EPAPER

EX Minister Roja Scam: అవినీతి ఆట.. ఫస్ట్ ప్రైజ్ ఎవరికంటే..

EX Minister Roja Scam: అవినీతి ఆట.. ఫస్ట్ ప్రైజ్ ఎవరికంటే..

Ex Minister Roja Arrest in Aadudam Andhra Scam(AP political news): ఆడుదాం ఆంధ్రా.. ఏపీలో క్రీడలను ప్రొత్సహించేందుకు వైసీపీ సర్కార్ నిర్వహించిన ప్రొగ్రామ్.. కానీ.. ఆట పేరుతో నిధులను దుర్వినియోగం చేశారన్నది లెటెస్ట్ ఆరోపణలు. మరి ఇందులో నిజాలేంటి? అసలు ఆరోపణలేంటి? ఆరోపణలు నిజమని తెలితే ఇరుక్కునేది ఎవరు? ఇది రాజకీయంగా ఎలాంటి ఎఫెక్ట్ చూపించనుంది.. ? ఆడుదాం ఆంధ్రాపై ఆరోపణలు అని చెప్పి.. రెడ్‌ బుక్ గురించి చెబుతున్నారనుకుంటున్నారా?


అవును అవినీతి, అక్రమాలకు పాల్పడిన వారిపై చర్యలుంటాయని ఎన్నికల ముందు నుంచి ఇప్పటి వరకు ప్రతిసారి చెబుతున్నారు నారా లోకేష్‌.. ఇప్పుడు ఆయన చెప్పినట్టుగానే అడుగులు పడుతున్నట్టు కనిపిస్తుంది. ఏపీలో స్పోర్ట్స్‌ డెవలప్‌మెంట్‌ కోసం పలు కార్యక్రమాలు నిర్వహించింది అప్పటి వైసీపీ ప్రభుత్వం. ఆడుదాం ఆంధ్రా, సీఎం కప్ అంటూ పలు కార్యక్రమాలు నిర్వహించింది. ఆ సమయంలో క్రీడలశాఖామంత్రిగా ఆర్కే రోజా.. ఏపీ ఒలింపిక్ అసోసియేషన్‌ అధ్యక్షుడిగా ధర్మాన కృష్ణదాస్ ఉన్నారు. ఇప్పుడు వారిద్దరిపై చర్యలు తీసుకునేందుకు రంగం సిద్ధమవుతుంది.

ఏపీ ప్రభుత్వం దానికదే విచారణకు ఆదేశించిందా? లేదు.. కబడ్డీ మాజీ ప్లేయర్ ఆర్డీ ప్రసాద్‌ నిధుల దుర్వినియోగం జరిగిందంటూ సీఐడీకి ఓ కంప్లెంట్ ఇచ్చారు. దీనిపైనే ఇప్పుడు చర్యలు తీసుకునేందుకు రెడీ అవుతుంది పోలీస్ డిపార్ట్‌మెంట్.. ఎన్నికల ముందు 150 కోట్లతో ఆడుదాం ఆంధ్ర ప్రొగ్రామ్ నిర్వహించారు. మొత్తం 47 రోజుల పాటు ఈవెంట్స్ జరిగాయి. 2023 డిసెంబర్ 26న అప్పటి సీఎం వైఎస్ జగన్‌ గుంటూరులో స్పోర్ట్స్‌ ఫెస్టివల్‌ను ప్రారంభించారు. 2024 ఫిబ్రవరి 10న ఈ స్పోర్ట్స్‌ ఫెస్టివల్ ముగిసింది.


ఇందులో నాసిరకం కిట్లు కొనుగోలు చేయడం. పోటీలు జరుగుతున్నప్పుడు క్రికెట్ బ్యాట్లు విరిగిపోవడం. జర్సీలు, ప్లేయర్స్‌కు అందించిన సదుపాయాలు, భోజనాలకు సంబంధించిన నిధులు కూడా స్వాహా అవ్వడం.. టెండర్ల ప్రక్రియ దగ్గర నుంచి మొదలు పెడితే వర్క్ ఆర్డర్‌కు ఇచ్చిన పరికరాలు ఎన్ని? రాష్ట్రానికి వచ్చినవి ఎన్ని? అందులో పంచినవి ఎన్ని? ఇలా అనేక ఆరోపణలు వచ్చాయి. అనుమానాలు ఉన్నాయి. ఇప్పుడు వీటిపైనే చర్యలు తీసుకోవాలంటూ కంప్లైంట్ చేశారు ఆర్డీ ప్రసాద్.

