EPAPER

10 Behaviours of Selfishness: మీ చుట్టూ ఉన్నవాళ్లు సెల్ఫిష్ అని కనిపెట్టాలా..? అయితే ఈ 10 పాయింట్స్‌తో ఇట్టే పట్టేయండి

10 Behaviours of Selfishness: మీ చుట్టూ ఉన్నవాళ్లు సెల్ఫిష్ అని కనిపెట్టాలా..? అయితే ఈ 10 పాయింట్స్‌తో ఇట్టే పట్టేయండి

10 Behaviours of Selfishness: ప్రతి పనిలో తమ బెనిఫిట్స్ మాత్రమే చూసుకుంటూ కొంతమంది ముందుకెళుతుంటారు. అలాంటి వాళ్లతో కలిసి పనిచేయడం, వాళ్లతో లైఫ్‌లో కలిసి ట్రావెల్ చేయడం మిగిలిన వాళ్లకి చాలా కష్టమైపోయింది. ఎదుటివాళ్లు ఇబ్బందిపడుతున్నారని తెలిసినా వాళ్ల బిహేవియర్లో మాత్రం ఎలాంటి మార్పూ ఉండదు. అలాంటి వాళ్లనే సెల్ఫిష్ అంటే స్వార్థపరులు అంటారు.


ఎదురుగా ఉన్న వ్యక్తి సెల్ఫిష్ పర్సనా లేదా అని కనిపెట్టడం మనలో చాలామందికి సాధ్యం కాదు. దానివల్ల అనుకోని ఇబ్బందుల్లో పడుతుంటాం. అయితే అలాంటి ఇబ్బందుల్లో ఇరుక్కోకుండా ఉండాలన్నా.. మన చుట్టూ ఉన్నవాళ్లలో ఎవరు సెల్ఫిష్ అని ఇట్టే కనిపెట్టేయాలన్నా వాళ్లలో ఈ 10 లక్షణాలని గుర్తించండి.

1.నేనే ఫస్ట్ అనే మెంటాలిటీ:

సెల్ఫిష్‌ పీపుల్‌లో మీరు ఈ లక్షణాన్ని ఈజీగా కనిపెట్టొచ్చు. ఎక్కడైనా చిన్ని ప్రాఫిట్ ఉన్నా అందులో తానే ఫస్ట్ అంటూ ముందుకొచ్చేస్తారు. వాళ్ల అవసరాలకే మిగిలిన వాళ్లందరి అవసరాలకంటే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. దానివల్ల అవతలివాళ్లు ఇబ్బంది పడుతున్నా పట్టించుకోరు.


2. ఎవ్వరి మీద దయ చూపించరు:

సెల్ఫిష్‌ పీపుల్‌లో కనిపించే మరో ఇంపార్టెంట్ లక్షణం ఎవ్వరి ఫీలింగ్స్‌ని పట్టించుకోకపోవడం. కళ్లముందు తన వాళ్లే బాధ పడుతున్నా ఏ మాత్రం సంబంధం లేనట్లు వెళ్లిపోతారు. ఉదాహరణకి మీరేదైనా కష్టంలో ఉండి వళ్లదగ్గరకి హెల్ప్ కోసం వెళ్లారనుకోండి.. హెల్ప్ చేయగలిగి కూడా నో చెప్పేస్తారు. నా వల్ల కాదంటూ తప్పుకుంటారు.

3. అవతలి వాళ్ల ఫీలింగ్స్‌కి విలువివ్వకపోవడం:

స్వార్థంతో నిండిన వాళ్లలో కనిపించే మరో లక్షణం అవతలి వాళ్ల ఫీలింగ్స్‌కి విలువివ్వకపోవడం. ఉదాహరణకి నేను కాలేజీలో చదివేటప్పుడు నాకో ఫ్రెండ్ ఉండేవాడు. ఎప్పుడు ఎగ్జామ్ ఉన్నా నా నోట్స్ పట్టుకుపోయేవాడు. నేను చదువుకోవాలని చెప్పినా బలవంతంగానో లేదా ఎమోషనల్ డ్రామాతోనే నోట్స్ తీసుకునేవాడు. ఇది సెల్ఫిష్‌నెస్‌కి పర్‌ఫెక్ట్ ఉదాహరణ.

4. అన్నీ తనకే కావాలనుకోవడం:

సెల్ఫిష్ పీపుల్ అన్నీ తనకే కావాలనుకుంటారు. ఉదాహరణకి మీరు మీ బైక్‌పై ఎక్కడికైనా అర్జెంట్‌గా వెళ్తున్నారనుకుందాం. ఇంతలో మీ ఫ్రెండ్ వచ్చి తనకు వెంటనే బైక్ కావాలని ఇచ్చేదాకా పట్టుబట్టి కూర్చున్నాడనుకోండి. అతడు కచ్చితంగా సెల్ఫిష్ పర్సన్ అని అర్థం.

5. అవతలి వాళ్ల గురించి పట్టించుకోకపోవడం:

స్వార్థంతో ఆలోచించే వాళ్లు ఎప్పుడూ అవతలివాళ్ల గురించి పట్టించుకోరు. ఏదైనా డెసిషన్ వల్ల లేదా ఏదైనా పని వల్ల తనవాళ్లే నష్టపోతున్నా పూర్తిగా ఇగ్నోర్ చేసి ముందుకెళతారు. వాళ్ల అవసరం తీరిందా లేదా అని మాత్రమే చూసుకుంటారు.

