EPAPER

Olympic Medals: జనాభా 140 కోట్లు.. పతకాలు 6, ఒలింపిక్స్‌లో ఇండియా జాతకం మారేదెప్పుడు?

Olympic Medals: జనాభా 140 కోట్లు.. పతకాలు 6, ఒలింపిక్స్‌లో ఇండియా జాతకం మారేదెప్పుడు?

Olympic Medals: మన భారత దేశ జనాభా 140 కోట్లు. ఒలింపిక్స్ లో ఇండియాకు వచ్చిన మెడల్స్ జస్ట్ సిక్స్. అందులో ఒక్కటంటే ఒక్కటి కూడా గోల్డ్ మెడల్ లేదు. ఈ విషయాన్ని పక్కన పెడితే.. సెయింట్ లూసియా అనే ఓ కరీబియన్ దీవి ఉంది. ఆ దేశ జనాభా లక్షా 78 వేలు. సెయింట్ లూసియా ఈ ఒలింపిక్స్ లో ఓ గోల్డ్ మెడల్ కొట్టింది. పతకాల పట్టికలో సెయింట్ లూసియా 55వ ప్లేస్ లో ఉంటే.. ఇండియా స్థానం 71. ఇంకా దారుణం ఏంటంటే.. పాకిస్తాన్ ప్లేస్ 62, హాంకాంగ్ 37వ స్థానంలో ఉన్నాయి. ఇండియా వాటికంటే వెనకబడింది. జనాభాలో తోపులం, ఎకానమీలో రారాజులం, నాలెడ్జ్ ఉన్న మ్యాన్ పవర్ లో మనకు తిరుగులేదు.. అంటూ మనకు మనమే సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటాం. ఒలింపిక్ గేమ్స్ విషయానికొచ్చేసరికి కనీసం పాకిస్తాన్ తో కూడా పోటీపడలేం.


గతంలో ఘనకీర్తి.. ఇప్పుడు ఏమైంది?

ఒలింపిక్స్ లో ఇండియా హిస్టరీని తిరగేస్తే తప్పకుండా ఆశ్చర్యపోతారు. ఇప్పటి వరకు జరిగిన ఒలింపిక్స్ లో భారత్ కి టోటల్ గా 41 మెడల్స్ వచ్చాయి. అప్పట్లో హాకీలో 8 గోల్డ్ మెడల్స్ టీమ్ ఈవెంట్స్ లో వచ్చాయి. టోటల్ గా హాకీ ద్వారా ఇండియాకి 13 మెడల్స్ వచ్చాయి. రెజ్లింగ్ లో ఇప్పటి వరకు 8 మెడల్స్, షూటింగ్ లో 7, అథ్లెటిక్స్ లో 4, బ్యాడ్మింటన్ లో 3, బాక్సింగ్ లో 3, వెయిట్ లిఫ్టింగ్ లో 2, టెన్నిస్ లో ఒకటి.. ఇదీ మన పతకాల చరిత్ర. టీమ్ ఈవెంట్స్ కాకుండా ఇండివిడ్యువల్ గా గోల్డ్ కొట్టిన ఇండియన్ ప్లేయర్స్ ఇద్దరే ఇద్దరు. షూటింగ్ లో అభినవ్ బింద్రా, జావెలిన్ త్రో లో నీరజ్ చోప్రా.. వీరిద్దరే ఇండియాకి ఒలింపిక్స్ లో గోల్డ్ మెడల్స్ సాధించి పెట్టారు. ఇక ఈ ఏడాది ప్యారిస్ ఒలింపిక్స్ లో ఒక్క గోల్డ్ కూడా లేదు. ఒక సిల్వర్, 5 బ్రాంజ్ మెడల్స్ తో టీమ్ ఇండియా పూర్ పర్ఫామెన్స్ ఇచ్చింది. ఇదంతా చరిత్ర.. ప్యారిస్ ఒలింపిక్స్ లో మనది పూర్ పర్ఫామెన్సే.. ఒప్పుకుంటాం. గతాన్ని పక్కనపెట్టి ఫ్యూచర్ గురించి ఆలోచించినప్పుడే కదా మనం ముందుకెళ్లేది. అంటే ఒలింపిక్స్ పతకాలకోసం మనం ఏంచేయాలి అనేదే ఇప్పుడు అసలు పాయింట్.


