EPAPER

OnePlus Independence Day Sale: దీనవ్వ తగ్గేదే లే.. వన్‌ప్లస్ ఫోన్లపై బంపర్ డిస్కౌంట్లు.. ఎప్పటివరకంటే..?

OnePlus Independence Day Sale: దీనవ్వ తగ్గేదే లే.. వన్‌ప్లస్ ఫోన్లపై బంపర్ డిస్కౌంట్లు.. ఎప్పటివరకంటే..?

Independence Day Sale: భారతదేశ 78వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రముఖ ఆన్‌లైన్ షాపింగ్ ప్లాట్‌ఫారమ్‌లో పలు సేల్స్ జరుగుతున్నాయి. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌ వంటి ఆన్‌లైన్ సంస్థలు తమ వినియోగదారులను ఆకట్టుకునేందుకు పలు ప్రొడక్టులపై తగ్గింపులు ప్రకటించాయి. మరోవైపు చైనీస్ స్మార్ట్‌ఫోన్ తయారీదారు వన్‌ప్లస్ కూడా ఇండిపెండెన్స్ డే సందర్భంగా ప్రత్యేక సేల్‌ను ప్రకటించింది. ఈ సేల్‌లో వినియోగదారులు Oneplus Nord 4, Oneplus Nord CE 4 Lite, Oneplus 12, Oneplus 12R, Oneplus Open వంటి ప్రముఖ ఫోన్‌లపై భారీ తగ్గింపులు పొందొచ్చు. ఈ ఆఫర్‌లన్నీ Amazon, OnpPlus అఫీషియల్ వెబ్‌సైట్, OnePlus ఎక్స్‌పీరియన్స్ అవుట్‌లెట్‌లు, ఆఫ్‌లైన్ స్టోర్‌లలో కూడా వర్తిస్తాయి.


Oneplus Nord 4:

OnePlus Nord 4 పై కూడా పలు తగ్గింపులు అందుబాటులో ఉన్నాయి. అందులో 8GB ర్యామ్+ 128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 29,999, 8GB ర్యామ్ + 256GB స్టోరేజ్ ధర రూ. 32,999, 12GB ర్యామ్ + 256GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 35,999గా నిర్ణయించబడింది. అయితే ఇండిపెండెన్స్ డే ఆఫర్ సమయంలో వినియోగదారులు ICICI, OneCard బ్యాంక్ కార్డ్‌లతో కొనుగోలు చేయడం ద్వారా 8GB RAM వేరియంట్‌పై రూ. 2,000 వరకు, టాప్ మోడల్‌పై రూ. 3,000 వరకు తగ్గింపును పొందవచ్చు.


Oneplus Nord CE 4:

OnePlus Nord CE 4 స్మార్ట్‌ఫోన్‌ను కూడా భారీ తగ్గింపుతో కొనుక్కోవచ్చు. ఇందులో 8GB ర్యామ్ + 128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.24,999గా నిర్ణయించబడింది. అలాగే 8GB ర్యామ్ + 256GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.26,999గా ఉంది. దీనిపై బ్యాంక్ ఆఫర్లుకూడా ఉన్నాయి. ICICI, OneCard వినియోగదారులు దీనిపై తక్షణం రూ.3,000 తగ్గింపు పొందవచ్చు. అప్పుడు మరింత తక్కువ ధరకే ఈ ఫోన్‌ను కొనుక్కోవచ్చు.

Also Read: దిమ్మతిరిగే డీల్.. రూ.10 వేల కంటే తక్కువకే 5జీ ఫోన్లు.. ఎవరికీ చెప్పొద్దు..

OnePlus 12:

OnePlus 12 స్మార్ట్‌ఫోన్ 12GB/ 16GB మోడల్‌లు రూ. 5,000 టెంపరెరీ డిస్కౌంట్‌తో అందించబడుతున్నాయి. అందులో 12GB ధర రూ. 59,999గా.. అలాగే 16GB వేరియంట్ ధర రూ. 64,999గా నిర్ణయించబడింది. అయితే OneCard, ICICI బ్యాంక్ వినియోగదారులు దీనిపై రూ.7,000 తక్షణ తగ్గింపును కూడా పొందవచ్చు. ఇది మాత్రమే కాదు OnePlus కొన్ని స్మార్ట్‌ఫోన్‌లకు రూ. 10,000 వరకు ఎక్స్ఛేంజ్ బోనస్‌ను కూడా అందిస్తోంది. ఇది వర్తిస్తే మరింత తక్కువ ధరకే దీనిని పొందవచ్చు.

Oneplus Open Apex Edition:

వినియోగదారులు ICICI, OneCard ఉపయోగించి కొనుగోలు చేస్తే రూ.20,000 వరకు తక్షణ తగ్గింపు ప్రయోజనం పొందుతారు. దీనితో పాటు ఎక్స్ఛేంజ్ ఆఫర్ కింద రూ. 8,000 వరకు ఎక్స్ఛేంజ్ బోనస్ కూడా అందుబాటులో ఉంటుంది.

OnePlus 12R:

OnePlus 12R కొన్ని వేరియంట్లపై రూ.1,000 వరకు తాత్కాలిక తగ్గింపు లభిస్తుంది. అదనంగా ICICI, OneCard వినియోగదారులు రూ. 2,000 వరకు తక్షణ తగ్గింపును కూడా పొందగలరు.

అయితే ఈ ఆఫర్లన్నీ ఆగస్టు 31 వరకు అందుబాటులో ఉండనున్నాయి. ఆసక్తిగల కస్టమర్లు భారీ డిస్కౌంట్లతో వీటిని కొనుగోలు చేసుకోవచ్చు.

Related News

Canva: కాన్వాతో క్రియేటివ్‌గా డబ్బులు సంపాదించుకోవచ్చు.. మీరూ ట్రై చేయండి!

Honor 200 Lite: హానర్ నుంచి కిక్కిచ్చే స్మార్ట్‌ఫోన్.. 108MP కెమెరా, AI ఫీచర్లతో వచ్చేస్తోంది!

Xiaomi 14T Series: ఒకేసారి రెండు ఫోన్లు.. ఊహకందని ఫీచర్లు, లైకా సెన్సార్లతో కెమెరాలు!

Cheapest Projector: ఇంట్లోనే థియేటర్ అనుభూతి పొందాలంటే.. చీపెస్ట్ ప్రొజెక్టర్ కొనాల్సిందే!

Realme P2 Pro 5G First Sale: ఇవాళే తొలి సేల్.. ఏకంగా రూ.3,000 డిస్కౌంట్, అదిరిపోయే ఫీచర్స్!

New Smartphone: కొత్త ఫోన్ లాంచ్.. రూ.10,000 లకే పొందొచ్చు, ఫీచర్లు బాగున్నాయ్!

HMD Skyline Launched: హెచ్‌ఎండీ నుంచి కొత్త ఫోన్.. డిజైన్ అదుర్స్, ఫీచర్లు పిచ్చెక్కించాయ్, ధర ఎంతంటే?

Big Stories

×