EPAPER

CM RevanthReddy: సీఎం రేవంత్‌తో అభిషేక్ మను‌సింఘ్వీ భేటీ

CM RevanthReddy: సీఎం రేవంత్‌తో అభిషేక్ మను‌సింఘ్వీ భేటీ

CM RevanthReddy: ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్‌రెడ్డితో భేటీ అయ్యారు కాంగ్రెస్ సీనియర్ నేత, న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి. ఇరువురు మధ్య దాదాపు పావుగంట సేపు మాట్లాడినట్టు తెలుస్తోంది. వివిధ అంశాలపై చర్చించినట్టు తెలుస్తోంది.


తెలంగాణ నుంచి రాజ్యసభ అభ్యర్థిగా అభిషేక్ మను సింఘ్విని కాంగ్రెస్ హైకమాండ్ ఖరారు చేసింది. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్‌కు ఆయన ధన్యవాదాలు తెలిపారు. రాజ్యసభ స్థానాలకు కేంద్ర ఎన్నికల సంఘం బుధవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. తెలంగాణ నుంచి ఒక సీటు ఉంది.

గతంలో బీఆర్ఎస్‌లోవున్న కె కేశవరావు ఆ పార్టీకి రాజీనామా చేసి, కాంగ్రెస్‌కి వచ్చారు. ఈ నేపథ్యంలో తెలంగాణలో రాజ్యసభ సీటుకు ఉప‌ఎన్నిక అనివార్యమైంది. కేకే ప్లేస్‌లో అభిషేక్ మనుసింఘ్వీకి పెద్దల సభకు పంపించాలని కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయించింది. ఆయనకు టికెట్ ఓకే చేసింది కూడా.


ALSO READ: హరీశ్ రాజీనామా చేయాలంటూ వెలిసిన ఫ్లెక్సీలు

సుదీర్ఘంగా కాంగ్రెస్ పార్టీకి సేవలందిస్తున్నారు అభిషేక్ మనుసింఘ్వీ. 2001 నుంచి పార్టీ అధికార ప్రతినిధిగా పని చేస్తున్నారు. రెండుసార్లు పెద్దల సభకు ఎన్నికయ్యారు. అయితే ఈ ఏడాది మొదట్లో జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో హిమాచల్‌ప్రదేశ్ నుంచి పోటీ చేశారు. బీజేపీ అభ్యర్థి చేతిలో ఓడిపోయారు.

ఆయన అనుభవాన్ని గుర్తించిన కాంగ్రెస్ పెద్దలు, మనుసింఘ్వీని రాజ్యసభకు పంపాలని నిర్ణయించు కుంది. ఈనెల 21న రాజ్యసభ ఎన్నికలకు నామినేషన్ ప్రక్రియ కొనసాగనుంది. 27న నామినేషన్ ఉప సంహరణ ప్రక్రియకు గడువు ఉంది. సెప్టెంబర్ మూడున పోలింగ్ జరగనుంది.. అదే రోజు ఫలితాలు వెల్లడికానున్నాయి.

Related News

Phone Tapping Case: ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు కీలక పరిణామం.. వారికి రెడ్‌ కార్నర్‌ నోటీసులు!

Cabinet Meeting: నేడు తెలంగాణ కేబినెట్ భేటీ.. పలు కీలక అంశాలపై చర్చ

Cash for Vote Scam: ఓటుకు నోటు కేసులో సీఎం రేవంత్ రెడ్డికి భారీ ఊరట

BRS Mlc Kavitha: రంగంలోకి కవిత.. రీఎంట్రీకి ముహూర్తం ఫిక్స్!

New Ration Card: ప్రజలకు శుభవార్త.. అక్టోబర్ 2 నుంచి రేషన్ కార్డులకు అర్జీలు.. అర్హతలు ఇవే!

Shankar Nayak: శంకర్ నాయక్.. వంకర బుద్ధి! దళితుల భూములతో ఆటలు

Chandrababu Naidu: సీఎం రేవంత్ రెడ్డి మీటింగ్‌లో నారా బ్రాహ్మణి.. స్కిల్ వర్సిటీ బాధ్యతలు?

Big Stories

×