట్ పెట్టాడు. అందులో అంతా కళ్లకు కట్టినట్టు వివరించాడు. ఇంతకీ తనేం రాశాడంటే..


ఫైనల్ కి ముందు రోజు మాకు కాళ రాత్రిలా మారిందని అన్నాడు. నిజానికి సెమీస్ బౌట్ పూర్తయిన తర్వాత చూస్తే, తను 2.7 కేజీల బరువు పెరిగిపోయింది. మనకి ఇంకా ఫైనల్ బౌట్ కి ఒక్కరోజే సమయం ఉంది. ఏం చేయాలరా.. అనుకుంటూ మాకు తెలిసిన అంతర్జాతీయ టెక్నిక్కులన్నీ ప్రయోగించాం. కానీ ఫలితం రాలేదు.

అప్పుడు వినేశ్ ఫోగట్ అన్న ఒక్క మాట నాకింకా గుర్తుందని అన్నాడు. ‘కోచ్ నిరాశపడొద్దు, క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు, అదనపు శక్తి కావాల్సి వచ్చింది. అందుకే  ఆ టైమ్ లో ఫ్లూయిడ్స్ తీసుకున్నాను. అలా ప్రపంచంలోనే అత్యుత్తమ రెజ్లర్లలో ఒకరిని ఓడించి, నేనూ వారిలో ఒకరినని నిరూపించాను. ఇకపోతే పతకాలు, పోడియాలు కేవలం షో కేసులో పెట్టుకునే వస్తువులే.. మన ప్రదర్శన ఒక్కటీ చిరస్థాయిగా నిలిచిపోతుంది’ అని చెప్పింది.


Also Read: జీవితంలో కష్టసుఖాలను గౌరవించాలి: విరాట్ కొహ్లీ

అలా మాకు ధైర్యం చెప్పి, తను నిరాశలో కూరుకుపోవడంతో మాకు దిక్కు తోచలేదు. నిజానికి ఆరోజు రాత్రి తను చేసిన ఎక్సర్ సైజ్ లు చూసి, తను చనిపోతుందేమోనని అనిపించింది. అంత తీవ్రంగా కసరత్తులు చేసింది. నాన్ స్టాప్ గా ఒక గంటా 25 నిమిషాలు ఎక్సర్ సైజ్ లు చేసింది. చూస్తే ఇంకా 1.5 కేజీల బరువు మిగిలింది. ఆ తర్వాత 50 నిమిషాల ఆవిరి స్నానం చేసినా, ఆమె శరీరంపై ఒక్క బొట్టు చెమట కూడా రాలేదు. అర్థరాత్రి నుంచి తెల్లవారు జాము 5.30 వరకు ఆమె వేర్వేరు కార్డియో యంత్రాలపై, విభిన్న రెజ్లింగ్ కసరత్తులు చేసింది. 2-3 నిమిషాలు విశ్రాంతి తీసుకుంటూ కఠోర సాధన చేసింది.

ఒక దశలో తీవ్రమైన సాధన కారణంగా కళ్లు తిరిగి కింద పడిపోయింది. మాకు చాలా భయమేసింది. మొత్తానికి తిరిగి కోలుకుంది. తన బరువు తగ్గడానికి తను చేసిన ప్రయత్నం మాత్రం యావద్భారతదేశానికి స్ఫూర్తి దాయకమని అన్నాడు.

Related News

Shikhar Dhawan: ఆ హాట్‌ బ్యూటీతో గబ్బర్‌ ఎఫైర్‌..సీక్రెట్‌ ఫోటోలు లీక్‌ !

Ravichandran Ashwin: తనే నన్ను ఆడించాడు: సెంచరీ హీరో అశ్విన్

IPL 2025: కోహ్లీ భారీ ప్లాన్‌..RCBలోకి అర్జున్‌ టెండూల్కర్‌ ?

Ravichandran Ashwin: టీమిండియాలో గొడవలు…అశ్విన్‌ ను అవమానించిన గంభీర్‌..?

Mahmud Hasan: మనోళ్లకే చుక్కలు చూపించిన.. హసన్ ఎవరు?

IND vs BAN: అదరగొట్టిన ఆల్ రౌండర్లు : అశ్విన్ సెంచరీ, జడేజా 86 నాటౌట్

Pakistan: మీరింక మారరా…బ్యాట్‌తో బలంగా కొట్టుకున్న పాక్ ప్లేయర్..వీడియో వైరల్‌ !

Big Stories

×