భారతదేశ 78వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా వన్‌ప్లస్ ఇండిపెండెన్స్ డే సందర్భంగా ప్రత్యేక సేల్‌ను ప్రకటించింది.

OnePlus Nord CE 4 స్మార్ట్‌ఫోన్‌ 8GB/ 128GB ధర రూ.24,999, 8GB/ 256GB ధర రూ.26,999గా ఉంది. ICICI, OneCardపై తక్షణం రూ.3,000 తగ్గింపు పొందవచ్చు.

అలాగే OnePlus Nord 4 8GB/128GB వేరియంట్ రూ. 29,999, 8GB / 256GB ధర రూ. 32,999, 12GB/ 256GB ధర రూ. 35,999గా ఉంది

ICICI, OneCard బ్యాంక్ కార్డ్‌లతో 8GB RAM వేరియంట్‌పై రూ. 2,000 వరకు, టాప్ మోడల్‌పై రూ. 3,000 వరకు తగ్గింపును పొందవచ్చు.

OnePlus 12 స్మార్ట్‌ఫోన్ 12GB/ 16GB మోడల్‌లు రూ. 5,000 టెంపరెరీ డిస్కౌంట్‌తో అందించబడుతున్నాయి.

అందులో 12GB ధర రూ. 59,999గా.. అలాగే 16GB వేరియంట్ ధర రూ. 64,999గా నిర్ణయించబడింది.

OneCard, ICICI బ్యాంక్ కార్డులపై రూ.7,000 తక్షణ తగ్గింపు పొందవచ్చు. అలాగే OnePlus కొన్ని స్మార్ట్‌ఫోన్‌లకు రూ. 10,000 వరకు ఎక్స్ఛేంజ్ బోనస్‌ను కూడా అందిస్తోంది

Oneplus Open Apex Edition ఫోన్‌ కొనుగోలు పై వినియోగదారులు ICICI, OneCard ఉపయోగిస్తే రూ.20,000 వరకు తక్షణ తగ్గింపు ప్రయోజనం పొందుతారు.

దీనితో పాటు ఎక్స్ఛేంజ్ ఆఫర్ కింద రూ. 8,000 వరకు ఎక్స్ఛేంజ్ బోనస్ కూడా అందుబాటులో ఉంటుంది.

OnePlus 12R కొన్ని వేరియంట్లపై రూ.1,000 వరకు తాత్కాలిక తగ్గింపు లభిస్తుంది. అదనంగా ICICI, OneCard వినియోగదారులు రూ. 2,000 వరకు తక్షణ తగ్గింపును కూడా పొందగలరు.

అయితే ఈ ఆఫర్లన్నీ ఆగస్టు 31 వరకు అందుబాటులో ఉండనున్నాయి.