EPAPER

PM Modi Women Safety: మహిళలపై అత్యాచారాలకు కఠిన శిక్షలు ఉండాలి.. ప్రధాని మోదీ

PM Modi Women Safety: మహిళలపై అత్యాచారాలకు కఠిన శిక్షలు ఉండాలి.. ప్రధాని మోదీ

PM Modi Women Safety| మహిళలపై జరిగే అత్యాచార ఘటనల్లో వేగవంతమైన విచారణ జరగాలని, దోషులను చాల కఠినంగా శిక్షలు పడే విధంగా మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఆగస్టు 15, స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా చేసిన ప్రసంగంతో ప్రధాని మోదీ మహిళల భద్రత అంశం గురించి ముఖ్యంగా ప్రస్తావించారు.


‘అత్యాచార ఘటనల్లో దోషులకు కఠిన శిక్షలు ఉంటాయని మీడియా ప్రజలకు చెప్పాలి. ఈ శిక్షల భయం తప్పు చేయాలనే వారిలో కలగాలి’ అని మోదీ తీవ్ర స్వరంతో అన్నారు. కోల్ కతా లో మహిళా డాక్టర్ హత్యాచార ఘటన సందర్భంలో ప్రధాని మోదీ వ్యాఖ్యలు ప్రాముఖ్యం సంతరించుకున్నాయి.

మహిళలకు ఆర్థిక శక్తి
స్వాతంత్య్ర దినోత్సవం ప్రసంగంలో ప్రధాని మోదీ మహిళలు ఆర్థికంగా అభివృద్ధి సాధించాలని కోరారు. అందుకోసం ప్రభుత్వ సహకారం ఎల్లప్పుడూ ఉంటుంద్నారు. ద్వాక్రా లాంటి స్వయం సహాయక ప్రభుత్వ పథకాలతో మహిళకు లబ్ది చేకూరుతోందని.. ప్రస్తుతం దేశంలో 10 కోట్ల మంది మహిళలు ఈ పథకాల్లో చేరరాని తెలిపారు. ఈ పథకాల ద్వారా కుటుంబంలో, సమాజంలో మహిళలకు నిర్ణయం తీసుకునే శక్తి లభించిందని చెప్పారు. అలాగే ప్రధాని మోదీ ఒక శుభవార్త చెప్పారు. ఉద్యోగం చేసే సమయంలో గర్భవతులైతే వారికి 12 నుంచి 26 వారాలపాటు మెటర్నిటీ సెలవు ప్రకటించారు.


Also Read: స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా మీ ప్రియమైన వారికి ఈ సందేశాలు పంపండి

స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆయన స్వాతంత్య్ర కోసం పోరాడిన అమర వీరులను, వారి త్యాగాలను గుర్తుచేశారు. దేశ అభివృద్ధి కోసం వికసిత్ భారత్ 2047 కోసం కృషి చేయాలని పౌరులకు పిలుపునిచ్చారు. స్వాతంత్య్ర సమర యోధులను స్ఫూర్తిగా తీసుకొని భవిష్యత్తు కోసం దేశఅభివృద్ధి కోసం పనిచేయాలని అన్నారు.

Also Read: మాజీ ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ రికార్డ్‌ను సమం చేసిన ప్రధాని మోదీ..

ఆగస్టు 15 ప్రసంగంలో ప్రధాని దేశంలో 5జీ టెక్నాలజీని దేశంలో విజయవంతంగా అమలు చేశామని.. 6జీ టెక్నాలజీపై పనిజరుగుతోందని తెలిపారు. తయారీ రంగంలో దేశ నైపుణ్యతని కొనియాడారు. దేశంలోని ఐటి నిపుణులు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నిపుణులు అద్భుతమైన గేమింగ్ ప్రాడక్ట్స్ తీసుకురావాలని, కొత్త ఉద్యోగాలు సృష్టించాలని.. గేమింగ్ రంగంలో అంతర్జాతీయ స్థాయిలో దేశ ఖ్యాతి పెంచాలని సూచనలు చేశారు.

తయారీ రంగంలో హై క్వాలిటీ ప్రాడక్ట్స్ చేయడంలో భారత దేశం ప్రపంచ దేశాలతో పోటీపడుతోందని.. భారత్ ఉత్పత్తులు ప్రామాణికంగా మిగతా దేశాలు అనుసరించే విధంగా నాణ్యమైన ఉత్తపత్తులను తయారు చేయాలని సూచించారు. అందుకు భారత దేశంలో కావాల్సిన టాలెంట్ ఉందని అన్నారు.

Also Read: డిగ్రీ చదవకుండానే సంవత్సరానికి రూ.5 కోట్లు సంపాదిస్తున్న యువతి.. ఎలాగంటే?..

 

Related News

Mahalakshmi Scheme: కాంగ్రెస్ హామీని కాపీ కొట్టిన బీజేపీ

Rahul Gandhi: ఖర్గే, నడ్డాల లేఖల యుద్ధం

Toxic Workplace: వర్క్ ప్రెజర్‌ తట్టుకోలేక ప్రైవేట్ ఉద్యోగిని మృతి.. రంగంలోకి దిగిన సర్కారు

Delhi CM: ఢిల్లీ సీఎంగా అతిశీ ప్రమాణానికి డేట్ ఫిక్స్

Rahul Gandhi Vs Ravneet Bittu: జాతీయ పార్టీల అధినేతల మధ్య లేఖల యుద్ధం..

Monkeypox Case in India: భారత్‌ను వణికిస్తున్న మంకీపాక్స్.. రెండో కేసు నమోదు.

Train accident in Uttar Pradesh: పట్టాలు తప్పిన మరో రైలు.. రైళ్ల రాకపోకలకు అంతరాయం

Big Stories

×