మెడల్స్ రావాలంటే మెంటాలిటీ మారాలి

ఒలింపిక్ లో ఇండియాకి మెడల్స్ రాలేదంటే వెంటనే సోషల్ మీడియాలో సెల్ఫ్ మేడ్ అనలిస్ట్ లు బయటకొచ్చేస్తారు. ఇండియా వేస్ట్, ఇండియా వరస్ట్.. అంటూ కామెంట్లు పెడుతుంటారు. స్పోర్ట్స్ గురించి కనీసం ఐడియా లేనివాళ్లు, ఆటల రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తెలియని వాళ్లు కూడా చెత్త కామెంట్స్ తో ఇరిటేట్ చేస్తుంటారు. మన దేశం తరపున ఒలింపిక్స్ లో వెళ్లి ఆడేవాళ్లు ఇండియన్సే. అంటే మనమే. సగటు ఇండియన్ పేరెంట్స్ తమ పిల్లలు బాగా చదువుకోని మంచి ఉద్యోగం సాధించాలనుకుంటారు. కానీ, బాగా ఆటలాడి ఇండియాకి మెడల్స్ తేవాలని మాత్రం అనుకోరు. ఇండియాకి ఒలింపిక్స్ లో మెడల్ రావాలి, కానీ ఆ మెడల్ తెచ్చేది మన పిల్లలు మాత్రం కాకూడదు. ఇదే సగటు ఇండియన్ పేరెంట్స్ మెంటాలిటీ. అది మారినప్పుడే చదువులతోపాటు ఆటల్లో కూడా ఇండియా టాప్ ప్లేస్ కి వెళ్తుంది. అందులో అనుమానమేం లేదు.

Also Read: బంగ్లాదేశ్ పర్యటన.. బుమ్రాకు విశ్రాంతి..

ఆ దేశాల్లో అలా.. మన దేశంలో ఇలా..

వాస్తవానికి ఇండియాలో క్రికెట్ తప్ప ఇంక ఏ ఆటకి కూడా అంత ప్రయారిటీ లేదు. ఐపీఎల్ వచ్చిందంటే చాలు చిన్నా, పెద్దా అందరూ టీవీలకు స్టిక్ అయిపోతుంటారు. వరల్డ్ కప్, టీ ట్వంటీ కప్.. అన్నిటికీ మంచి రెస్పాన్స్ ఉంటుంది. క్రికెట్ లో మనం తోపులమే, రీసెంట్ గా టీట్వంటీ వరల్డ్ కప్ కూడా గెలిచాం. అయితే క్రికెట్ కాకుండా మిగతా ఆటల్లో మాత్రం మనది వెనక నుంచి ఫస్ట్ ప్లేస్. క్రికెట్ తో పాటు మిగతా స్పోర్ట్స్ కి కూడా గవర్నమెంట్ ప్రయారిటీ ఇస్తేనే మెడల్స్ వస్తాయి. లేకపోతే కష్టం. ఒలింపిక్స్ కి వెళ్తే వెంటనే మెడల్స్ వస్తాయనుకోలేం. అథ్లెట్స్ కి చాలా అవసరాలుంటాయి. వారికి సరైన ఫండింగ్ ఉండాలి. స్పాన్సర్ షిప్ లు ఉండాలి. ఇంటర్నేషనల్ స్థాయి కోచ్ లు ఉండాలి. ఇవన్నీ ఉంటేనే మెడల్స్ గురించి ఆలోచించాలి. ఇక ప్యారిస్ ఒలింపిక్స్ కోసం మన ఇండియా ఎంత బడ్జెట్ పెట్టిందో తెలుసా. జస్ట్ 474 కోట్ల రూపాయలు. అదే అమెరికా బడ్జెట్ ఎంతో తెలుసా… ఒక్క ఏడాదికి 5 వేల కోట్లు. చైనా బడ్జెట్ 8వేల కోట్ల రూపాయలు. ప్యారిస్ ఒలింపిక్స్ లో చైనా, అమెరికా చెరో 40 గోల్డ్ మెడల్స్ గెలిచాయి. వారితో కంపేర్ చేస్తే.. మన పెట్టుబడి తక్కువ, మనకు వచ్చే మెడల్స్ కూడా తక్కువ. అంటే ఇండియా ఒలింపిక్స్ కోసం పెద్దగా ఖర్చు పెట్టడం లేదు. అందుకే మనకి మెడల్స్ రావట్లేదు.

