EPAPER

Damacharla Janardhana Rao: దామచర్ల ఏంటిది మాకు..? తెలుగు తమ్ముళ్లు ఫైర్

Damacharla Janardhana Rao: దామచర్ల ఏంటిది మాకు..? తెలుగు తమ్ముళ్లు ఫైర్

Ongole TDP MLAs fire on Damacharla Janardhana Rao: ఒంగోలు మునిసిపల్ కార్పొరేషన్‌ పాలకవర్గం మారడం ఖరారైంది. తాజాగా మేయర్ సుజాత సహా 12 మంది కార్పొరేటర్లు వైసీపీకి రిజైన్ చేసి టీడీపీలో చేరారు. ఇప్పటికే పది మంది కార్పొరేటర్లు టీడీపీ తీర్థం పుచ్చుకువడంతో ఉక్కిరి బిక్కిరి అవుతున్న వైసీపీకి తాజా పరిణామం పెద్ద షాకే.. అయితే మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ అభ్యర్ధి దామచర్ల జనర్ధన్ ఓటమికి కృషి చేసిన వారు ఇప్పుడు ఆయన సమక్షంలోనే పసుపు కండువాలు కప్పుకోవడాన్ని ఒంగోలు టీడీపీ శ్రేణులు జీర్ణించుకొలేక పొతున్నాయంట.


ప్రకాశం జిల్లా ఒంగోలు రాజకీయం ఎప్పుడూ ప్రత్యేకంగానే ఉంటుంది. 2019 నుంచి 2024 సార్వత్రిక ఎన్నికల వరకు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఒంగోలులో చక్రం తిప్పితే.. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఒంగోలు పాలిటిక్స్ మెత్తం ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్ ఒంటిచేతితో నడిపిస్తున్నారు. గత వైసిపి ప్రభుత్వంలో ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్‌ని వైసీపీ సొంతం చెసుకుంది. ఇప్పుడు ప్రభుత్వం మారడంతో వైసిపి కార్పొరేటర్లు పసుపు కండువ కప్పుకోవడానికి క్యూ కడుతున్నారు

ఒంగోలు మునిసిపల్ కార్పొరేషన్లో మొత్తం 50 మంది కార్పొరేటర్లు ఉన్నారు. ఎన్నికల సమయంలో తెలుగుదేశం పార్టీ తరపున ఆరుగురు, జనసేన నుంచి ఒకరు గెలుపొందారు. ఇద్దరు స్వతంత్ర్య అభ్యర్ధులు విజయం సాధించారు. మిగిలిన 41 డివిజన్లలో వైసీపీ పాగా వేసింది.. అప్పట్లో స్వతంత్రంగా గెలిచిన ఇద్దరు కార్పొరేటర్లు వైసీపీలో చేరారు. దీంతో కార్పొరేషన్లో వైసీపీ బలం 43కి చేరింది. అయితే ఎన్నికలకు ముందే అయిదుగురు అధికారపక్షం కార్పొరేటర్లు తెలుగుదేశం పార్టీలో చేరిపోయారు. ఇక ఎన్నికల ఫలితాల తర్వాత వైసీపీ వారు కూటమిలో చేరడానికి ప్రయత్నాలు ముమ్మరం చేశారు.


మొత్తం 50 మంది కార్పొరేటర్లు ఉన్న కార్పొరేషన్లో ఇప్పుడు కూటమి బలం 12కు చేరింది … మరో 14 మందిని చేర్చుకుంటే మేయర్ పదవి టీడీపీ వశం అవుతుంది. అయితే వైసీపీని కోలుకోకుండా దెబ్బ కొట్టాలని ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్ పావులు కదుపుతూ వచ్చారు. కనీసం మరో 20 కార్పొరేటర్లను లాక్కుంటే కౌన్సిల్‌లో ఎదురుండదని దామచర్ల స్కెచ్ గీశారు. ఆ క్రమంలో తాజాగా మేయర్ సుజాతతో పాటు 12 మంది కార్పొరేటర్లు వైసీపీకి రాజీనామా చేశారు. ఎమ్మెల్యే దామచర్ల సమక్షంలో పసుపు కండువాలు కప్పుకుని టీడీపీలో చేరిపోయారు.

