పింక్ సాల్ట్ ఆరోగ్యానికి మంచిదేనా?

ప్రస్తుతం సాధారణ ఉప్పుకు బదులుగా హిమాలయన్(పింక్) సాల్ట్‌ను ఉపయోగించేవారి సంఖ్య పెరుగుతోంది.

హిమాలయన్ సాల్ట్‌‌లో ఉండే ఐరన్ ఆక్సైడ్ వల్ల ఈ ఉప్పు పింక్ కలర్‌లో ఉంటుంది.

హిమాలయన్ ఉప్పులో 84 రకాల సూక్ష్మ పోషకాలతోపాటు మినరల్స్ పుష్కలంగా ఉంటాయి.

ఈ ఉప్పులో ఉండే మెగ్నీషియం, పొటాషియం, కాల్షియం, జింక్ ఆరోగ్యానికి మేలు చేస్తాయి.

ఈ ఉప్పుగాలిని పీల్చితే శ్వాసకోశ సమస్యల నుంచి బయటపడవచ్చు.

శరీరంలో హైడ్రేషన్ స్థాయిలను సమతుల్యంగా ఉంచుతుంది.

ఈ ఉప్పును నీటిలో కలిపి స్నానం చేస్తే తామర నుంచి ఉపశమనం లభిస్తుంది.

ఈ ఉప్పు ఎక్కువగా వాడితే నష్టాలు ఉన్నాయి. అందుకే ఏ రకం ఉప్పునైనా సరే.. మితంగా తీసుకోవడం ముఖ్యం.

ఈ ఉప్పు ఎక్కువగా తీసుకుంటే దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధి, గుండె వ్యాధులకు దారితీయొచ్చు

అధిక ఉప్పు వివిధ రకాల ఎముకల వ్యాధికి గురిచేస్తుంది. కావున మోతాదులో ఉపయోగించాలని నిపుణులు చెబుతున్నారు.