EPAPER

Jagan team: జగన్ టీమ్ యాక్టివ్.. చంద్రబాబు ప్రభుత్వానికి కష్టాలు.. షాకైన అధికారులు

Jagan team: జగన్ టీమ్ యాక్టివ్.. చంద్రబాబు ప్రభుత్వానికి కష్టాలు.. షాకైన అధికారులు

Jagan team: చంద్రబాబు సర్కార్‌ని జగన్ టీమ్ నడిపిస్తోందా? వివాదాస్పద అధికారులు కొంతమంది కీలక పదవుల్లో కొనసాగుతున్నారా? అధికారుల వ్యవహారశైలిని చూసి టీడీపీ సర్కార్ ఉలిక్కిపడిందా? ఎందుకు 16 మంది ఐపీఎస్‌లకు బాబు సర్కార్ పోస్టింగ్ ఇవ్వలేదు? ఇవే ప్రశ్నలు ఇప్పుడు ఏపీ ప్రజలను వెంటాడు తున్నాయి.


ఏపీలో టీడీపీ అధికారంలోకి వచ్చి రెండు నెలలు పూర్తి అయ్యింది. కానీ ఏ కేసు ఫైలు పట్టుకున్నా ముందు కు కదల్లేదు. ఒకవేళ ఫైలు కదిపినా వైసీపీకి అనుకూలంగా రావడంతో అధికారులు తొలుత లైట్‌గా తీసుకు న్నారు. నిజమేనని నమ్మారు. మోసాలు ఎన్నిరోజులు ఆగుతాయి.. ఈ రోజు కాకపోయినా, రేపైనా బయట పడాల్సిందే. ప్రస్తుతం ఏపీలో కూడా అదే జరిగింది.

తాజాగా ఏపీ డీజీపీ ద్వారకా తిరుమలరావు బుధవారం ఒక మెమో జారీ చేశారు. 16 మంది సీనియర్ ఐపీఎస్ అధికారులకు ప్రభుత్వం పోస్టింగ్ ఇవ్వలేదు. వారంతా ప్రతీ రోజూ ఉదయం, సాయంత్రం డీజీపీ ఆఫీసుకు హాజరుకావాలన్నది మెమో సారాంశం.దీంతో జగన్ నమ్మినబంటులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.


ALSO READ: మరో ప్రయోగానికి ఇస్రో సిద్ధం.. ఉదయం 9.17 గంటలకు ప్రయోగం

ఒక్కసారి 50 రోజుల వెనక్కి వెళ్దాం. చంద్రబాబు సర్కార్‌పై తొలిసారి ప్రధాని నరేంద్రమోదీకి లేఖ రాశారు పులివెందుల ఎమ్మెల్యే జగన్. ఆ లేఖలో చివర రెండు లైన్లలో ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు ఇప్పటి వరకు పోస్టింగ్ ఇవ్వకుండా ఇబ్బందిపెడుతున్నారన్నది అందులోని కీ పాయింట్. ఆనాడు జగన్ ఆ లేఖ ఆ విధంగా ఎందుకు రాశారో తెలీదు.. దాని వెనుకున్న అర్థం ఇప్పుడే బయటపడుతోంది.

సీన్ కట్ చేస్తే.. ప్రస్తుతానికి వచ్చేద్దాం. ఏపీ డీజీపీ జారీ చేసిన మెమో విషయానికొద్దాం. చంద్రబాబు సర్కార్ పోస్టింగ్ ఇవ్వకుండా పెండింగ్‌లోవున్న 16 మంది ఐపీఎస్ అధికారులు.. గతంలో జగన్ ప్రభుత్వా నికి తొత్తులుగా వ్యవహరించారు. పైగా వారంతా సీనియర్ అధికారులు కూడా. వీరంతా ఉదయం 10 గంట లకు డీజీపీ ఆఫీసుకి వచ్చి సంతకం చేసి, సాయంత్రం వెళ్లేటప్పుడూ సంతకం చేయాలని సూచన చేశారు. ఏదైనా అర్జెంట్ పని అప్పగించడానికి అందుబాటులో ఉండాలని ఆదేశించారు.

ఆ అధికారుల గురించి మీకు తెల్సిందే. ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ దగ్గర నుంచి విజయవాడ మాజీ కమిష నర్ వరకు ఆ స్థాయి అధికారులున్నారు. చంద్రబాబు సర్కార్ అధికారంలో వచ్చిన తర్వాత కొన్ని కేసు లను సీఐడీ, ఏసీబీకి అప్పగించింది. పోస్టింగ్ కోసం వెయిట్ చేస్తున్న అధికారులంతా ఆయా కేసులను మేనేజ్ చేస్తున్నట్లు అంతర్గతంగా బయటకు వచ్చింది.

ఈ విషయం తెలిసి ప్రభుత్వంలో కొందరు అధికారులు షాకయ్యారు. చివరకు ఈ వ్యవహారం డీజీపీ ఆఫీసు కు చేరడంతో అటు వైపు ఫోకస్ చేసింది. ఈ క్రమంలో డీజీపీ ఆఫీసు నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయని అంటున్నారు. జగనన్నా మజాకా..? అధికారంలో ఉన్నా, లేకున్నా జగన్.. జగనే. ఎలా మేనేజ్ చేయాల న్నది ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. చేతికి మట్టి అంటుకోకుండా తన టీమ్‌తో వెనుక నుంచి నడిపిస్తు న్నారన్నది టీడీపీ నేతల మాట.

Related News

YS Jagan: సూపర్ స్వామి, జీర్ణవ్యవస్థ.. మళ్లీ టంగ్ స్లిప్ అయిన జగన్

Chandhrababu: ఇప్పుడు జనంలో కనిపించినట్టు జగన్.. సీఎంగా ఉన్నప్పుడు కనిపించేవాడా? : చంద్రబాబు

Kethireddy: ఇప్పటికైనా నోరు విప్పు జగన్.. ఎందుకు మౌనంగా ఉంటున్నావ్..? : కేతిరెడ్డి

Tirupati Laddu: తిరుమలలో నిత్యం 3 లక్షల లడ్డూలు విక్రయం.. 500 కోట్లు వార్షిక ఆదాయం.. కల్తీ నెయ్యి వివాదం తరువాత..

YS Jagan: తిరుమల లడ్డూ వివాదంపై స్పందించిన జగన్.. చంద్రబాబు పెద్ద దుర్మార్గుడు

Tirupati Laddu Row: ఆ సంస్థ నెయ్యిలోనే అవన్నీ కలిశాయి.. 39 రకాల టెస్టుల్లో తేలింది ఇదే: టీటీడీ ఈవో

Vidadala Rajini: మాజీ మంత్రి విడుదల రజనీకి కష్టాలు.. రేపో మారో అరెస్ట్ తప్పదా?

Big Stories

×