EPAPER

Nara Lokesh: టార్గెట్ 2029.. నారో లోకేష్ కొత్త ప్లాన్ ఇదే..

Nara Lokesh: టార్గెట్ 2029.. నారో లోకేష్ కొత్త ప్లాన్ ఇదే..

తెలుగుదేశం పార్టీ తిరిగి బంపర్ మెజార్టీతో అధికారంలోకి వచ్చింది. జనసేన, బీజేపీలతో కూటమి కట్టి పోటీ చేసినా టీడీపీకి సొంతంగా 135 సీట్లు దక్కాయి. అదే సమయంలో కేంద్రంలోని ఎన్డీఏ సర్కారులో కూడా టీడీపీ కీలకంగా మారింది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి చంద్రబాబు మంత్రివర్గం ఏర్పాటు చేసినప్పుడు అందరూ ఆశ్చర్యపోయారు. టీడీపీ ఆవిర్భావం నుంచి పార్టీలో ఉండి.. చంద్రబాబు వెంట నడుస్తూ వచ్చిన సీనియర్లు ఎవరికీ ఈ సారి కేబినెట్ బెర్త్‌లు దక్కలేదు. ఎన్నికలు ముందు పార్టీ మారి వచ్చిన ఆనం రామనారాయణరెడ్డి, పార్థసారథి వంటి సీనియర్లకు మినహా మంత్రివర్గంలో చోటు లభించలేదు.

దాంతో పార్టీ భవిష్యత్తు అవసరాల కోసమే చంద్రబాబు కేబినెట్‌ మెంబర్స్‌ని సెలెక్ట్ చేశారన్న అభిప్రాయం వ్యక్తమైంది. లోకేశ్ మార్క్ కేబినెట్ అన్న టాక్ కూడా వినిపించింది. ఈ ారినారా లోకేష్ వంటి యువ నాయకత్వం అందుబాటులోకి వచ్చింది. దాంతో టీడీపీ మరిన్ని కాలాల పాటు ఏపీ రాజకీయాల్లో కీలక భూమిక పోషించడం ఖాయమన్న అభిప్రాయం వ్యక్తమైంది. దానికి తగ్గట్లే టీడీపీ సీనియర్లలో కూడా ఎలాంటి అసంతృప్తి కనిపించకపోతుండటం గమనార్హం.


తిరుగు లేని మెజార్టీతో కూటమి అధికారంలోకి రావడంతో  టీడీపీలో చేరేందుకు వైసీపీ నేతలు చాలా మందే క్యూల్లో కనిపిస్తున్నారు. మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు తాము గేట్లు తెలిస్తే వైసీపీ గల్లంతు కావడం ఖాయమని ఇప్పటికే ప్రకటించారు. ఆ పరిస్థితి నిజంగానే కనిపిస్తుంది. ఇప్పటికే అన్ని జిల్లాల్లో పై నుంచి కింద స్దాయి వరకు వైసీపీ నేతలు టీడీపీ, జనసేనల్లో చేరడానికి రాయబారాలు నడుపుతున్నారు. అయితే గతంలోలా టీడీపీ తలుపులు వారికి తెరుచుకునే పరిస్థితి లేదంటున్నారు.

2014 నుంచి 2019 మధ్యలో అనేక మంది వైసీపీ నుంచి టీడీపీలో చేరారు. వైసీపీ ఎమ్మెల్యేలను కూడా చేర్చుకున్న చంద్రబాబు.. జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి వంటి వారికి మంత్రి పదవులు కూడా కట్టబెట్టారు. ఆ వలస నేతలతో కొన్ని చోట్ల వైసీపీ వారి డామినేషన్ పెరిగి. టీడీపీ నేతలు డమ్మీలుగా మిగిలిపోవాల్సి వచ్చిందంటారు. అది కూడా అప్పటి ఎన్నికల్లో టీడీపీ ఓటమికి ఒక కారణంగా చెపుతారు.

ఈసారి కూడా అలాగే అవుతుందని అనుకున్నా టీడీపీలో చేరికలకు పెద్ద బ్రేకే పడినట్లు కనిపిస్తుంది. నారా లోకేష్ ఆ వలసలతో ప్రయోజం లేదని భావిస్తున్నారంట. 2014 -19తో పోలిస్తూ నారా లోకేష్‌లో రాజకీయ పరిపక్వత స్పషంగా కనిపిస్తుంది. అటు మాట తీరు, ఇటు రాజకీయ వ్యూహాల్లో కూడా రాటు తేలారు. 2019 ఎన్నికల్లో మంగళగిరిలో ఓటమి పాలైన ఆయన దాని నుంచి చాలా పాఠాలే నేర్చుకున్నారు. ఆనాడు ఆయన కొంత అనుభవ రాహిత్యంతో వైసీపీ నేతల విమర్శలకు గురయ్యారు. మాజీ మంత్రి రోజా వంటి వారు పప్పు అంటూ అంటూ ఆయనపై చెలరేగిపోయారు. అయిదేళ్లు అయిదేళ్ల ప్రతిపక్ష పాత్ర లోకేష్‌ను అసలుసిసలు నారావారి వారసుడిగా నిలబెట్టిందన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది.

