EPAPER
Kirrak Couples Episode 1

Kavitha : కవితను మళ్లీ.. మళ్లీ.. ప్రశ్నిస్తారా?.. సీబీఐ నెక్ట్స్ స్టెప్ ఏంటి..?

Kavitha : కవితను మళ్లీ.. మళ్లీ.. ప్రశ్నిస్తారా?.. సీబీఐ నెక్ట్స్ స్టెప్ ఏంటి..?

Kavitha : దేశవ్యాప్తంగా రాజకీయ ప్రకంపనలు రేపుతున్న అంశం ఢిల్లీ లిక్కర్ స్కామ్. తొలుత ఢిల్లీ ప్రభుత్వాన్ని ఈ కేసు ఉక్కిరిబిక్కిరి చేసింది. అటు సీబీఐ, ఇటు ఈడీ వరుస దాడులతో కేజ్రీవాల్ ప్రభుత్వాన్ని వణికించింది. ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా టార్గెట్ గా ఈ కేసు దర్యాప్తు సాగుతోంది. తెలుగు రాష్ట్రాలకు ఢిల్లీ లిక్కర్ స్కామ్ తో ఉన్న లింకులు బయటకు వచ్చాయి. ఈ కేసులో టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ప్రమేయం ఉందని పదేపదే బీజేపీ నేతలు ప్రకటించారు. సీబీఐ, ఈడీ విచారణకు సిద్ధం కావాలని హెచ్చరించారు. బీజేపీ నేతల కామెంట్స్ ను కేసీఆర్ అంత తేలిగ్గా తీసుకోలేదు. వెంటనే రాష్ట్రంలోకి సీబీఐ ఎంటర్ కాకుండా చర్యలు తీసుకున్నారు. సీబీఐకు అనుమతి నిరాకరిస్తూ జీవో జారీ చేశారు. అయినా సరే సీబీఐ ఎంటరైంది. కేసీఆర్ కుమార్తె కవితను విచారించింది.


కవితకు సీబీఐ నోటీసులు ఇచ్చినప్పటి నుంచి అనేక ట్విస్టులు చోటు చేసుకున్నాయి. తొలుత సీబీఐ చెప్పిన తేదిన విచారణకు కవిత అంగీకరించారు. ఆ తర్వాత రోజే లిక్కర్ స్కామ్ ఎఫ్ఐఆర్, ఫిర్యాదు కాపీలు ఇవ్వాలని కోరారు. వెబ్ సైట్ లో ఎఫ్ఐఆర్ , ఫిర్యాదు కాపీలు చూసుకోవచ్చని సీబీఐ రిఫ్లై ఇచ్చింది. ఆ తర్వాత ఎఫ్ఐఆర్ లో తనపేరు లేదని కవిత తిరిగి సీబీఐకు లేఖ రాశారు. తొలుత సీబీఐ చెప్పిన డిసెంబర్ 6 న విచారణకు కుదరదని స్పష్టం చేశారు. ఈ నెల 11, 12, 14, 15 తేదీల్లో ఏదో ఒకరోజు విచారణకు ఓకే అనే కవిత సీబీఐకు ఆఫ్షన్లు ఇచ్చారు. కవిత ఇచ్చిన మొదటి ఆఫ్షనే సీబీఐ అధికారులు ఎంచుకున్నారు. కట్ చేస్తే..

ఆదివారం ఉదయం 11 గంటల సమయం. ఆరుగురు సభ్యులతో కూడిన సీబీఐ అధికారుల బృందం రెండు వాహనాల్లో బంజారాహిల్స్‌లోని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నివాసానికి వచ్చింది. వారిలో ఒక మహిళా అధికారి కూడా ఉన్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ పై సీబీఐ విచారణ ప్రారంభించింది. ఇందుకోసం కవిత నివాసంలో ఒక గదిలో ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారని సమాచారం. సీబీఐ అధికారులు ఆమెను సుధీర్ఘంగా ప్రశ్నించారు. 160 సీఆర్ పీసీ నోటీసు కింద విచారించారు. కవితను ఆమె న్యాయవాది సమక్షంలో ప్రశ్నించారు. దాదాపు ఏడున్నర గంటలపాటు ప్రశ్నల పరంపరం కొనసాగింది. సాయంత్రం ఆరున్నర గంటలకు విచారణ ముగిసింది. కవిత నివాసం నుంచి సీబీఐ అధికారులు వెళ్లిపోయారు. సీబీఐ అధికారులు వచ్చారు. ప్రశ్నించారు. ఢిల్లీ మద్యం స్కామ్ లో సాక్షిగా స్టేట్ మెంట్ రికార్డు చేసుకున్నారు. వెళ్లిపోయారు. క్లుప్తంగా ఇదే జరిగింది. అంతుకుమించిన సమాచారం అయితే లేదు. సీబీఐ విచారణ జరుగుతున్న సమయంలోనూ ఆ తర్వాత కవిత నివాసం వద్ద భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.