రాజకీయాలను దాటమే పెద్ద టాస్క్

ఇక ఇండియాలో స్పోర్ట్స్ లో కూడా పాలిటిక్స్ ఉంటాయి. సెలక్షన్ ప్రాసెస్ అంతా టాలెంట్ బేస్ మీదే ఉంటుందని అనుకోలేం. స్పోర్స్ట్ పర్సన్స్ కి ఇచ్చే ప్రయారిటీ కూడా చాలా తక్కువ. ఆమధ్య రెజ్లర్లు ఢిల్లీ రోడ్లపైకి వచ్చి గొడవ చేశారు. అమ్మాయిలకు రక్షణ లేదని వారు ఎంత మొత్తుకున్నా పట్టించుకున్నవారు లేరు. ఓ పొలిటీషియన్ ని వెనకేసుకొచ్చిన ఎన్డీఏ గవర్నమెంట్ రెజ్లర్లని అవమానించింది. ఇతర దేశాల్లో ఇంత చీప్ పాలిటిక్స్ ఉండవు.

ఇలా మనం చేయగలమా?

అమెరికాలో కాలేజ్ లెవల్ నుంచే స్పోర్ట్స్ బాగా ఆడేవారిని కంపెనీలు పిక్ చేసుకుంటాయి. వారికి స్పాన్సర్ షిప్స్ ఇస్తూ కోచింగ్ ఇస్తాయి. అలా వారిని ఇంటర్నేషనల్ స్థాయికి తీసుకెళ్తాయి. ఇండియాలో ఇలాంటివి మనం చూడలేం. ఐఐటీ ర్యాంకర్స్ కి ఇచ్చినంత ప్రయారిటీ స్పోర్ట్స్ పర్సన్స్ కి మనం ఇవ్వం. పేరెంట్స్ సపోర్ట్ కూడా చాలా తక్కువ. అందుకే ఇక్కడ ఆటలు ఆడేవారి సంఖ్య కూడా తక్కువే. ప్యారిస్ ఒలింపిక్స్ లో పోటీ పడేందుకు అమెరికా నుంచి 592 మంది వెళ్లారు. జపాన్ నుంచి 403 మంది వెళ్లారు. చైనా స్పోర్ట్స్ పర్సన్స్ నెంబర్ 383. ఇండియా నుంచి మాత్రం జస్ట్ 117మంది మాత్రమే ప్యారిస్ ఒలింపిక్స్ కి వెళ్లారు. అంటే ఈ నెంబర్ గేమ్ లో కూడా మనం బాగా వెనకబడ్డాం. నెంబర్ పెరిగితేనే ఒలింపిక్స్ మెడల్స్ కూడా పెరిగే ఛాన్స్ ఉంది.

Also Read: నెదర్లాండ్స్‌ పరుగులకు బ్రేకులు వేస్తున్న యూఎస్ఏ బౌలర్లు.. 200 మార్క్ దాటుతారా?

ఆరులో నాలుగు ఆ రాష్ట్రం నుంచే..

ఇండియా మెడల్స్ విషయంలో ఇంకో ఇంట్రస్టింగ్ పాయింట్ ఉంది. 140 కోట్ల ఇండియన్ పాపులేషన్ కి మనం 6 మెడల్స్ తెచ్చామని అనుకుంటున్నాం కదా.. ఇండియాలో 1.4 పర్సెంట్ ల్యాండ్ ఏరియా ఉన్న హర్యానా రాష్ట్రం క్రీడాకారులు 4 మెడల్స్ సాధించారు. అంటే ఒలింపిక్స్ మెడల్స్ లో హర్యానా పర్సంటేజ్ 66 అన్నమాట. మహారాష్ట్రకు ఒక మెడల్ వచ్చింది. ఇంకోటి హాకీ టీమ్ ఈవెంట్. అంటే.. ఇక్కడ హర్యానా టాప్ ప్లేస్ లో ఉంది. మిగతా స్టేట్స్ కూడా ఆటలపై ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఉందని దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు.