Also Read: ఆర్టీసీ బస్సు డ్రైవర్ గా మారిన

ఇందులో అవినీతి జరిగితే మాజీ మంత్రి రోజా బాధ్యురాలిగా చేరే అవకాశం ఉంది. అవినీతి ఆరోపణలపై దర్యాప్తు చేస్తామని పక్కాగా ఆధారాలు సేకరిస్తామనంటున్నారు. నిజానికి ఇప్పటికే మాజీ మంత్రులు ఒక్కొక్కరికి ఉచ్చు బిగుసుకుంటున్నట్టు కనిపిస్తోంది. ఇక నెక్ట్స్‌ రోజా వంతు అన్నట్టుగా ఉన్నాయి పరిస్థితులు. ఇప్పటికే అనేక మంది మాజీ మంత్రులపై కేసులు నమోదయ్యాయి. ఈవీఎం పగులకొట్టిన కేసులో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి. టీడీపీ ఆఫీస్‌పై దాడి కేసులో గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ..
తమ చేత బలవంతంగా రాజీనామా చేయించారని వాలంటీర్ల ఫిర్యాదుతో కొడాలినానిపై.. టీడీపీ అధినేత చంద్రబాబు ఇంటిపై దాడి కేసులో జోగి రమేష్‌.. ఇలా తలశిల రఘురాం, లేళ్ల అప్పిరెడ్డి, దేవినేని అవినాష్‌, నందిగం సురేష్‌. ఇలా ఒక్కక్కరిపై కేసులు నమోదయ్యాయి. ఇప్పుడు నెక్ట్స్ టర్న్ ఆర్కే రోజానే అనిపిస్తుంది.

నిజానికి ఆడుదాం ఆంధ్రా విషయంలో అప్పుడు కూడా చాలా విమర్శలు వచ్చాయి. వైసీపీ ప్రచారం కోసమే ఈ కార్యక్రమం నిర్వహిస్తుందన్న ఆరోపణలు వినిపించాయి. దీనికి తోడు నాసిరకం కిట్లు.. ఆడుతుండగానే విరిగిపోయిన బ్యాట్లు.. ఇలా అనేక బాగోతాలు బయటకు వచ్చాయి. కానీ వైసీపీ అధికారంలో ఉండటంతో ఎవరూ ఫిర్యాదులు చేయలేదు.. పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు ప్రభుత్వం మారడంతో మరోసారి ఈ అంశం తెరపైకి వచ్చింది. ఇక నేడో రేపో ఆర్కే రోజా, కృష్ణ ప్రసాద్‌లకు నోటీసులు జారీ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. ఇదే జరిగితే ఇక ఈ ఇద్దరు పోలీస్ స్టేషన్‌లు, కోర్టుల చుట్టూ తిరగడం ఖాయంగా కనిపిస్తోంది.

నిజానికి వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు జగన్‌ గొంతుగా మారారు రోజా.. చంద్రబాబు, పవన్‌తో పాటు అప్పుడు విపక్షంలో ఉన్న నేతలపై మాటలతో దాడి చేసేవారు. కానీ ఇప్పుడా పరిస్థితులు కనిపించడం లేదు. గత కొన్ని రోజులుగా ఆమె వైసీపీకి దూరంగా ఉంటున్నట్టు కనిపిస్తోంది. ఢిల్లీలో వైసీపీ నిర్వహించిన ధర్నాలో కూడా ఆమె పాల్గొనలేదు. ప్రస్తుతం ఆమె నగరిలో కాకుండా చెన్నైలో ఎక్కువగా ఉంటున్నారు. మునుపలి ఫైర్ లేదు. మాట తీరు కూడా మారింది. మరి ఈ మార్పు ముందే వచ్చి ఉంటే బాగుండేదని ఇప్పుడీ పరిస్థితి వచ్చేది కాదంటున్నారు. ఏదేమైనా ఇప్పుడు రోజా చుట్టూ ఉచ్చు బిగుసుకుంటున్నట్టే కనిపిస్తోంది.

Related News

Ex MP Nandigam Suresh’s house: ఇదేం కేసు.. వైసీపీ మాజీ ఎంపీ ఇంట్లో సోదాలు, నోటీసులిచ్చిన పోలీసులు

Tirumala Prasadam row: తిరుమల లడ్డూ వివాదం, రామ్ జన్మభూమి ట్రస్ట్.. రమణ దీక్షితులు రియాక్ట్, శారదా పీఠం సైలెంట్ వెనుక..

Pawan Kalyan: తిరుమల లడ్డూ వివాదం.. డిప్యూటీ సీఎం పవన్ సంచలన పోస్ట్

Shani effect to Jagan: జగన్‌ను వెంటాడుతున్న శని, పుష్కర‌కాలంపాటు..

CM Chandrababu warning: తిరుపతి లడ్డూ వివాదం, నిన్ను వదలా అంటున్న సీఎం.. అయోధ్య వరకూ

Tirumala Laddu: ఛీ, ఇంత నీచమా? ఏపీ ప్రజల సెంటిమెంట్‌పై గట్టి దెబ్బ.. వైసీపీని ఈ పాపం వెంటాడుతుందా?

Adani Foundation: ఏపీ వరద బాధితులకు అదానీ ఫౌండేషన్ భారీ విరాళం.. ఎంతనో తెలిస్తే ఆశ్చర్యపోతారు!

Big Stories

×