EPAPER

Thangalaan Review: ‘తంగలాన్’ ఫుల్ రివ్యూ.. విక్రమ్ శ్రమ ఫలించినట్లేనా..?

Thangalaan Review: ‘తంగలాన్’ ఫుల్ రివ్యూ.. విక్రమ్ శ్రమ ఫలించినట్లేనా..?

Thangalaan Review In Telugu: చియాన్ విక్రమ్.. ఎప్పుడూ కొత్త కొత్త కథలను ఎంచుకుంటూ డిఫరెంట్ పాత్రలతో ప్రేక్షకాభిమానుల్ని అలరిస్తుంటాడు. సినిమా ఏదైనా.. అందులోని పాత్ర ఎలాంటిదైన వెనక్కి తగ్గడు. క్యారెక్టర్లు, కథలు, లుక్స్ పరంగా ప్రయోగాలు చేసేందుకు ఒక అడుగు ముందుంటాడు. అతడు నటించిన సినిమా సినిమాకి చాలా వేరియేషన్స్ చూడవచ్చు. ఇక ఇప్పుడు అలాంటిదే మరొక వేరియేషన్స్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. చియాన్ విక్రమ్ నటించిన కొత్త మూవీ ‘తంగలాన్’. పా రంజిత్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. ఇందులో పార్వతి తరువోతు, మాళవికా మోహనన్ కీలక పాత్రలు పోషించారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు, గ్లింప్స్, సాంగ్స్, ట్రైలర్ అంచనాలు విపరీతంగా పెంచేసింది. ఇక ఇవాళ అంటే ఆగస్టు 15న రిలీజ్ అయిన ఈ సినిమా ఎలా ఉందో ఫుల్ రివ్యూ ద్వారా తెలుసుకుందాం.


కథ

తంగలాన్ (విక్రమ్), గంగమ్మ (పార్వతి తిరువొతు) దంపతులుగా జీవనం సాగిస్తుంటారు. వారికి ఉన్న కొద్ది పాటి భూమిని పండించుకుంటూ తమ పిల్లలతో హ్యపీగా ఉంటారు. అయితే పంట వేసి సరిగ్గా చేతికొస్తుందన్న సమయంలో కొందరు దుండగులు తగలబెట్టాస్తారు. దీంతో ఆ ఊరి జమీందారుకు పన్ను చెల్లించలేదని వారి పంట పొలం స్వాధీనం చేసుకుంటారు. అంతేకాకుండా కుటుంబం మొత్తాన్ని వెట్టా చాకిరీ చేయాలని చెప్తాడు. అదే సమయంలో క్లెమంట్ దొర వచ్చి.. బంగారు గనులు తవ్వడానికి వస్తే ఎక్కువ డబ్బులు ఇస్తానని అంటాడు. దీంతో అక్కడకు వెళ్లిన తంగలాన్ అండ్ అతడి సమూహానికి ఎలాంటి సమస్యలు ఎదురయ్యాయి. బంగారం దొరికిందా? లేదా అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.


Also Read: డబుల్ ఎంటర్ టైన్ మెంట్ ఇచ్చిందా..ఇస్మార్ట్ రివ్యూ

విశ్లేషణ

దర్శకుడు పా రంజిత్ తన క్రియేటివిటీతో మరో ప్రపంచలోకి తీసుకెళ్లాడు. దేశానికి స్వాతంత్య్రం రాకముందు, బ్రిటీషర్లు పరిపాలించే సమయంలో ఎలా చూపిస్తారన్న కుతూహలం ప్రేక్షకుల్లో కలుగుతుంది. సినిమా ప్రారంభం నుంచి మరో ప్రపంచలోకి వెళ్లినట్లు అనిపిస్తుంది. జమీందార్ వ్యవస్థ మీద, బ్రిటిషర్లు వచ్చి కన్నడిగ చర్యల్లో వర్ణ వివక్షన్ దర్శకుడు చాలా చక్కగా చూపించాడు. అలాగే ఇందులో తంగలాన్‌కు వచ్చే కలలు సినిమాపై క్యూరియాసిటీ పెంచుతాయి. గోల్డ్ మైనింగ్ కథతో తెరకెక్కిన ఈ సినిమాకు కాస్త ఫాంటసీ టచ్ ఇవ్వడంలో దర్శకుడు పా రంజిత్ సక్సెస్ అయ్యాడు.

అయితే నిడివి విషయంలో కన్ఫ్యూజ్ అయినట్లు తెలుస్తోంది. సినిమాలో పాత్రలను పరిచయం చేయడానికి చాలా సమయం తీసుకున్నాడు. అలాగే సెకండాఫ్ కాస్త డల్ అనిపిస్తుంది. కొన్ని సన్నివేశాలు చూపించిందే చూపించడంతో విసుగు అనిపిస్తుంది. అయితే క్లైమాక్స్ మాత్రం అదిరిపోయింది. మ్యూజిక్ అద్భుతంగా ఉన్నాయి. కథకు సరిపడా పాటలు అందరినీ అలరిస్తాయి. కెమెరా వర్క్ సూపర్. టెక్నికల్ పరంగా విజువల్స్ అత్యద్భుతం. నిర్మాణ విలువలు బాగున్నాయి.

Also Read: మెచ్చని పాత్రలో ‘బచ్చన్’ వచ్చెన్..గుచ్చెన్

విక్రమ్ ఈ సినిమా నటించాడు అనడం కంటే జీవించాడు అని అనడంలో ఎలాంటి సందేహం లేదు. డిఫరెంట్‌గా కనిపించి దుమ్ము దులిపేశాడు. అలాగే పార్వతి తిరువోతు గంగమ్మ పాత్రలో బాగా నటించింది. ఇక గ్లామరస్ బ్యూటీ మాళవికా మోహనన్ తనను గుర్తుపట్టలేనంతగా ఇందులో కనిపించింది. నటిగా తన పాత్రకు సరిపడా పరిధి మేరకు నటించింది. ఇందులో విక్రమ్, మాళవిక , పార్వతిల నటన పూర్వీకుల కాలాన్ని గుర్తుచేసినట్లు అనిపిస్తుంది. డిఫరెంట్ థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్ కావాలనుకునే వారికి ఇది బెస్ట్ అని చెప్పుకోవచ్చు.

Related News

Renu Desai: హెల్ప్ లెస్ గా ఉన్నాను… సాయం చేయండంటూ వేడుకుంటున్న రేణు దేశాయ్

Jani Master : జానీకి రిమాండ్ విధించిన కోర్టు… బెయిల్ పరిస్థితి ఏంటంటే..?

Fear Teaser: సస్పెన్స్ థ్రిల్లర్ గా ఫియర్ టీజర్.. అద్భుతమైన పర్ఫామెన్స్ తో హైప్ పెంచేసిన వేదిక.!

Jani Master : లీగల్‌గా పోరాడుతా.. లైంగిక ఆరోపణలపై ఫస్ట్ టైమ్ స్పందించిన జానీ మాస్టర్

Jani Master : ‘మాస్టర్ అమాయకుడు’ రోజురోజుకు పెరుగుతున్న మద్దతు… ఎంత మంది సపొర్ట్ చేశారంటే..?

Bhanumathi: ఉన్నతంగా బ్రతికిన భానుమతి.. చరమాంకంలో దీనస్థితికి చేరుకోవడానికి కారణం..?

Samantha : ఫైనల్‌గా కెమెరా ముందుకు వచ్చిన సామ్… ‘కల…’ అంటూ ఎమోషనల్ పోస్ట్

Big Stories

×