EPAPER

IPS Officers Transfers: ఒకేసారి 10 మంది ఐపీఎస్ ఆఫీసర్లు బదిలీ.. మీ జిల్లా ఎస్పీ ఎవరంటే..?

IPS Officers Transfers: ఒకేసారి 10 మంది ఐపీఎస్ ఆఫీసర్లు బదిలీ.. మీ జిల్లా ఎస్పీ ఎవరంటే..?

IPS Officers Transferred in AP(Latest news in Andhra Pradesh): ఏపీలో పలువురు ఐపీఎస్ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. మొత్తం 10 మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. సత్య ఏసుబాబును డీజీపీ ఆఫీసులో రిపోర్టు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఏపీఎస్పీ 16వ బెటాలియన్ కమాండెంట్ గా కేవీ మురళీ కృష్ణ నియమితులయ్యారు. ఇటు అనంతరం ఎస్పీగా జగదీశ్ ను నియమించింది. గరుడ్ సుమిత్ సునీల్ కు గ్రే హౌండ్స్ కమాండర్ గా పోస్టింగ్ ఇచ్చింది ప్రభుత్వం. విజయవాడ డీసీపీగా మహేశ్వర్ రాజు, గ్రేహౌండ్స్ గ్రూప్ కమాండర్ గా సునీల్ షరాన్, ఇంటెలిజెన్స్ ఎస్పీగా నచికేత్ విశ్వనాథ్, గుంతకల్లు ఎస్ఆర్ పీగా రాహుల్ మీనా, చింతూరు ఏఎస్పీగా పంకజ్ కుమార్ మీనా, పార్వతీపురం ఎస్ డీపీఓగా అంకిత మహవీర్ లను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.


మరోవైపు.. ఏపీలో ప్రభుత్వం అనంతరం బదిలీ అయ్యి, పోస్టింగ్ లేకుండా వెయిటింగ్ లో ఉన్న పలువురు ఐపీఎస్ అధికారులు వరుసగా సెలవులకు దరఖాస్తు చేసుకున్నట్లు తెలుస్తోంది. అయితే, వెయిటింగ్ లో ఉన్న పలువురు ఐపీఎస్ అధికారులు రోజూ ఉదయం 10 గంటలకు డీజీపీ ఆఫీసుకు వెళ్లి అక్కడ హాజరు పట్టికలో సైన్ చేయాలి. పని గంటలు ముగిసేవరకూ డీజీపీ ఆఫీసులోనే ఉండి సంతకం చేశారే మళ్లీ బయటకు రావాలంటూ ఇటీవలే డీజీపీ మెమో జారీ చేశారని, ఈ నేపథ్యంలో వారంతా మూకుమ్మడిగా సెలవు పెట్టి వెళ్లినట్లు సమాచారం.

Also Read: ఒకేసారి 10 మంది ఐపీఎస్ ఆఫీసర్లు బదిలీ.. మీ జిల్లా ఎస్పీ ఎవరంటే..?


ఇదిలా ఉంటే.. కేరళ రాష్ట్రంలోని వయనాడ్ లో ఇటీవల సంభవించిన విపత్తు తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. వందలమంది ప్రాణాలు కోల్పోయారు. వేల సంఖ్యలో బాధితులు తమ కుటంబ సభ్యులను కోల్పోయారు. కొండచరియలు విరిగిపడిన ఘటనలో సుమారు 300 మంది ప్రాణాలు కోల్పోగా, ఎంతోమంది గాయాలపాలయ్యారు. పలువురు ఆచూకీ ఇంకా లభ్యం కాలేదు. ప్రకృతి ప్రకోపంలో ఎంతోమంది అనాథలుగా మారారు. మరెందరో అభాగ్యులుగా మిగిలారు. అయితే, ఈ విపత్తు వేళ ఆ రాష్ట్ర ప్రభుత్వానికి ఏపీ ప్రభుత్వం అండగా నిలిచి తన గొప్ప తనాన్ని చాటుకుంది. వయనా బాధితుల కోసం ఏపీ ప్రభుత్వం రూ. 10 కోట్లు విరాళంగా ప్రకటించింది. సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి ఈ మొత్తాన్ని ఆ రాష్ట్ర ప్రభుత్వానికి విరాళంగా అందించింది.

కాగా, గతంలోనూ కేరళ ప్రభుత్వానికి సాయం చేసి తన గొప్ప మనసును చాటుకుంది ఏపీ ప్రభుత్వం. కేరళలో 2018లో వరదలు విలయం తాండవం చేశాయి. దీంతో కేరళ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఎంతోమంది నిరాశ్రాయులు అయ్యారు. ఆ సమయంలోనూ ఏపీ సీఎంగా చంద్రబాబే ఉన్నారు. అప్పట్లో కూడా ఏపీ తరఫున కేరళకు సాయం అందించారు. మరోవైపు ఏపీలో గవర్నమెంట్ ఉద్యోగులు, పెన్షనర్లు కలిసి కేరళ వరద బాధితుల సహాయం కోసం రూ. 20 కోట్ల వరకు విరాళంగా ఇచ్చారు.

Related News

YCP vs Janasena: జనసేనలోకి చేరికలు.. కూటమిలో లుకలుకలు

YSRCP Petition: తిరుమల లడ్డూ వివాదం.. హైకోర్టులో వైసీపీ పిటిషన్, న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు

Ex MP Nandigam Suresh’s house: ఇదేం కేసు.. వైసీపీ మాజీ ఎంపీ ఇంట్లో సోదాలు, నోటీసులిచ్చిన పోలీసులు

Tirumala Prasadam row: తిరుమల లడ్డూ వివాదం, రామ్ జన్మభూమి ట్రస్ట్.. రమణ దీక్షితులు రియాక్ట్, శారదా పీఠం సైలెంట్ వెనుక..

Pawan Kalyan: తిరుమల లడ్డూ వివాదం.. డిప్యూటీ సీఎం పవన్ సంచలన పోస్ట్

Shani effect to Jagan: జగన్‌ను వెంటాడుతున్న శని, పుష్కర‌కాలంపాటు..

CM Chandrababu warning: తిరుపతి లడ్డూ వివాదం, నిన్ను వదలా అంటున్న సీఎం.. అయోధ్య వరకూ

Big Stories

×