EPAPER

KTR, Harish rao: బావ బావమరిది మధ్య కోల్డ్ వార్..హరీశ్ వెర్సెస్ కేటీఆర్?

KTR, Harish rao: బావ బావమరిది మధ్య కోల్డ్ వార్..హరీశ్ వెర్సెస్ కేటీఆర్?

Cold war between ktr ..harish rao..tension in party cader: వాళ్లిద్దరూ రాజకీయ ఉద్దండ కుటుంబం నుంచి వచ్చిన బావ బావమరుదులు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించి ప్రజాభిమానాన్ని చూరగొన్నారు. మంత్రి పదవులలంకరించి పదేళ్లుగా తెలంగాణలో రాజకీయ చక్రం తిప్పారు. తీరా అధికారం లేకపోవడంతో ఇప్పుడు అధికార పక్షం మీద విమర్శనాస్త్రాలతో విరుచుకుపడుతున్నారు. అయితే వారిద్దరి మధ్య కొంతకాలంగా కోల్డ్ వార్ నడుస్తోంది. ఒకరు ఔనంటే ఇంకొకరు కాదని..వీళ్ల వ్యవహారంతో అసలే పీకల్లోతు కష్టాలలో ఉన్న ఆ అగ్రనేతతో సహా పార్టీ సీనీయర్లు తలలు పట్టుకుంటున్నారు. ఇంతకీ వాళ్లెవరంటే కల్వకుంట్ల కుటుంబ సభ్యులైన కేటీఆర్, హరీష్ రావు.
వీళ్లిద్దరి మధ్య గత కొంతకాలంగా గొడవలు రాజుకుంటునే ఉన్నాయి. అయినా పరువు కోసం ఇద్దరూ పైకి బాగానే ఉన్నా ఎవరికి వారు సొంత క్యాడర్ ను నమ్ముకుని వారి మద్దతుతో కొనసాగుతున్నారు.


చాలా కాలంగా కోల్డ్ వార్

ఎప్పుడైతే కేసీఆర్ తన తర్వాత కేటీఆర్ ని యువరాజుగా ప్రకటించారో అప్పటినుంచే ఈ గొడవలు రాజుకున్నాయి. అయితే వార్తా కథనాలను ఇంతకాలం కొట్టిపారేస్తూ వారిద్దరూ ఒకటే అన్నట్లుగా కలర్ ఇచ్చుకుంటూ వస్తున్నారని రాజకీయ పండితులు చెబుతున్నారు. అయితే గత అసెంబ్లీ,పార్లమెంట్ ఎన్నికల ఓటమి తర్వాత వీరిద్దరూ తలో దారి అన్నట్లుగా పార్టీ శ్రేణులను సైతం పట్టించుకోవడం లేదని టాక్. పార్టీ నుంచి కాంగ్రెస్ లోకి వలస వెళుతున్నవారిని సైతం వీరిద్దరిలో ఏ ఒక్కరూ వారించడం లేదు. పైగా వెళ్లిపోయిన వారిలో ఎవరి వర్గం అనుకుంటూ లెక్కలు వేసుకుంటున్నారని పార్టీ వర్గాలే బాహాటంగా చర్చించుకుంటున్నాయి. వీళ్లిద్దరినీ సమన్వయ పరచడం అగ్రనేత కేసీఆర్ వలన కూడా కావడం లేదు.
అయితే వీరిద్దరి మధ్య మరో కీలక పరిణామం విషయంలో కోల్డ్ వార్ నడుస్తోంది. తెలంగాణ శ్రీమంతుడుగా ఉన్న బీఆర్ఎస్ కు చెందిన ఓ ప్రముఖుడి సంస్థకు సంబంధించిన విషయంలో వీరిద్దరి మధ్య పొరపొచ్చాలు మరింత ఎక్కువయ్యాయని టాక్. గతంలో కోకాపేట భూముల వేలం విషయంలో అత్యధిక రేటును సొంతం చేసుకున్న ఆ శ్రీమంతుడు బీఆర్ఎస్ విధేయుడు. ఇటీవల కాంగ్రెస్ శ్రేణులు ఆ శ్రీమంతుడి భూముల వ్యవహారంపై విరుచుకుపడుతున్నారు. అయితే కేటీఆర్ మాత్రం తనని, తన వర్గం వారిని టార్గెట్ చేస్తున్నారంటూ కాంగ్రెస్ ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారు.


కేటీఆర్ దూకుడు..హరీశ్ సైలెంట్

ఈ విషయంలో హరీశ్ రావు సైలెంట్ గా ఉన్నారు. ఎవరి గురించో మనం ఎందుకు ప్రభుత్వంపై ఫైట్ చేయాలంటూ కేటీఆర్ కు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అయినా కేటీఆర్ హరీశ్ మాటలు లెక్క చేయడం లేదు. ఇంకా వారిని వెనకేసుకొస్తున్నారు. ఇప్పటికే అగ్ర నేతల చుట్టూ కేసులు చుట్టుముడుతున్నాయి. ఇలాంటప్పుడు వేరే ఎవరి కోసమో మనం ఎందుకు పోరాడాలి అని హరీశ్ రావు సాధ్యమైనంత వరకూ ఇలాంటి వాటికి దూరంగా ఉంటూ వస్తున్నారు. కానీ కేటీఆర్ మాత్రం తమ అనునాయులను వెనకేసుకొస్తూ వారి కోసం అధికార పక్షంతో గొడవలు పెట్టుకుంటున్నారు.

సొంత మీడియాలోనూ వివక్షే

పైగా తన సొంత మీడియాలో కూడా హరీశ్ రావు కు సంబంధించిన వార్తలు ఏమీ కవర్ కానీయకుండా చేస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. హరీష్ రావుకు సంబంధించిన వార్తలన్నీ లోపల పేజీలలో కానీ అసలు వెయ్యకపోవడం కానీ చేస్తున్నారు. ఇలా ప్రతి అంశంలోనూ ఇద్దరి మధ్య నడుస్తున్న వ్యవహారంతో కేడర్ అన్యాయమైపోతోంది. ఒకరి మీటింగ్ కు మరొకరు గైర్హాజరవుతున్నారు. గ్రూపుల వారీగా విడిపోతున్నారు. మరి ఈ విషయంలో కేసీఆర్ ఏదైనా కఠిన నిర్ణయం తీసుకుంటారేమో అని అంతా ఎదురుచూస్తున్నారు.

 

.

Related News

Nagabubu: నాగబాబు సెటైరికల్ పోస్ట్.. జానీ మాస్టర్ కేనా..?

Jani Master : కేసులో మరో ట్విస్ట్.. కూపీ లాగనున్న మహిళా కొరియోగ్రాఫర్..!

Bigg Boss 8 Day 18 Promo: హౌస్ లో పెద్ద డ్రామా నడుస్తోందే.. సోనియా కి ఝలక్ ఇచ్చిన నబీల్..!

Heroine Poorna: తల్లిని నిందించారు.. హేళన మాటలపై పూర్ణ ఎమోషనల్..!

NaniOdela2: ఫ్యాన్స్ గెట్ రెడీ.. మాస్ జాతరకు సిద్ధం కండమ్మా..!

Chiranjeevi: చిరు చేసిన పనికి గుండె ఆగిపోయినంత పనైంది- తెలుగు హీరోయిన్..!

Krithi Shetty: లైంగిక వేధింపులపై ఉప్పెన బ్యూటీ ఊహించని కామెంట్స్.. అది కావాలంటూ..!

Big Stories

×