Also Read: దామచర్ల ఏంటిది మాకు..? తెలుగు తమ్ముళ్లు ఫైర్

ముఖ్యంగా యువగళం పాదయాత్ర లోకేష్‌లో పొలిటికల్ పరిణితిని పెంచింది .. అందుకే లోకేష్ మంత్రిగా కీలకంగా ఉన్నా తన పని తాను చేసుకుంటూ పోతున్నారు. పూర్తిగా లో ప్రొఫైల్ ని మెయిన్ టెయిన్ చేస్తున్నారు. ఎక్కడా ఆయన బయటకు అనవసర కామెంట్స్ చేయడం లేదు. ప్రజా సమస్యల మీద దృష్టి పెడుతున్నారు. మంగళిగిరిలో ఉంటే ఉదయాన్నే తన నివాసం వద్ద ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నారు. అక్కడ ప్రజల సమస్యలను తెలుసుకుంటూ వాటి పరిష్కారానికి మార్గాలు వెంటనే వెతుకుతున్నారు. దాంతో లోకేష్ ప్రజా దర్బార్ కి మంచి స్పందన లభిస్తోంది.

అలాగే శాఖాపరంగా పట్టుని పెంచుకుంటున్నారు. అంతే కాకుండా ఆయన టీడీపీ సంస్థాగత నిర్మాణంపై పూర్తిగా దృష్టి పెడుతున్నారు. వైసీపీ హయాంలో పార్టీలో క్యాడర్ ఇబ్బంది పడింది. అటువంటి వారి వివరాలు అన్నీ సేకరించిన ఆయన. గత వైసీపీ ప్రభుత్వం లో టీడీపీ క్యాడర్ ని వేధించిన వారిని ఆయన అసలు వదలడం లేదు. క్యాడర్ ని కాపాడుకుంటూ వారిలో ఆత్మ విశ్వాసం పెంచుతున్నారు. ఇక టీడీపీలోకి వస్తామని చెబుతున్న నాయకులను ఆయన ఎక్కడా గ్రీన్ సిగ్మెల్ ఇవ్వడం లేదంట. ఎంతటి బడా లీడర్ అయినా టీడీపీ అధికారంలో ఉంది కాబట్టి వచ్చి చేరుతామంటే వద్దు అని చెప్పేస్తున్నారంట.

పార్టీలో చేరే ఉద్దేశంలో అపాయింట్మెంట్లు అడుగుతున్న వారిని కూడా కలవడానికి ఇష్టపడటం లేదంట. 2029 నాటికి టీడీపీపై యూత్ బ్రాండ్ వేసే ఆలోచనలో ఉన్నారంట ఆయన.. టీడీపీ క్యాడర్ నుంచే అలాంటి లీడర్‌షిప్‌ని డెవలప్ చేయాలని చూస్తున్నారంట. దాంతో టీడీపీకి ఫిరాయింపు నేతలతో ఇక పని లేదన్నట్లే వ్యవహారం కనిపిస్తుంది. మొత్తమ్మీద పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన కొత్తల్లో పార్టీకి మైనస్‌గా కనిపించిన లోకేష్.. ఇప్పుడు తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకుంటూ చక్రం తిప్పుతుండటంలో.. తెలుగు తమ్ముళ్ళు తెగ హ్యాపీ అయిపోతున్నారు.

Related News

Tirumala Laddu Politics: లడ్డూ కాంట్రవర్సీ.. దేవదేవుడి ప్రసాదంపైనే ఇన్ని రాజకీయాలా ?

Ys jagan vs Balineni: బాంబ్ పేల్చిన బాలినేని.. జగన్ పతనం ఖాయం

Israel Hezbollah War: యుద్ధంలో నయా వెపన్.. ఇక ఊచకోతే

YCP Leaders to Join in Janasena : గేట్లు తెరిచిన పవన్.. వైసీపీ ఖాళీ?

Rushikonda Palace: రుషికొండ ప్యాలెస్.. అధికారులు దాస్తున్న నిజాలు

Lebanon Pager Explosions: వామ్మో ఇలా కూడా చంపొచ్చా..పేజర్ బాంబ్స్!

YS Jagan vs Anil Kumar: అనిల్‌కు జగన్ మాస్టర్ స్ట్రోక్.. ఈ జిల్లాలో సీటు గల్లంతైనట్లేనా?

Big Stories

×