ఫైనల్ గా ఇండియాకి మెడల్స్ రావాలంటే, ఇండియన్స్ మైండ్ సెట్ మారాలి. ఎవరో రావాలి, మనకి మెడల్స్ తీసుకు రావాలంటే కుదరదు. మన వంతుగా మనం ఏం చేస్తున్నామనేదే ఇంపార్టెంట్. రన్నింగ్ లో నాకు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది డాడీ అని కొడుకు సంతోషంగా చెబితే.. వాడిని ఎంకరేజ్ చేయాలి. అంతేకానీ, స్టడీస్ లో క్లాస్ ఫస్ట్ ఎందుకు రాలేదురా అని క్లాస్ తీసుకుంటే రన్నింగ్ మీద ఉన్న ఇంట్రస్ట్ ని మనం తొక్కేసినట్టే. పిల్లల్లో స్పోర్ట్స్ పట్ల ఇంట్రస్ట్ క్రియేట్ చేస్తే అటోమేటిక్ గా వారిలోని టాలెంట్ బయటపడుతుంది, వాళ్లు యాక్టివేట్ అవుతారు. అలాంటి ప్రయత్నాలు ఇండియాలో అస్సలు జరగడంలేదు.

ఇంకో సిల్లీ మేటర్ చెబుతా వినండి.. ప్యారిస్ ఒలింపిక్స్ అయిపోయాక అందరూ మెడల్స్ గురించి మాట్లాడుకుంటుంటే.. ఇండియాలో సోషల్ మీడియా మాత్రం నీరజ్ చోప్రా, మనుబాకర్ మధ్య లవ్ స్టోరీ నడుస్తుందనే డిస్కషన్ మొదలు పెట్టింది. కుచ్ కుచ్ హోతాహై అంటూ సోషల్ మీడియా కోడై కూసింది. అదీ మనోళ్ల మైండ్ సెట్. అక్కడికే వారు పరిమితం. ఫైనల్ గా ప్యారిస్ ఒలింపిక్స్ అయిపోయాయి కాబట్టి మనం దీని గురించి ఇంత సీరియస్ గా మాట్లాడుకుంటున్నాం. వారం రోజులు పోతే దీని గురించి పూర్తిగా మర్చిపోతాం. రొటీన్ లైఫ్ లో బిజీ అయిపోతాం. మళ్లీ నాలుగేళ్ల తర్వాత 2028లో లాస్ ఏంజిలస్ లో ఒలింపిక్స్ అంటే అప్పుడు మళ్లీ డిస్కషన్ మొదలు పెడతాం. అయితే ఈసారి మనకో అడ్వాంటేజ్ ఉంది. 2028 ఒలింపిక్స్ లో క్రికెట్ కూడా ఉంటుంది. అప్పుడు ఇండియా సత్తా ఏంటో చూడాలి.

Related News

India vs Bangladesh Test Match: అదరగొట్టిన భారత్.. 149కే బంగ్లా ఆలౌట్

IND vs BAN 1st Test: కపిల్, ధోనీ సరసన.. అశ్విన్

India vs Bangladesh 1st Test: భారత్ 376 ఆలౌట్.. తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో భారీ స్కోరు చేసిన భారత్..

Shikhar Dhawan: ఆ హాట్‌ బ్యూటీతో గబ్బర్‌ ఎఫైర్‌..సీక్రెట్‌ ఫోటోలు లీక్‌ !

Ravichandran Ashwin: తనే నన్ను ఆడించాడు: సెంచరీ హీరో అశ్విన్

IPL 2025: కోహ్లీ భారీ ప్లాన్‌..RCBలోకి అర్జున్‌ టెండూల్కర్‌ ?

Ravichandran Ashwin: టీమిండియాలో గొడవలు…అశ్విన్‌ ను అవమానించిన గంభీర్‌..?

Big Stories

×