EPAPER

Today Movie Reviews: ఈ నాలుగు సినిమాల్లో విన్నర్ ఎవరు? ‘బుక్ మై షో’లో ఆ మూవీకే ఎక్కువ ఓట్లు, రేటింగులో వెనుకబడింది ఎవరో తెలుసా?

Today Movie Reviews: ఈ నాలుగు సినిమాల్లో విన్నర్ ఎవరు? ‘బుక్ మై షో’లో ఆ మూవీకే ఎక్కువ ఓట్లు, రేటింగులో వెనుకబడింది ఎవరో తెలుసా?

Today Movie Reviews In Telugu: భారతదేశ 78వ స్వాతంత్ర్య దినోత్సవం పురష్కరించుకుని ఆగస్టు 15న పలు సినిమాలు రిలీజ్ అయ్యాయి. అందులో స్టార్ హీరోల సినిమాలతో పాటు చిన్న హీరోల సినిమాలు కూడా రిలీజ్ అయ్యాయి. రామ్ పోతినేని నటించిన డబుల్ ఇస్మార్ట్, రవితేజ నటించిన మిస్టర్ బచ్చన్, చియాన్ విక్రమ్ నటించిన తంగలాన్, అలాగే ఇప్పుడిప్పుడే ఫామ్‌లోకి వస్తున్న నార్నే నితిన్ నటించిన ఆయ్ వంటి సినిమాలు ఎన్నో అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఈ సినిమాలు బాక్సాఫీసు వద్ద మంచి టాక్‌ను అందుకున్నాయి. పబ్లిక్ ఈ సినిమాలపై వారి రివ్యూని అందించారు. అదే సమయంలో ప్రముఖ టికెట్ బుకింగ్ యాప్ బుక్ మై షో కూడా ఈ సినిమాలపై తన రివ్యూలు తెలిపింది. ఇప్పుడు వాటి గురించి తెలుసుకుందాం.


డబుల్ ఇస్మార్ట్

రామ్ పోతినేని, పూరి జగన్నాథ్ కాంబోలో 2019లో ‘ఇస్మార్ట్ శంకర్’ విడుదలైంది. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయి బాక్సాఫీసు వద్ద భారీ కలెక్షన్లను నమోదు చేసింది. ఇప్పుడు ఈ సినిమాకి సీక్వెల్‌గా ‘డబుల్ ఇస్మార్ట్’ తెరకెక్కింది. ఇవాళ ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మంచి పాజిటివ్ టాక్‌ను అందుకుంది. ఇందులో హీరో రామ్ పోతినేని ఎనర్జీ వేరే లెవెల్ అని చెప్పాలి. డబుల్ ఇస్మార్ట్ ఐడియాగా చాలా మంచి పాయింట్‌తో దర్శకుడు వచ్చాడు. ఫస్ట్ హాఫ్ మంచి టాక్ ‌ను అందుకుంది. అయితే సెకండాఫ్ మాత్రం వేగంగా పరుగులు పెడుతుంది. మొత్తంగా ఈ సినిమాకి పబ్లిక్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది. మరికొందరు ఈ సినిమా పర్వాలేదని అంటున్నారు. అయితే ఇదే సినిమా బుక్‌మై షో యాప్‌లో కూడా మంచి రేటింగ్‌ను అందుకుంది. ఈ సినిమాకి ఏకంగా బుక్ మై షోలో 7.3 రేటింగ్ వచ్చింది. అలాగే దాదాపు 6.3k ఆడియన్స్ ఈ సినిమాకి ఓట్లు వేశారు.