సీబీఐ నెక్ట్స్ స్టెప్ ఏంటీ?
ఎమ్మెల్సీ కవిత 10 ఫోన్లు ధ్వంసం చేశారని అమిత్‌ అరోరా రిమాండ్‌ రిపోర్టులో సీబీఐ పేర్కొంది. ఈ అంశంపైనే ఎక్కువగా ప్రశ్నించినట్టు తెలుస్తోంది. ఈ కేసుకు సంబంధించి ఇప్పటి వరకు ఆమెను సాక్షిగా మాత్రమే విచారించారు. ఈ ఒక్కరోజు విచారణతో సీబీఐ అధికారులు ముగిస్తారా? ముందు ముందు కవితను మళ్లీ మళ్లీ ప్రశ్నించే అవకాశం ఉందా? ఈ ప్రశ్నలపై సీబీఐ స్పష్టత ఇవ్వాల్సిఉంది.

సీబీఐ విచారణ ముగిసిన తర్వాత బీఆర్ఎస్ కార్యకర్తలు కవిత నివాసానికి భారీగా చేరుకున్నారు. ఇది రాజకీయ ప్రేరేపిత కేసుగా ఆ పార్టీ నేతలు అభివర్ణించారు. సీబీఐ విచారణ ముగిసిందని అనుకోవడం లేదని దాసోజు శ్రవణ్ కుమార్ అన్నారు. బాధ్యత కలిగి ప్రజాప్రతినిధిగా కవిత సహకరించారని టార్గెట్ చేసి ఈ కేసులో ఇరికించే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు. కేసీఆర్ ను అప్రతిష్టపాలు చేయాలని ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. అంటే బీఆర్ఎస్ నేతలే విచారణ ఇంకా ముగియలేదని అంటున్నారు. సో ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కవిత ఎపిసోడ్ ఇప్పుడే స్టార్ట్ అయ్యింది. భవిష్యత్తులో విచారణ ఎలా సాగుతుందో చూడాలి. ఈ కేసు ఎలాంటి మలుపులు తిరుగుతుందనేది ఆసక్తిగా మారింది.

సీబీఐ విచారణ తర్వాత కవిత ప్రగతిభవన్ కు వెళ్లి కేసీఆర్ తో భేటీ అయ్యారు. దాదాపు 45 నిమిషాలపాటు సీబీఐ విచారణపై చర్చించారు.

Related News

Vijayasai Reddy to Join in TDP: టీడీపీలోకి విజయసాయిరెడ్డి? బాంబు పేల్చిన అచ్చెన్న..

Israeli airstrikes on Beirut: లెబనాన్ రాజధాని బీరుట్‌పై బాంబుల వర్షం.. వంతెనల కిందే ఆకలి బతుకులు

President Draupadi Murmu : రేపు హైదరాబాద్‌కు రాష్ట్రపతి ముర్ము.. ఈ మార్గాల్లో వెళ్తే అంతే సంగతులు

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ జోలికొచ్చి బుక్కైన నానీలు..

Russia Vs Ukraine War: దూసుకొస్తున్న రష్యా మిస్సైల్? వణికిపోతున్న ఉక్రెయిన్

YS Jagan vs Botsa Satyanarayana: వైసీపీ నేతల పార్టీ మార్పు వెనుక బొత్స వ్యూహం ఉందా?

Irregularities: జూబ్లీహిల్స్‌లో బయటపడ్డ మరో భారీ బాగోతం.. 36 ఏండ్ల నుంచి..

Big Stories

×