EPAPER

Vinesh Phoghat: కోర్టు తీర్పుపై భారత రెజ్లర్ వినేష్ ఫోగట్‌ వైరల్ పోస్ట్

Vinesh Phoghat: కోర్టు తీర్పుపై భారత రెజ్లర్ వినేష్ ఫోగట్‌ వైరల్ పోస్ట్

Vinesh Phoghat news update(Latest sports news telugu): కోర్టు ఆఫ్ ఆర్భిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్‌ తీర్పు అనంతరం భారత అథ్లెట్ స్టార్ రెజ్లర్ వినేష్ ఫోగట్ సోషల్‌మీడియా వేదికగా తొలి పోస్ట్‌ని ఆమె పంచుకుంది. తాను ఎమోషనల్ అవుతున్న వీడియోకి ఎమోషనల్ సాంగ్‌ని జోడించి ట్యాగ్ చేశారు. ఈ తీర్పు వెలువడిన అనంతరం నేనెంతో బాధపడ్డానని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ పోస్ట్‌కి సంబంధించిన డీటెయిల్స్ నెట్టింట తెగ వైరల్ అవుతుండగా.. నెటిజన్లు ఆమెను ఓదార్చే పనిలో పడ్డారు.


అంతేకాదు పతకం కాదు ముఖ్యం..పతకం రాకపోయినా….సరే తమ దృష్టిలో గోల్డ్ మెడల్ సాధించిన రెజ్లర్‌ అంటూ రకరకాల కామెంట్లతో ఆమెకు మద్ధతుగా నిలుస్తున్నారు. భారత్ రెజ్లింగ్‌ ఛాంపియన్‌గా చరిత్ర పుటల్లోకి ఎక్కావంటూ కామెంట్లు చేస్తున్నారు. అంతేకాదు ఈ దేశం ఎప్పటికి పోరాటం, గేమ్‌ని మరిచిపోదంటూ ఆమెకు ధైర్యం కల్పిస్తున్నారు నెటిజన్లు.2024 ఏడాదిలో జరిగిన పారిస్ ఒలింపిక్స్‌ గేమ్స్‌లో ఫైనల్‌కి చేరిన భారత్‌కి చెందిన తొలి మహిళగా రెజ్లర్ వినేష్ ఫోగట్ రికార్డు సృష్టించింది. అయితే ఆ రికార్డులు ఎంతో కాలం నిలవలేదు. ఆమెకు అనర్హత వేటు రూపంలో ఆమెకు చుక్కెదురైంది. అంతేకాకుండా తన బరువుకు పరిమితి మించి వంద గ్రాములు అధికంగా ఉండటంతో ఆమెపై ఈ వేటు వేశారు.

Also Read: ఢిల్లీ ప్రీమియర్ లీగ్‌లోకి రిషబ్ పంత్‌ ఎంట్రీ


దాంతో ఆమెకు ఏ పతకం సంపాదించలేకపోయింది. ఈ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ కాస్‌ని ఆశ్రయించినా నిరాశే ఎదురైంది. అందులోనూ తనకు రజత పతకం ఇవ్వాలని ఆమె అప్పిల్ చేసినా ఫలితం లేకుండా పోయింది. తన అప్పిల్‌ని కాస్ చెల్లదంటూ షాక్ ఇచ్చింది. వినేష్ పోగట్ పిటీషన్‌ని తిరస్కరించినట్టు బుధవారం తీర్పును రిజర్వ్‌ చేశారు. ఇప్పటికే వారి తీర్పును భారత ఒలింపిక్స్‌ అసోషియేషన్ తప్పు పట్టింది. వినేశ్‌కు మద్దతుగా ఉంటామని ఐఓఏ అధ్యక్షురాలు పీటీ ఉషా భరోసా కల్పించింది. ఇక ఇదే అంశంపై కాస్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ నెల రోజుల్లోపు స్విస్ ఫెడరల్‌ ట్రైబున్యల్‌లో అప్పీల్ చేయవచ్చంటూ సీనియర్ న్యాయవాది విదుష్పత్ సింఘానియా అన్నారు.

Related News

IND vs BAN: అదరగొట్టిన ఆల్ రౌండర్లు : అశ్విన్ సెంచరీ, జడేజా 86 నాటౌట్

Pakistan: మీరింక మారరా…బ్యాట్‌తో బలంగా కొట్టుకున్న పాక్ ప్లేయర్..వీడియో వైరల్‌ !

IND vs BAN Test Match: టెస్టు మ్యాచ్ ఫ్రీ గా.. చూడాలని అనుకుంటున్నారా?

Nikhat Zareen: డీఎస్పీగా గ్రూప్ -1 ఉద్యోగంలో.. తెలంగాణ మహిళా బాక్సర్

SA vs AFG: వన్డే క్రికెట్‌లో పెను సంచలనం..మొదటిసారి దక్షిణాఫ్రికాపై విజయం..

India vs Bangladesh: ఇవాళ్టి నుంచే తొలి టెస్ట్..ఆ ఇద్దరు డేంజరస్ ప్లేయర్లు ఔట్ !

IND vs BAN: వాళ్లిద్దరినీ ఎందుకు తీసుకోవడం లేదంటే: గౌతం గంభీర్

Big Stories

×