ఒంగోలులో మాజీ మంత్రి బాలినేని ఓడిపోవడం.. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడటంతో అప్పటి నుంచే మేయర్ సుజాత టీడీపీతో టచ్‌లోకి వచ్చారన్న ప్రచారం జరిగింది. ఎమ్మెల్యే దామచర్లతో మంతనాలు సాగించిన ఆమె.. ఎప్పుడు పిలుపు వస్తుందా అని ఎదురు చూస్తూ వచ్చారు. ఇప్పుడు కూటమి పెద్దల నుంచి గ్రీన్ సిగ్నెల్ రావడంతో దామచర్ల ఆమెతో పాటు కార్పొరేటర్లను పార్టీలోకి ఆహ్వానించారు. చేరిక సందర్భంగా మేయర్ అందరిలాగే అభివృద్ధి కోసమే పార్టీ మారుతున్నామని స్టేట్ మెంట్ ఇచ్చేశారు.

ఇప్పటికే పలు సార్లు మేయర్ సుజాత ఎమ్మెల్యే దామచర్ల జనర్ధన్‌తో టీడీపీలో చేరికపై చర్చించారు. అయితే దామచర్ల మెదట కార్పొరేటర్లను జాయిన్ చేసుకుని తర్వాత మేయర్‌ను చేర్చుకుంటామన చెప్పినట్లు ప్రచారం జరిగింది. అయితే ఆమెను మేయర్‌గా కొనసాగించేందుకు టీడీపీ నేతలు సుముఖంగా లేరని అందుకే ముందుగా కార్పొరేటర్లను చేర్చుకుని మెజార్టీ సాధిస్తే.. ఆమెను మేయర్ పీఠం నుంచి దించి. పార్టీ వారికి ఆ పదవి కట్టబెట్టు కోవచ్చని భావించారంట. తీరా చూస్తే మున్సిపల్ చట్టం ఉన్న లొసుగులు సుజాతను పదవి నుంచి దించడానికి సహకరించకపోవడంతో.. దామచర్ల ఆమెను పార్టీలో సాదరంగా ఆహ్వానించారంటున్నారు.

Also Read: ఒక్క గెలుపుతోనే జగన్‌లో ఇంత మార్పా..?

వాస్తవానికి ఒంగోలు కార్పొరేషన్ ఎన్నికలు జరిగి మూడేళ్లు దాటింది. కౌన్సిల్ ఏర్పడి 2024 మార్చి 14 నాటికి మూడు సంవత్సరాలు పూర్తయింది. 2014లో టీడీపీ కూటమి అధికార పగ్గాలు చేపట్టినప్పుడు మున్సిపల్ చట్టంలో మార్పులు చేసింది … అప్పటికి పదేళ్లు ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని. మున్సిపాల్టీలు, కార్పొరేషన్లలో చైర్ పర్సన్, మేయర్‌లపై ఎన్నికలు జరిగిన నాలుగేళ్ల వరకు అవిశ్వాసం పెట్టకూడదని చట్టం చేసింది. దాన్ని మూడు సంవత్సరాలకు కుదిస్తూ చట్టం మార్చాలన్న ఆలోచనలో కూటమి ప్రభుత్వం ఉన్నట్లు ప్రచారం జరిగింది. అదే జరిగితే రాష్ట్రంలోని చాలా మునిసిపాలిటీలు, కార్పొరేషన్లు కూటమి వశం అయ్యే అవకాశం ఉండేది. అయితే అలా చట్టాన్ని మారిస్తే విమర్శలు మూటగట్టుకోవాల్సి వస్తుందని ప్రభుత్వ పెద్దలు పునరాలోచనలో పడినట్లు కనిపిస్తున్నారు.