Also Read: డబుల్ ఎంటర్ టైన్ మెంట్ ఇచ్చిందా..ఇస్మార్ట్ రివ్యూ

మిస్టర్ బచ్చన్

రవితేజ, హరీశ్ శంకర్ కాంబోలో వచ్చిన కొత్త సినిమా ‘మిస్టర్ బచ్చన్’. ఎన్నో అంచనాలతో ఈ సినిమా ఇవాళ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ సినిమాకి ప్రేక్షకుల నుంచి మిక్స్డ్ టాక్ వస్తుంది. కొందరేమో ఈ సినిమా బాగుందని అంటుంటే.. మరికొందరేమో ఈ సినిమాలో డైరెక్టర్ హరీశ్ శంకర్ మార్క్ కనిపించలేదని అంటున్నారు. కాగా ఫస్ట్ హాఫ్ సూపర్‌గా ఉందని అంటున్నారు. కానీ సెకండాఫ్‌లో మాత్రం కథను నడిపించడంలో రైటర్ తడబడ్డాడని అర్థం అవుతుంది. దీనిపై పబ్లిక్ రకరకాలుగా వారి రివ్యూలు ఇస్తున్నారు. అదే సమయంలో టికెట్ బుకింగ్ యాప్ బుక్ మై షో కూడా తన రివ్యూని వెల్లడించింది. మిస్టర్ బచ్చన్ సినిమాకు బుక్ మై షోలో 5.8 రేటింగ్ వచ్చింది. అలాగే దీనిపై ఆడియన్స్ ఎక్కువ శాతం ఆసక్తి చూపించారు. ఏకంగా 7.8 k మంది ఆడియన్స్ సినిమాకి ఓట్లు వేశారు.

తంగలాన్

విలక్షణమైన పాత్రలు చేయడంలో చియాన్ విక్రమం దిట్ట అలాంటి నటుడు తాజాగా మరో డిఫరెంట్ పాత్రతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. పా రంజిత్ దర్శకత్వంలో ‘తంగలాన్’ మూవీ చేశాడు. ఈ సినిమా ఇవాళ రిలీజ్ అయింది. ఈ సినిమా సూపర్ డూపర్ టాక్ తో దూసుకుపోతుంది. ఇందులో విక్రమ్ తన పాత్రలో ఒదిగిపోయారు. ఆయన నటనకు సినీ ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. పబ్లిక్ ఈ సినిమాపై మంచి రెస్పాన్సే ఇస్తున్నారు. అలాగే బుక్ మై షోలో ఈ సినిమాకు విపరీతమైన లైక్స్ వచ్చాయి. ఏకంగా 104.4k లైక్స్‌తో తంగలాన్ అదరగొడుతుంది.

ఆయ్

‘మ్యాడ్’ మూవీతో వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు ఎన్టీఆర్ బావ మరిది నార్నే నితిన్. ఇప్పుడు ఈ హీరో ప్రధాన పాత్రలో నటించిన కొత్త సినిమా ‘ఆయ్’. ఆగస్టు 15న గ్రాండ్ లెవెల్లో రిలీజ్ అయింది. ఈ సినిమా కూడా బాగుందని పబ్లిక్ అంటుంది. ఇక బుక్ మై షోలో కూడా ఆయ్ మూవీని చాలా మంది లైక్ చేశారు. ఏకంగా 14.4k మంది ఆడియన్స్ ఈ సినిమాకి లైక్ కొట్టారు. మరి ఇందులో ఏ సినిమా మీకు నచ్చిందో కామెంట్ రూపంలో తెలియజేయండి.

Related News

Comedian Sapthagiri: ఇండస్ట్రీకి దూరమయ్యారా లేక దూరం పెట్టారా..?

Johnny Master: ఢీ 11 లో ఎలిమినేట్.. జానీ మాస్టర్ ఇంత కథ నడిపారా.?

Pushpa 2: వార్నర్ మామ ఇండస్ట్రీ ఎంట్రీ,రీల్స్ నుంచి రియల్ సినిమాలోకి

Devara: ఒకవైపు రాజమౌళి హీరో, మరో వైపు త్రివిక్రమ్ చీఫ్ గెస్ట్ ఇక శివ ను ఆ శివయ్యే కాపాడాలి

Prabhas – Hanu : గప్ చుప్ గా షూటింగ్… ఇంత సీక్రెట్ గా ఎందుకో..?

SSMB29 : మహేష్- రాజమౌళి మూవీ బిగ్ అప్డేట్.. ఫ్యాన్స్ రెడీ అవండమ్మా..!

Devara Pre Release Event : దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ ఫిక్స్.. చీఫ్ గెస్టులు గా స్టార్ డైరెక్టర్స్?

Big Stories

×