EPAPER

Iam that Change short film: ఆలోచన రేకెత్తిస్తున్న అల్లు అర్జున్-సుకుమార్ షార్ట్ ఫిలిం

Iam that Change short film: ఆలోచన రేకెత్తిస్తున్న అల్లు అర్జున్-సుకుమార్ షార్ట్ ఫిలిం

Allu Arjun-Sukumars short film Iam that Change: బన్నీ-సుకుమార్ మూవీ అంటే పుష్ప కి ముందు..తర్వాత అని చెప్పాలి. వీరి కలయికలో వచ్చిన పుష్ప ఏ రేంజ్ కలెక్షన్లు రాబట్టిందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు పుష్ప 2 కూడా భారీ అంచనాల మధ్య రానుంది. ఈ ఇయర్ ఎండింగ్ లోగా మూవీ రానుంది. అయితే బన్నీ, సుకుమార్ ఇద్దరి ఆలోచనలూ ఒకటే అని నిరూపిస్తున్నారు. సమాజానికి ఓ మంచి మెసేజ్ ఇద్దామని చేసే ప్రయత్నంలో భాగంగా ఓ షార్ట్ ఫిలిం తీశారు. ‘ఐ యామ్ దట్ ఛేంజ్’. అయితే స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ షార్ట్ ఫిలింని గురువారం విడుదల చేశారు. దీనిని పాత్రికేయుల సమక్షంలో ప్రదర్శించారు.


ఒక్క పైసా తీసుకోకుండా..

ఈ సందర్భంగా అల్లు అర్జున్ భావోద్వేగంతో మాట్లాడారు. మంచి సామాజిక అంశంతో ఓ షార్ట్ ఫిలిం చేయాలని దర్శకుడు సుకుమార్ ని సంప్రదించాను. పాన్ ఇండియా స్థాయి దర్శకుడు ఎవరైనా ఇలాంటి షార్ట్ ఫిలిం చేయాలంటే కనీసం పాతిక లక్షలకు తక్కువ కాకుండా తీసుకుంటారు. అలాంటిది స్నేహానికి ప్రాణం ఇచ్చే సుకుమార్ ఒక్క పైసా కూడా నా నుంచి ఆశించకుండా చేసిపెడతానని ప్రామిస్ చేశారు. దేశం మొత్తం 78వ స్వాతంత్ర్య దినోత్సవం జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా తెలుగు రాష్ట్రాలలో ఈ షార్ట్ ఫిలింని విడుదల చేస్తున్నాం. కేవలం ఒక ఉన్నత ఆశయంతో, సంకల్పంతో ఈ షార్ట్ ఫిలిం చేశాం. ఇదొక టీమ్ వర్క్. ఈ ప్రయత్నంలో మాకు సంగీత దర్శకుడు సాయి కార్తీక్ చక్కని మ్యూజిక్ అందించారు. అలాగే కెమెరా మ్యాన్ అమోల్ రాథోడ్ తన పనితనం చూపించారు. ఎడిటర్ గా ప్రవీణ్ పూడి ఇలా అందరూ కలిసి ఒక మంచి సందేశాత్మక లఘు చిత్రాన్ని తీశామని అన్నారు.


మహనీయుల త్యాగఫలం

దర్శకుడు సుకుమార్ మాట్లాడుతూ ఇలాంటి సందేశాత్మక లఘు చిత్రానికి దర్శకత్వం వహించానని చెప్పుకోవడానికి గర్వంగా ఉందని అన్నారు. దేశ స్వాతంత్రం కోసం, భావి తరాల కోసం ఎందరో మహానుభావులు త్యాగం చేసారు. వారి త్యాగ ఫలాన్ని నేడు మనమంతా అనుభవిస్తున్నాం. వారు అందించిన ఇన్ స్పిరేషన్ తరువాతి తరాలకు కూడా అందించాలనే ఈ షార్ట్ ఫిలిం చేశాము. ఈ మూవీని రెండు రోజుల్లో బన్నీ చెప్పినవిధంగా తీశానని అన్నారు. మనం మన కర్తవ్యాన్ని నిర్వహిస్తే అదే దేశ సేవ చేసినట్లు అవుతుందని అన్నారు. నేటి యువత కూడా సందేశాలు ఇస్తే వినే ఓపిక కూడా లేదు. అయితే మహానుభావుల త్యాగ ఫలం రాబోయే తరాలు కూడా గుర్తుంచుకోవాలని చేసిన యత్నమే ఈ షార్ట్ ఫిలిం అన్నారు. అందరం కలిసి ఓ టీమ్ వర్క్ చేసి మంచి ఔట్ పుట్ ఇచ్చాం. ఇందుకు సహకరించిన కెమెరా డిపార్ట్ మెంట్, మ్యూజిక్, ఎడిటింగ్ అన్ని విభాగాల వారికి కృతజ్ణతలు తెలియజేస్తున్నానని అన్నారు.

పాత్రికేయుల అభినందనలు

బన్నీలో ఉన్న సామాజిక స్పృహ ఈ లఘుచిత్రం ద్వారా తెలుస్తుందని అన్నారు. ఇది అభిమానంతో చేసిందే కాదు ఒక ఉన్నత ఆదర్శంతో చేశామని..ఇందుకు తాను ఎంతగానో గర్విస్తున్నానని దర్శకుడు సుకుమార్ తెలిపారు. తర్వాత పాత్రికేయులు బన్నీ, సుకుమార్ ని అభినందనలతో ముంచెత్తారు. రెండు నిమిషాల నలభై ఐదు సెకండ్లు ఉన్న ఈ షార్ట్ ఫిలిం ఇప్పుడు అందరినీ ఆకట్లుకుంటోంది.

Related News

10 Years For Aagadu: అంచనాల మీద వచ్చాడు, ఆగకుండా పోయాడు

Mahesh Babu – Trisha : త్రిషకు మహేష్ బాబు ముందే తెలుసా? ఇంటర్వ్యూ లో షాకింగ్ విషయాలు..

Prabhas Spirit: ఈ కాంబో కుదిరితే పూనకాలే.. ‘స్పిరిట్’లో విలన్స్‌గా ఆ బాలీవుడ్ స్టార్ కపుల్?

Jani Master Case : చట్టాలతో అమ్మాయిలు ఓవర్ స్మార్ట్ అవుతున్నారు… జానీ కేసుపై లేడీ కొరియోగ్రాఫర్..

Actress : హీరోయిన్ కు 600 కోట్ల ఆస్తిని రాసిస్తానన్న దర్శకుడు… కానీ ఆమె చేసిన పని తెలిస్తే బుర్ర కరాబ్

Jani Master: పోలీసుల అదుపులో జానీ మాస్టర్… డీసీపీ ప్రెస్ నోట్‌లో కీలక విషయాలు

Vishwambhara : మెగా ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్… అనుకున్న టైమ్ కే విశ్వంభర ఆగమనం

Big Stories

×