EPAPER

Jasprit Bumrah: బంగ్లాదేశ్ పర్యటన.. బుమ్రాకు విశ్రాంతి..

Jasprit Bumrah: బంగ్లాదేశ్ పర్యటన.. బుమ్రాకు విశ్రాంతి..

Jasprit Bumrah To Be Rested For India’s home Test series against Bangladesh: టీమ్ ఇండియా తురుపు ముక్క జస్ప్రీత్ బుమ్రాకు బీసీసీఐ రెస్ట్ ఇవ్వనుంది. ఎందుకంటే ఫాస్ట్ బౌలర్లతో ఎక్కువ మ్యాచ్ లు ఆడించడం వల్ల వారి కెరీర్ గ్రాఫ్ తగ్గిపోతుంటుంది. ఇదెన్నో సందర్భాల్లో రుజువైంది. ఒకనాటి కాలంలో అదే పనిగా వారితో బౌలింగు చేయించేవారు. దీంతో వారు గట్టిగా పదేళ్లకు మించి కెరీర్ కొనసాగించలేక పోయేవారు.


ఇవన్నీ గమనించి.. అద్బుతంగా ఆడే మన క్రికెటర్లకు రెస్ట్ ఇవ్వడం ఇప్పుడిప్పుడే మొదలవుతోంది. అయితే లెజండరీ క్రికెటర్ కపిల్ దేవ్ మీడియం పేస్ బౌలర్ కావడంతో ఎక్కువ కాలం కొనసాగాడు. గతానుభవాలను దృష్టిలో పెట్టుకుని బంగ్లాదేశ్ పర్యటనకు జస్ప్రీత్ బుమ్రాకు రెస్ట్ ఇవ్వనున్నారు. టీ 20 ప్రపంచకప్ గెలవడంలో బుమ్రా పాత్ర చాలా కీలకం.

ఎందుకంటే పాకిస్తాన్ తో జరిగిన లోస్కోరు మ్యాచ్ ను బుమ్రాయే గెలిపించాడు. నిజానికి ఆ మ్యాచ్ పాకిస్తాన్ గెలిచి ఉంటే సూపర్ 8కి వచ్చేసేది. సమీకరణాలన్నీ మారిపోయేవి. ఇలా ప్రతీ దశలోనూ బుమ్రా అద్భుతంగా రాణించాడు. ఇవన్నీ గమనించి బీసీసీఐ అప్పటి నుంచి బుమ్రాకి రెస్ట్ ఇచ్చింది. తాజాగా శ్రీలంకతో జరిగిన సిరీస్ కి ఎంపిక చేయలేదు. ఇప్పుడు బంగ్లా పర్యటకు తీసుకోలేదు.


Also Read: మేమంటే మేం.. రికీ పాంటింగ్ వర్సెస్ రవిశాస్త్రి

నవంబరులో ఆస్ట్రేలియాతో జరిగే ఐదు టెస్ట్ మ్యాచ్ ల సిరీస్ కు బుమ్రా సిద్ధం కానున్నాడు. అయితే బంగ్లా పర్యటనకు మహ్మద్ షమీ ఆడే అవకాశాలున్నాయి. ఇప్పటికే తను ప్రాక్టీస్ మొదలుపెట్టాడు. అందుకని తన ప్లేస్ భర్తీ కానుందని అంటున్నారు. శ్రీలంకతో వన్డే సిరీస్ ఓటమి.. రిపీట్ కాకూడదనే ధ్రడ నిశ్చయంలో గంభీర్, రోహిత్ ఉన్నారు.

Related News

IND vs BAN: అదరగొట్టిన ఆల్ రౌండర్లు : అశ్విన్ సెంచరీ, జడేజా 86 నాటౌట్

Pakistan: మీరింక మారరా…బ్యాట్‌తో బలంగా కొట్టుకున్న పాక్ ప్లేయర్..వీడియో వైరల్‌ !

IND vs BAN Test Match: టెస్టు మ్యాచ్ ఫ్రీ గా.. చూడాలని అనుకుంటున్నారా?

Nikhat Zareen: డీఎస్పీగా గ్రూప్ -1 ఉద్యోగంలో.. తెలంగాణ మహిళా బాక్సర్

SA vs AFG: వన్డే క్రికెట్‌లో పెను సంచలనం..మొదటిసారి దక్షిణాఫ్రికాపై విజయం..

India vs Bangladesh: ఇవాళ్టి నుంచే తొలి టెస్ట్..ఆ ఇద్దరు డేంజరస్ ప్లేయర్లు ఔట్ !

IND vs BAN: వాళ్లిద్దరినీ ఎందుకు తీసుకోవడం లేదంటే: గౌతం గంభీర్

Big Stories

×