EPAPER

Asteroids Approaching Earth: భూమివైపు దూసుకొస్తున్న రెండు గ్రహశకలాలు.. విమానం కంటే పెద్ద ఆకారంలో..!

Asteroids Approaching Earth: భూమివైపు దూసుకొస్తున్న రెండు గ్రహశకలాలు.. విమానం కంటే పెద్ద ఆకారంలో..!

Asteroids Approaching Earth| భూగ్రహం వైపు రెండు పెద్ద గ్రహశకలాలు వేగంగా వస్తున్నాయని అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా(NASA) గురువారం తెలిపింది. ఆగస్టు 16, శుక్రవారం భూమికి చేరువలో ఉంటాయని చెప్పింది. ఈ గ్రహశకాలలకు 2021 GY1, 2024 OY2 అని నామకరణం చేసింది.


రెండు గ్రహశకలాలు విమానం కంటే పెద్ద ఆకారంలో ఉన్నాయని నాసా జెట్ ప్రపల్సన్ లేబొరేటరీ పరిశోధకలు తెలిపారు. గ్రహశకలాల్లో ఒకటి 180 అడుగుల డయామీటర్లు ఉండగా.. మరొకటి 110 అడుగుల డయామీటర్ల ఆకారం (చుట్టుకొలత) ఉందని చెప్పారు. అయితే ఈ రెండు గ్రహశకలాలు భూమికి అతి సమీపం నుంచి ప్రయణించి వెళ్లిపోతాయని.. వీటి వల్ల ప్రస్తుతం ఏ ప్రమాదం లేదని అన్నారు.

2021 GY1, 2024 OY2 గ్రహశకలాలు అతి సమీపం నుంచి చూడడం ఒక అద్భుత అవకాశమని.. ఏ హాని లేకపోవడం వల్ల ఈ అవకాశాన్ని పరిశోధన కోసం ఉపయోగించుకోవచ్చని తెలిపారు. నెల రోజుల క్రితమే ఇలాంటి గ్రహశకలాలు భూమి సమీపం నుంచి ప్రయాణించాయని.. ఇలా జరగడం పరిశోధనలు చేయడానికి ఉపయోగపడుతుందని అభిప్రాయపడ్డారు.


గ్రహశకలాలు భూమివైపు వస్తున్న సమయంలో ఏదైనా ప్రమాదం సంభవించే అవకాశ మున్నప్పుడు ఈ పరిశోధనలు ఉపయోగపడతాయని.. ఉదాహరణకు భూమిని గ్రహశకలాలు ఢీ కొట్టే అవకాశం ఉంటే వాటిని మార్గం మధ్యలోనే ఎలా ఎదుర్కోవాలి.. వాటిని నాశనం చేయాలా? లేక వాటి దారి మళ్లించగలమా? అని పరిశోధనలు చేయవచ్చని వివరించారు.

ప్రస్తుతం సమీపిస్తున్న 2021 GY1, 2024 OY2 గ్రహశకలాలను దెగ్గర నుంచి చూసి వాటి పరిమాణం, వేగం, అవి ఏ పదార్థాలతో ఏర్పడ్డాయి అనే సమాచారాన్ని సేకరించవచ్చు. ఇలాంటి పరిశోధనల ద్వారా బ్రహ్మాండంలోని సౌర వ్యవస్థ గురించి మరింత లోతుగా అవగాహన కలుగుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు.

గ్రహశకలాలు సాధారణంగా సూర్యుడి చుట్టూ తిరిగే రాళ్లు లేదా అతిచిన్న గ్రహాలు. మార్స్, జుపిటర్ గ్రహాల చుట్టూ కూడా చాలా గ్రహశకలాలు ఉన్నట్లు సమాచారం. మొత్తం 8 గ్రహాలలో ఉన్న గ్రహశకలాలు కలిపినా వాటి ఆకారం చంద్రుడి కంటే చిన్నదే. గ్రహశకలాల్లో శాస్త్రవేత్తలు కనుగొన్న అతిపెద్ద గ్రహ శకలం ‘4 వెస్టా’ ఆకారం 530 కిలోమీటర్ల డయామీటర్లలో ఉంది. అతి చిన్న గ్రహశకలం కేవలం పది మీటర్ల డయామీటర్లలో ఉంది.

Also Read: శామ్ సంగ్ బాహుబలి బ్యాటరీ.. నిమిషాల్లో చార్జింగ్.. వేయికిలోమీటర్ల మైలేజ్!

Related News

Moto G85 5G: మరో రెండు కొత్త కలర్‌ వేరియంట్‌లలో మోటో ఫోన్.. ఫీచర్లు అదుర్స్, ధర ఎంతంటే?

iQoo Z9 Turbo+: అ అ అదుర్స్.. 6400 mAh బ్యాటరీతో ఐక్యూ కొత్త ఫోన్, ఫీచర్లు పిచ్చెక్కించాయ్ బాబోయ్!

Honor 200 Lite 5G: హమ్మయ్య వచ్చేసింది.. AI ఫీచర్లు, 108MP కెమెరాతో కొత్త ఫోన్ లాంచ్, ధర చాలా తక్కువ!

Vivo V40e: ఊహించలేదు భయ్యా.. వివో నుంచి కొత్త ఫోన్, కీలక ఫీచర్లు వెల్లడి!

Inactive Gmail Accounts shutdown: సెప్టెంబర్ 20 నుంచి జిమెయిల్ అకౌంట్లు బంద్.. మీ అకౌంట్‌ని కాపాడుకోండిలా..

Samsung Galaxy M55s 5G: మరో చీపెస్ట్ ఫోన్.. ఈ టెక్నాలజీ అదిరిపోయింది, 50MP ఫ్రంట్ కెమెరా కూడా!

Flipkart Big Billion Days Sale 2024: కొత్త సేల్.. రూ.80,000 ధరగల ఫోన్ కేవలం రూ.30,000 లోపే, డోంట్ మిస్!

Big Stories

×