6. ఏ విషయంలోనూ కాంప్రమైజ్ కావడానికి ఇష్టపడరు:

రిలేషన్‌షిప్ అయినా, ఫ్రెండ్‌షిప్ అయినా, ఫ్యామిలీ అయినా.. ఎవ్వరితోనూ ఏ విషయంలోనూ కాంప్రమైజ్ కావడానికి సెల్ఫిష్ పీపుల్ ఇష్టపడరు. దానివల్ల అవతలివాళ్లతో అవసరం అయితే గొడవ పడడానికి కూడా రెడీ అయిపోతారు. ఈ తీరు వల్ల అప్పుడప్పుడూ అనుకోని ఇబ్బందుల్లో కూడా పడుతుంటారు. కానీ ఈ లక్షణాన్ని మాత్రం వదులుకోరు.

7. అవతలివాళ్ల మాట్లాడుతున్నప్పుడు మధ్యలో దూరడం:

సెల్ఫిష్ పీపుల్లో ఎక్కువగా కనిపించే లక్షణం మధ్యలో దూరడం. ఉదాహరణకి కొంతమంది ఫ్రెండ్స్ కూర్చుని మాట్లాడుకుంటున్నారు అనుకోండి. అందులో ఎవరో ఒకరు మిగిలిన వాళ్ల మాటలని మాటి మాటికీ మధ్యలో కట్ చేస్తూ తాను మాట్లాడేది అందరూ వినాలన్నట్లు ప్రవర్తిస్తుంటారు.

8. డబ్బా కొట్టుకోవడం:

తనని అందరూ గొప్పగా చూడాలనుకునే లక్షణం సెల్ఫిష్ పీపుల్లో కనిపిస్తుంది. అందుకే తన గురించి ఎప్పుడూ గొప్పగా చెప్పుకుంటూ మాట్లాడుతుంటారు. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే డబ్బా కొట్టుకుంటారన్నమాట.

9. విక్టిమ్ కార్డ్ ప్లే చేయడం:

సెల్ఫిష్ పీపుల్లో చాలా సాధారణంగా మీరు ఈ లక్షణాన్ని గుర్తించొచ్చు. ఏదైనా సమస్య రాగానే వెంటనే తాను ఎంతో నష్టపోయానంటూ విక్టిమ్ కార్డ్ ప్లే చేసి సింపతీ కోసం ప్రయత్నిస్తారు. ఉదాహరణకి ఏదైనా విషయంలో వాళ్లదే తప్పున్నప్పటికీ ఒప్పుకోకపోగా తనని ఇరికించారంటూ అందరి ముందు నటిస్తారు.

10. సహాయం చేసిన వాళ్లని కూడా పట్టించుకోరు:

ఎవరైనా చిన్న సహాయం చేసినా వాళ్లకి రుణపడి ఉండడం, కృతజ్ఞతా భావంతో ఉండడం ప్రతి జీవిలో సర్వసాధారణం. కానీ ఈ సెల్ఫిష్ జీవుల్లో మాత్రం ఆ లక్షణం ఉండదు. కష్టంలో ఉన్నప్పుడు సహాయం చేసిన వాళ్లని కూడా అవసరం తీరిపోగానే ఏ మాత్రం పట్టించుకోరు.

ఇవి సెల్ఫిష్ పీపుల్‌లో ఉండే లక్షణాలు. వీటిని కనుక మీరు కనిపెట్టగలిగితే మీ చుట్టూ ఉండే వాళ్లలో నిజమైన ఫ్రెండ్స్ ఎవరో, సెల్ఫిష్ ఎవరో ఇట్టే కనిపెట్టేయొచ్చు. అంతేకాదు మీ చుట్టూ ఉండే వాళ్లలో ఎవరిలో అయినా ఈ లక్షణాలను కనిపిస్తే వెంటనే వాళ్లకి దూరంగా ఉండండి.

Related News

Multani Mitti Face Pack:ముల్తానీ మిట్టితో స్మూత్, గ్లోయింగ్ స్కిన్..

Rosy Cheeks: ఇలా చేస్తే మేకప్ వేసుకోకుండానే ముఖం లేత గులాభీ రంగులో మెరిసిపోతుంది

Ginger Juice Benefits : అల్లం రసం తీసుకుంటే శరీరంలో ఎన్ని మార్పులు జరుగుతాయో తెలుసా !

2050 నాటికి 4 కోట్లకు పైగా మరణాలు.. వాటివల్లే ఆ ముప్పు, తాజా స్టడీలో షాకింగ్ విషయాలు వెల్లడి

Burping: తేన్పులు అతిగా వస్తున్నాయా? మీరు డేంజర్‌లో ఉన్నట్టే!

Tomato Face Pack: పార్లర్‌కు వెళ్లకుండానే టమాటో ఫేస్ ప్యాక్‌తో రెట్టింపు అందం మీ సొంతం !

Prawns Masala: ఆంధ్ర స్టైల్‌లో రొయ్యల మసాలా కూర ఇలా వండరంటే నోరూరిపోతుంది, రెసిపీ ఇదిగోండి

Big Stories

×