EPAPER

Ukraine Occupies Russia Town: ‘ఇక మూడో ప్రపంచ యుద్ధమే’.. రష్యా పట్టణాన్ని ఆక్రమించుకున్న యుక్రెయిన్..

Ukraine Occupies Russia Town: ‘ఇక మూడో ప్రపంచ యుద్ధమే’.. రష్యా పట్టణాన్ని ఆక్రమించుకున్న యుక్రెయిన్..

Ukraine Occupies Russia Town: రెండేళ్లకుపైగా సాగుతున్న రష్యా, యుక్రెయిన్ యుద్ధం ఇప్పుడు తీవ్ర రూపం దాల్చబోతోంది. గురువారం రాత్రి రష్యా భూభాగంలోని సుడ్జా పట్టణాన్ని యుక్రెయిన్ సైన్యం ఆక్రమించుకుందని యుక్రెయిన్ అధ్యక్షుడు వొలిడిమిర్ జెలెన్‌స్కీ ధృవీకరించారు. సుడ్జా పట్టణం రష్యా సైన్య కార్యకలాపాలకు చాలా కీలకం. రష్యా, యుక్రెయిన్ సరిహద్దుల వద ఉన్న ఈ పట్టణం నుంచే రష్యా సైన్యం యుక్రెయిన్ పై దాడులకు ప్లానింగ్ చేసేది.


జెలెన్‌స్కీ అధికారిక ప్రకటన ప్రకారం.. సుడ్జా పట్టణంలో రష్యాకు చెందిన 82 స్థావారాలను యుక్రెయిన్ ఆక్రమించుకుంది. ఈ కారణంగా యుక్రెయిన్ సైన్యం సుడ్జా పట్టణంలో శాశ్వత స్థావరం ఏర్పాటు చేయబోతోంది. యుద్ధం ఎంత కాలం సాగుతుందో చెప్పలేని పరిస్థితులు ఉండడంతో యుద్ధం కార్యకలాపాలు నిర్వహించేందుకు, అక్కడి ప్రజలకు ఆహార సరఫరా చేసేందుకు స్థావరం ఏర్పాటు చేయడం జరుగుతుందని ప్రకటనలో యుక్రెయిన్ ప్రభుత్వం పేర్కొంది.

యుద్ధంలో కీలక పరిణామం..
యుక్రెయిన్ సైన్యం ఒక్కసారిగా సుడ్జా పట్టణంపై పెద్ద స్థాయిలో దాడులు చేసింది. వారం రోజులపాట యుక్రెయిన్ కు చెందిన పది వేల మంది సైనికులు ఒక్కసారిగా రష్యా సైన్యంపై విరుచుకుపడడంతో.. రష్యా సైనికులు వెనక్కు తగ్గారు. దాదాపు 100 మంది రష్యా సైనికులను యుక్రెయిన సైన్యం అరెస్టు చేసినట్లు సమాచారం. సుడ్జా పట్టణంలో యుద్ధం తీవ్రం కావడంతో లక్షా 20 వేల మంది పౌరులను వారి నివాసాల నుంచి ఖాళీ చేయించినట్లు రష్యా అధికారులు తెలిపారు.


2022లో ప్రారంభమైన ఈ యుద్ధంలో ఇప్పటివరకు రష్యా సైన్యం క్రమంగా యుక్రెయిన్ భూభాగాన్ని ఆక్రమించుకుంటూ.. పైచేయి సాధించింది. కానీ ఇప్పుడు యుక్రెయిన్ సైన్యం సుడ్జా పట్టణం ఆక్రమించుకోవడంతో రష్యాకు చాలా పెద్ద నష్టమే జరిగింది.

Also Read: ‘డాక్టర్లే డ్రగ్స్ ఇచ్చారు’.. హాలీవుడ్ నటుడి మృతి కేసులో ట్విస్ట్!

యుక్రెయిన్ దాడిపై రష్యా స్పందన
యుద్ధంలో తాజాగా యుక్రెయిన్ పైచేయి సాధించడంపై రష్యా అధికారులు స్పందించారు. ఈ విజయం యుక్రెయిన్ స్వయంగా సాధించలేదని.. యుక్రెయిన్ వెనుక అమెరికా సహా నాటో కూటమి దేశాలున్నాయని రష్యా ఆరోపణలు చేసింది. పైకి నిరాకరించినా.. నాటో డైరెక్టుగా యుక్రెయిన్ తో కలిసి పోరాడుతోందని.. లేకపోతే తమ సైన్యంపై యుక్రెయిన్ సైనికులు పై చేయి సాధించడం అసాధ్యమని రష్యా అధికారులు మండిపడ్డారు.

ఇక మూడో ప్రపంచ యుద్ధమే
రష్యా ఎంపీ మిఖైల్ షెరెమెట్ శుక్రవారం యుక్రెయిన్ యుద్ధ పరిణామాలపై మాట్లాడుతూ.. ”పశ్చిమ దేశాల సహాయంతో రష్యాపై యుక్రెయిన్ చేసిన దాడి ప్రపంచ యుద్ధానికి దారితీసింది. ఇప్పటికే పశ్చిమ దేశాల నుంచి యుక్రెయిన్ కు అందుకున్న ఆయుధాలు, సైనిక సహాయం గురించి మాకు తెలుసు. రష్యా భూభాగంలో ఇన్‌ఫ్రాస్ట్రకచర్ నాశనం మవుతోంది. విదేశీయుల సహాయంతో రష్యాపై దాడి చేయడం జరిగింది. దీంతో ఇది మూడో ప్రపంచ యుద్ధానికి ప్రారంభంగా భావించవచ్చు,” అని అభిప్రాయపడ్డారు.

మరోవైపు అమెరికా, నాటో కూటమి దేశాలు యుక్రెయిన్ చేసిన దాడి గురించి తమకు సమాచారం లేదని.. ఒకవేళ్ చేసినా యుక్రెయిన్ తన రక్షణ కోసం ఈ దాడి చేసి ఉంటుందని తెలిపారు. అయితే ఈ యుద్ధ పరిణామంతో ప్రపంచ యుద్ధం జరిగే ప్రమాదముందని కూడా అంగీకరించారు.

Also Read: ఒక్క రోజులో 10 అంతస్తుల భవన నిర్మాణం పూర్తి.. అంతా చైనా మహిమ!

 

Related News

Zimbabwe Elephants: 200 ఏనుగులను వధించేందుకు ప్రభుత్వం అనుమతి.. ప్రజల ఆకలి తీర్చేందుకేనా?!

Lebanon Pager Blasts: లెబనాన్‌లో పేజర్ పేలుళ్లు.. 12 మంది మృతి.. 2800 మందికి గాయాలు

Eswatini king Wife Zuma: 56 ఏళ్ల రాజుకు 16వ భార్యగా 21ఏళ్ల సుందరి.. ‘రాజకీయం కాదు ప్రేమే కారణం’!

Trump: రెచ్చగొట్టే వ్యాఖ్యల ఫలితమే ఇది.. కమలా హ్యారిస్ పై ట్రంప్ కామెంట్స్

Haiti fuel tanker: హైతీలో ఘోర ప్రమాదం..పెట్రోల్ ట్యాంకర్ పేలుడులో 25 మంది మృతి

Donald Trump: ట్రంప్ పై మరోసారి కాల్పులు.. పెద్ద ప్రమాదం తప్పింది

Myanmar Floods: భారీ వరదలు.. 74 మంది మృతి, 89 మంది గల్లంతు

Big Stories

×