ఏదైతేనేం ఒంగోలు కౌన్సిన్లో వైసీపీకీ షాక్ ఇస్తూ మేయర్, డిప్యూటీ మేయర్, కార్పొరేటర్లు టీడీపీలోకి వచ్చేశారు. ప్రభుత్వ పెద్దల నిర్ణయం వెలువడే వరకు సుజాత టీడీపీ మేయర్‌గానే సీట్లో కొనసాగే పరిస్థితి కనిపిస్తోంది. అయితే ఈ పార్టీ మర్పులు చేర్పులు వ్యవహారం ఒంగోలు తమ్ముళ్లకు మింగుడుపడటం లేదంట . వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు బాలినేని శ్రీనివాస్‌రెడ్డి అనుచరులుగా పని చేసి, తమతో కయ్యానికి కాలు దువ్విన వారు ఇప్పుడు తమ పార్టీలోకి వస్తుండటంతో టీడీపీ శ్రేణులకు మైండ్ బ్లాక్ అవుతోందంట.

వైసిపి అధికారంలో ఉన్నప్పుడు టీ స్టాళ్ల దగ్గర నుంచి.. అపార్ట్‌మెంట్ల నిర్మాణాలు వరకు ఆ పార్టీ నేతలు వసూళ్ల దందా నడిపించారంట. ఒక మాటలో చెప్పాలంటే వైసిపి అభ్యర్ధి బాలినేని ఓటమికి వైసీపీ కార్పొరేటర్లే ప్రధాన కారణం అన్న ప్రచారం ఉంది. అలాంటి వాళ్లను ఇప్పుడు టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల జనర్ధన్.. రెడ్ కార్పెట్ వేసి టీడీపీలోకి ఆహ్వానించడాన్ని ఒంగోలు టీడీపీ శ్రేణులు జీర్ణించుకోలేక పొతున్నాయి.. టీడీపీ కార్యకర్తలను అనేక ఇబ్బందులు పెట్టిన వైసిపి కార్పొరేటర్లు. ఇప్పుడు అధికారాన్ని ఎంజాయ్ చేయటానికి వస్తున్నారని టీడీపీ కార్యకర్తలు మండిపడుతున్నారు.

ఇటీవల 50 డివిజన్ కార్పొరేటర్ అంబటి ప్రసాదరావు టీడీపీ లోకి జాయిన్ అయినప్పుడు స్థానిక టీడీపీ నేతాలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. పార్టీ టీడీపీ కార్యాలయం వద్ద నిరసన తెలిపారు.ఇప్పుడు చూస్తే మేయర్ సుజాత సహా, డిప్యూటీ మేయర్ వేమూరి బుజ్జిలతో కలిపి 12 మంది కార్పొరేటర్లు తెలుగుదేశం కండువాలు కప్పేసుకున్నారు. మరిప్పుడు ఒంగోలు కార్పొరేషన్ పాలిటిక్స్ ఏ టర్న్ తీసుకుంటాయో చూడాలి.

Related News

Vidadala Rajini: మాజీ మంత్రి విడుదల రజనీకి కష్టాలు.. రేపో మారో అరెస్ట్ తప్పదా?

Dussehra Holidays: విద్యార్థులకు గుడ్ న్యూస్.. దసరా సెలవుల తేదీలు ఇవే!

YCP vs Janasena: జనసేనలో చేరికలు.. కూటమిలో లుకలుకలు

YSRCP Petition: తిరుమల లడ్డూ వివాదం.. హైకోర్టులో వైసీపీ పిటిషన్, న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు

Ex MP Nandigam Suresh’s house: ఇదేం కేసు.. వైసీపీ మాజీ ఎంపీ ఇంట్లో సోదాలు, నోటీసులిచ్చిన పోలీసులు

Tirumala Laddu Prasadam: తిరుమల లడ్డూ వివాదం, రామ్ జన్మభూమి ట్రస్ట్.. రమణ దీక్షితులు స్పందన ఇదే, శారదా పీఠం మౌనమేలా?

Pawan Kalyan: తిరుమల లడ్డూ వివాదం.. డిప్యూటీ సీఎం పవన్ సంచలన పోస్ట్

Big Stories

×