EPAPER

PM Modi Bangladesh Hindus: ‘బంగ్లాదేశ్ హిందువులు సురక్షితంగా ఉండాలని భారతీయులు కోరుకుంటున్నారు’

PM Modi Bangladesh Hindus: ‘బంగ్లాదేశ్ హిందువులు సురక్షితంగా ఉండాలని భారతీయులు కోరుకుంటున్నారు’

PM Modi Bangladesh Hindus| ఆగస్టు 15 స్వాతంత్య్రం దినోత్సవం సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలనుద్దేశించి వరుసగా 11వ సారి ప్రసంగం చేశారు. ఢిల్లీ ఎర్రకోటలో ఆయన జాతీయ పతాకం ఎగుర వేసిన తరువాత చేసిన ప్రసంగంలో పొరుగుదేశం బంగ్లాదేశ్ సంక్షోభం గురించి ప్రస్తావించారు. జాతినుద్దేశించి చేసిన ప్రసంగంలో ప్రధాని మోదీ మాట్లాడుతూ.. బంగ్లాదేశ్‌లో పరిస్థితులు సామాన్య స్థాయికి త్వరగా చేరుకోవాలని ఆశాభావం వ్యక్తం చేశారు. 140 కోట్ల భారత పౌరులు బంగ్లాదేశ్ లోని హిందువులు, మైనారిటీలపై జరుగుతున్న దాడులపై ఆందోళన చెందుతున్నాని అన్నారు. బంగ్లాదేశ్ లో ప్రధాని షేక్ హసీనా రాజీనామా, దేశ బహిష్కరణ తరువాత ఏర్పడిన రాజకీయ సంక్షోభంతో హిందువులు, మైనారిటీల హింసాత్మక దాడులు జరుగుతున్నాయి.


”బంగ్లాదేశ్ లో సంక్షోభం గురించి ఒక పొరుగు దేశంగా భారత్ ఆందోళనగా ఉంది. అక్కడ పరిస్థితులు త్వరగా చక్కబడాలని ఆశిస్తున్నాను. 140 కోట్ల మంది భారతీయులు బంగ్లాదేశ్ హిందువులు, మైనారిటీల సురక్షితంగా ఉండాలని కోరుకుంటున్నారు. శాంతి, అభివృద్ధి మార్గంలో పొరుగు దేశాలు నడవాలని, బంగ్లాదేశ్ లో శాంతియుత వాతావరణం ఉండాలని భారత్ ఎల్లప్పుడూ కోరుకుంటోంది. భవిష్యత్తులో బంగ్లాదేశ్ వికాస్ యాత్ర.. అభివృద్ధి పథంలో నడవాలని, మానవజాతి సంక్షేమం కోసం కృషిచేసేందుకు భారత్ సహకారం చేస్తుంది” అని ప్రధాని మోదీ అన్నారు.

Also Read: మాజీ ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ రికార్డ్‌ను సమం చేసిన ప్రధాని మోదీ..


అంతకుముందు భారత విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జై శంకర్ రాజ్య సభలో బంగ్లాదేశ్ లో ఏర్పడిన రాజకీయ సంక్షోభం గురించి వివరిస్తూ.. హిందువులు, మైనారిటీలపై దాడులు జరగడం ఆందోళనకరమని అన్నారు. బంగ్లాదేశ్ మైనారిటీల భద్రత అంశాన్ని భారత్ పరిశీలిస్తోందని.. సామాజిక సేవా సంస్థల ద్వారా వారి సాయం అందించేందుకు కృషి చేస్తున్నామని ఆయన తెలిపారు. పొరుగుదేశంలో పరిస్థితులు సామాన్య స్థితికి చేరుకునే వరకు దౌత్య పరంగా కృషి చేస్తామని చెప్పారు.

Also Read: స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా మీ ప్రియమైన వారికి ఈ సందేశాలు పంపండి

బంగ్లాదేశ్ లో హిందువులు, క్రిస్టియన్లు, బౌద్ధులపై అల్లరిమూకలు దాడులు చేస్తున్నాయి. హిందూ దేవాలయాలను ధ్వంసం చేస్తున్నాయి. ఇప్పటిరకు హిందువులపై 205 హింసాత్మక దాడులు జరిగినట్లు సమాచారం.

Also Read: డిగ్రీ చదవకుండానే సంవత్సరానికి రూ.5 కోట్లు సంపాదిస్తున్న యువతి.. ఎలాగంటే?..

Related News

Uttarakhand Train: రైలు ప్రమాదానికి భారీ కుట్ర.. పట్టాలపై 6 మీటర్ల ఇనుప రాడ్

Mahalakshmi Scheme: కాంగ్రెస్ హామీని కాపీ కొట్టిన బీజేపీ

Rahul Gandhi: ఖర్గే, నడ్డాల లేఖల యుద్ధం

Toxic Workplace: వర్క్ ప్రెజర్‌ తట్టుకోలేక ప్రైవేట్ ఉద్యోగిని మృతి.. రంగంలోకి దిగిన సర్కారు

Delhi CM: ఢిల్లీ సీఎంగా అతిశీ ప్రమాణానికి డేట్ ఫిక్స్

Rahul Gandhi Vs Ravneet Bittu: జాతీయ పార్టీల అధినేతల మధ్య లేఖల యుద్ధం..

Monkeypox Case in India: భారత్‌ను వణికిస్తున్న మంకీపాక్స్.. రెండో కేసు నమోదు.

Big Stories

×