EPAPER

Horoscope: నేటి రాశి ఫలాలు..ఈ రాశి వారు నవగ్రహ శ్లోకాలు పఠిస్తే మెరుగైన ఫలితాలు!

Horoscope: నేటి రాశి ఫలాలు..ఈ రాశి వారు నవగ్రహ శ్లోకాలు పఠిస్తే మెరుగైన ఫలితాలు!

Astrology Today: జ్యోతిష్యశాస్త్ర ప్రకారం మొత్తం పన్నెండు రాశులు. ఇందులో ఏ రాశి వారికి ఎలా ఉంటుంది? ఏ రాశి వారికి కలిసొచ్చే అవకాశం ఉంది ? వంటి వాటిపై జ్యోతిష్యులు ఏలాంటి విషయాలు చెప్పారో తెలుసుకుందాం.


మేషం:
మేష రాశి వారికి సామాన్యంగా ఉంటుంది. ప్రారంభించిన పనుల్లో ఆటంకాలు ఎదురైనా సకాలంలో పూర్తిచేస్తారు. వృత్తి, వ్యాపార, ఉద్యోగాల్లో శారీరక శ్రమ పెరుగుతుంది. కీలక విషయాల్లో సహనం కోల్పోవద్దు. ఇతరులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. ఆరోగ్యంపై శ్రద్ద అవసరం. ఆర్థికంగా ఆశించిన ప్రయోజనాలు ఉంటాయి. శ్రీసుబ్రహ్మణ్య భుజం స్తవం చదివితే మంచిది.

వృషభం:
ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వృత్తి, వ్యాపార రంగాల్లో ఆశించిన లాభాలు చేకూరుతాయి. ముఖ్యమైన పనుల్లో తోటివారి సహకారంతో పూర్తి చేస్తారు. ఇతరులతో ఆచితూచి వ్యవహరించాలి. మోసాలు చేసే అవకాశాలు ఉన్నాయి. ప్రయాణాలు అనుకూలిస్తాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది. కొన్ని పనులు నిరుత్సాహపరుస్తాయి. ఆదాయాన్ని మించి ఖర్చులు ఉంటాయి. శ్రీరామనామ జపం శక్తినిస్తుంది.


 మిథునం:
ఈ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి చేపట్టిన పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు. వృత్తి, వ్యాపార రంగాల్లో లాభాలు వరిస్తాయి. సంతోషకరమైన వార్తలు వింటారు. అవసరానికి ధనం సమకూరుతుంది. ఆర్థికంగా మేలు జరుగుతుంది. బంధుమిత్రులతో ఆచితూచి వ్యవహరించాలి. శ్రీ వేంకటేశ్వర స్వామి ఆరాధన శుభప్రదం.

కర్కాటకం:
కర్కాటక రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. ముఖ్యమైన పనులు బుద్ధిబలంతో పూర్తిచేస్తారు. కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు. వృత్తి, వ్యాపారులకు ఆశించిన ప్రయోజనాలు ఉంటాయి. ఉద్యోగులకు ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు అందుతాయి. పెట్టుబడులు పెరుగుతాయి. తోటివారి సహకారంతో విజయం సాధిస్తారు. శివారాధన శ్రేయస్కరం.

సింహం:
సింహ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. వృత్తి, వ్యాపార రంగాల్లో కీలక పనుల్లో జాగ్రత్తగా వ్యవహరించాలి. ఆత్మవిశ్వాసం కోల్పోకుండా పనులు పూర్తయ్యేవరకు శ్రమిస్తారు. ఉద్యోగాల్లో పురోగతి, ఆర్థిక ప్రయోజనాలు చేకూరుస్తాయి. అవసరానికి డబ్బు చేతికి అందుతుంది. ఆరోగ్యం క్షీణిస్తుంది. చంద్రశ్లోకం చదివితే శుభఫలితాలు కలుగుతాయి.

కన్య:
ఈ రాశి వారికి అనుకూలంగా లేదు. అన్ని రంగాల వారు ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులతో కలహాలు ఏర్పడవచ్చు. కొన్ని సమయాల్లో ఇతరుల సహకారం ఉంటుంది. ఆస్తి విషయాల్లో జాగ్రత్తగా వ్యవహరించాలి. మొహమాటం దరిచేరనీయకండి. జలగండం ఉండవచ్చు.నవగ్రహశ్లోకాలు పఠిస్తే మెరుగైన ఫలితాలు ఉంటాయి.

