EPAPER

Vande Bharat Train Deal:100 వందే భారత్ రైళ్ల తయారీపై కేంద్రం యూటర్న్? రూ.30 వేల కోట్ల ఒప్పందం ఎందుకు రద్దు చేశారంటే?..

Vande Bharat Train Deal:100 వందే భారత్ రైళ్ల తయారీపై కేంద్రం యూటర్న్? రూ.30 వేల కోట్ల ఒప్పందం ఎందుకు రద్దు చేశారంటే?..

Vande Bharat Train Deal| కేంద్ర ప్రభుత్వం రూ. 30 వేల కోట్ల ‘వందే భారత్ ఎక్స్‌ప్రెస్’ రైళ్ల తయారీ ఒప్పందం రద్దు చేసుకుంది. జాతీయ మీడియా కథనాల ప్రకారం… సెమీ హైస్పీడ్ ట్రైన్ లైన వందే భారత్ ఎక్స్ ప్రెస్ ల తయారీ కోసం పిలిచిన టెండర్ లో ఆల్స్‌టమ్ ఇండియా కంపెనీ గెలిచింది. కానీ ఇప్పుడా ఆ టెండర్ ని రైల్వే శాఖ రద్దు చేసినట్లు సమాచారం.


అయితే ఈ విషయంపై ఆల్స్‌టమ్ ఇండియా కంపెనీ ప్రతినిధులు స్పందించారు. భారత రైల్వేశాఖ టెండర్‌ను రద్దు చేసుకున్నా.. తాము ఎప్పుడు అవసరమొచ్చినా భవిష్యత్తులో వందే భారత్ ప్రాజెక్టులో సహకారం అందిస్తామని తెలిపారు.

మీడియా కథనాల ప్రకారం.. రైల్వే శాఖ టెండర్ కమిటీతో ఆల్స్‌టమ్ ఇండియా కంపెనీ ట్రైన్ల తయారీ ధర విషయంలో ఏకీభవించలేదు. ఆల్స్‌టమ్ ఇండియా కంపెనీ ఒక వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ట్రైన్ తయారీ కోసం రూ.150.9 కోట్లు టెండర్ కోట్ చేసింది. కానీ ఆ ధర చాలా ఎక్కువగా రైల్వే శాఖ టెండర్ కమిటీ భావించింది. దీంతో ఆ ధరను రూ.140 కోట్లకు తగ్గించమని గత కొన్ని రోజులుగా బేరసారాలు జరిగాయి. అయితే ఆల్స్‌టమ్ ఇండియా కంపెనీ ఒక ట్రైన్ తయారీ ధరను రూ.145 కోట్లకు సవరించింది.


వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ట్రైన్ల తయారీకి రైల్వే శాఖ పిలిచిన టెండర్ లో చాలా కంపెనీలు కొటేషన్ పంపగా.. అందరికంటే తక్కువ ధర ఆల్స్‌టమ్ ఇండియా కంపెనీ కోట్ చేసింది. ఈ టెండర్ 100 వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ట్రైన్ల తయారీ కోసం పిలపింది. మొత్తం టెండర్ విలువ రూ.30 వేల కోట్లు. ఈ టెండర్ పాల్గొన్న మిగతా కంపెనీలలో స్విట్జర్లాండ్ కు చెందిన స్టాడ్లర్ రైల్, హైదరాబాద్ కు చెందిన మేధా సర్వో డ్రైవ్స్ కంపెనీలు ఒక ట్రైన్ తయారీ కోసం రూ. 170 కోట్లు కోట్ చేశాయి.

Also Read: హైదరాబాద్ వాసులు కుటుంబంతో సరదాగా గడిపేందుకు అందమైన ప్రాంతాలివే.. సెలవుల్లో మంచి ఆప్షన్!

ఈ టెండర్ వివరాల్లో కి వెళ్తే..రైల్వే శాఖ టెండర్ గెలుచుకున్న కంపెనీకి ముందస్తుగా రూ.13 వేల కోట్లు చెల్లిస్తుంది. ఆ తరువాత ట్రైన్ల రిపేర్లు, మెయిన్‌టెనెన్స్ కోసం రూ.17 వేల కోట్లు దశల వారీగా 35 ఏళ్లలో కంపెనీకి చెల్లిస్తుంది.

వందే భారత్ ఎక్స్ ప్రెస్ ట్రైన్ వివరాలు:
ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం తలపెట్టిన మేక్ ఇన్ ఇండియా క్యాంపెయిన్ లో భాగంగా దేశంలోనే తొలిసారి ఒక సెమీ హైస్పీడ్ ట్రైన్ తయారు చేయాలని భావించింది. దాని పేరే వందే భారత్ ఎక్స్ ప్రెస్. ఈ ప్రాజెక్ట్ 2019లో భారత రైల్వే శాఖ ప్రారంభించింది. అలా 2019లో తొలి వందే భారత్ ఎక్స్ ప్రెస్ ట్రైన్ ని ఫిబ్రవరి 15న ఢిల్లీ నుంచి కాన్పూర్, అలహాబాద్, వారణాసి మార్గంలో నడిపించారు.

Also Read: ఒక్క రోజులో 10 అంతస్తుల భవన నిర్మాణం పూర్తి.. అంతా చైనా మహిమ!

Related News

Uttarakhand Train: రైలు ప్రమాదానికి భారీ కుట్ర.. పట్టాలపై 6 మీటర్ల ఇనుస రాడ్

Mahalakshmi Scheme: కాంగ్రెస్ హామీని కాపీ కొట్టిన బీజేపీ

Rahul Gandhi: ఖర్గే, నడ్డాల లేఖల యుద్ధం

Toxic Workplace: వర్క్ ప్రెజర్‌ తట్టుకోలేక ప్రైవేట్ ఉద్యోగిని మృతి.. రంగంలోకి దిగిన సర్కారు

Delhi CM: ఢిల్లీ సీఎంగా అతిశీ ప్రమాణానికి డేట్ ఫిక్స్

Rahul Gandhi Vs Ravneet Bittu: జాతీయ పార్టీల అధినేతల మధ్య లేఖల యుద్ధం..

Monkeypox Case in India: భారత్‌ను వణికిస్తున్న మంకీపాక్స్.. రెండో కేసు నమోదు.

Big Stories

×