తుల:
ఈ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. వృత్తి, వ్యాపారాల్లో చేపట్టిన పనులను సకాలంలో పూర్తి చేస్తారు. ఉద్యోగులకు ప్రమోషన్స్, స్తాన చలనం ఉండవచ్చు. శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆశించిన ఫలితాలు వరిస్తాయి. పెద్దల సలహాలు తీసుకుంటారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది. సూర్యష్టకం చదివితే బాగుంటుంది.

వృశ్చికం:
ఈ రాశి వారికి అనుకూలంగా లేదు. ముఖ్యమైన పనుల్లో ఆటంకాలు ఏర్పడతాయి. వృత్తి, వ్యాపారాల్లో అనుకున్న విజయాలు అందకపోవచ్చు. ఇతరులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. అనవసర ఖర్చులు వేధిస్తాయి. ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకోవాలి. కుటుంబ సభ్యులతో వాదనలు దిగవద్దు. కొత్త ప్రాజెక్టుల విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. శివ నామస్మరణ ఉత్తమ ఫలితాలను ఇస్తుంది.

ధనుస్సు:
ధనుస్సు రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. అన్ని రంగాల్లో చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. వృత్తి, వ్యాపారాల్లో ఆశించిన లాభాలు ఉంటాయి. ఒక మంచి శుభవార్త వింటారు. కీలక వ్యవహారాల్లో పెద్దల సహాయం ఫలిస్తుంది. బంధుమిత్రులతో సంతోషంగా ఉంటారు. ఉద్యోగులు ఉన్నతాధికారుల నుంచి ప్రశంసులు అందుకుంటారు. సమాజంలో హోదా పెరుగుతుంది. ఆదిత్య హృదయం పారాయణ శక్తినిస్తుంది.

మకరం:
మకర రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వృత్తి, వ్యాపార రంగాల్లో సవాళ్లు ఎదుర్కొంటారు. కీలక వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించాలి. ఉద్యోగులకు సహోద్యోగుల సహకారం ఉంటుంది. ఆదాయాన్ని మించిన ఖర్చులు ఉంటాయి. ఇతరులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. కార్యసిద్ది హనుమ ఆరాధనతో మెరుగైన ఫలితాలు ఉంటాయి.

Also Read: అంగారకుడి సంచారం.. ఈ రాశుల వారు తప్పక వాహనాలు కొనుగోలు చేస్తారు

కుంభం:
కుంభ రాశి వారికి అద్భుతంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి ఆశించిన లాభాలు ఉంటాయి. వ్యాపారంలో కొత్త ప్రాజెక్టులు చేపడతారు. సంతోషం కలిగించే వార్తలు వింటారు. ఉద్యోగులకు కీర్తి ప్రతిష్టలు ఉంటాయి. సమాజంలో ప్రజాదరణ పెరగవచ్చు. ఆదాయం మరింత రెట్టింపు అవుతుంది. శ్రీలక్ష్మిదేవి ఆరాధన శుభకరం.

మీనం:
మీన రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. వృత్తి, వ్యాపారాల్లో అనుకున్న పనులను పట్టుదలతో సాధిస్తారు. ఉద్యోగులకు అప్పగించిన పనులు పూర్తిచేస్తారు. దీంతో హోదా పెరుగుతుంది. ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు అందుతాయి. వ్యాపారులకు లాభాలు ఉంటాయి. కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు. అనారోగ్యానికి గురి కావొచ్చు. దుర్గా అష్టోత్తరం చదవడం మంచిది.

Related News

Shukra Gochar 2024: తులా రాశితో సహా 5 రాశుల వారికి ‘శుక్రుడు’ అపారమైన సంపద ఇవ్వబోతున్నాడు

Shani Margi 2024 Effects: దీపావళి తరువాత కుంభ రాశితో సహా 5 రాశుల వారి జీవితంలో డబ్బే డబ్బు..

Shradh 2024: మీ పూర్వీకులు కోపంగా ఉన్నారని సూచించే.. 7 సంకేతాలు ఇవే

Vastu Tips: వంట గదిలో ఈ 2 వస్తువులను తలక్రిందులుగా ఉంచితే ఇబ్బందులే..

Bhadra Mahapurush Rajyog Horoscope: ఈ రాశి వారిపై ప్రత్యేక రాజయోగంతో జీవితంలో భారీ అభివృద్ధి

Dussehra 2024 Date: ఈ ఏడాది దసరా పండుగ ఏ రోజున జరుపుకుంటారు? శుభ సమయం, ప్రాముఖ్యత వివరాలు ఇవే

Sun Transit Horoscope: సూర్యుని దయతో ఈ రాశుల వారికి గోల్డెన్ టైం రాబోతుంది

Big Stories

×