EPAPER

Jagan new sketch: సింహం సీక్రెట్‌గా కోల్‌కతాకు.. జగన్ పనైపోయినట్టేనా?

Jagan new sketch: సింహం సీక్రెట్‌గా కోల్‌కతాకు.. జగన్ పనైపోయినట్టేనా?

Jagan new sketch: ఏపీలో వైసీపీకి విచిత్రమైన పరిస్థితి నెలకొందా? వైసీపీ అధినేత జగన్ తర్జనభర్జన పడుతున్నారా? బెంగుళూరు అని చెప్పి మిగతా ప్రాంతాల్లో చక్కర్లు కొడుతున్నారా? సింహం సింగిల్‌గానే వస్తోందా? వచ్చే ఎన్నికల నాటికి గుంపుగా వస్తుందా? వైసీపీ పని ఇక అయిపోయినట్టేనా? ఇవే ప్రశ్నలు ఆ పార్టీ నేతలు వెంటాడుతున్నాయి.


వైసీపీలో ఏం జరుగుతుందో ఆ పార్టీ నేతలకు తెలియలేదు. ముఖ్యనేతలు, దిగువస్థాయి నేతలు జంప్ అవుతున్నారు. అధికారం పోయిన తర్వాత వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్‌‌కు కాంగ్రెస్ నుంచి ఎదురు దాడి మొదలైంది. ఎన్నికల తర్వాత నాలుగైదు సార్లు బయటకు వచ్చిన జగన్, మళ్లీ వైసీపీ అధికారంలోకి వస్తుందని చెప్పారు. సహజంగా జగన్ వ్యాఖ్యలపై అధికార పార్టీ నుంచి రిప్లై రావాలి. కానీ ఏపీలో సీన్ మారినట్టు కనిపిస్తోంది.

జగన్ వ్యవహారంపై ఏపీ కాంగ్రెస్ రియాక్ట్ అయ్యింది. జగన్ మళ్లీ ఏపీలో అధికారంలోకి వచ్చే ఛాన్స్ లేదని కుండబద్దలు కొట్టేశారు వైఎస్ షర్మిల. జగన్ మళ్ళీ ఎందుకు రావాలో చెప్పాలని ప్రశ్నలు రైజ్ చేశారు. మళ్ళీ 10 లక్షల కోట్లు అప్పులు చేయడానికి రావాలా? పోలవరాన్ని తాకట్టు పెట్టడానికి మళ్ళీ రావాలా? మద్యపాన నిషేధం అని చెప్పి ప్రజల ప్రాణాలు తీయడానికి మళ్ళీ రావాలా? అంటూ ప్రశ్నలు సంధించా రు.


ALSO READ: 78వ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొన్న ఏపీ సీఎం చంద్రబాబు

వచ్చే ఎన్నికల నాటికి గుంపుగా బరిలోకి దిగాలని వైసీసీ అధినేత జగన్ ప్లాన్ చేస్తున్నారు. ఈ విషయం తెలిసి షర్మిల కౌంటరిచ్చారన్నది టీడీపీ నేతలమాట. ఒకప్పుడు చంద్రబాబుది తోడేళ్లు గుంపు అని కామెంట్స్ చేసిన జగన్.. ఇప్పుడు కాంగ్రెస్, దాని మిత్రపక్షాలతో చేతులు కలిపేందుకు రెడీ అవుతున్నట్లు ఢిల్లీలో టాక్ నడుస్తోంది. ఆనాడు కాంగ్రెస్‌ను ద్వేషించి రాజకీయంగా నిర్వీర్యం చేసిన జగన్, ఇప్పుడు అదే పార్టీతో చేతులు కలిపేందుకు రెడీ అవుతున్నారంటే.. ఏపీలో వైసీపీ ఏ స్థాయికి దిగజారి పోయిందో అర్థం చేసుకోవచ్చు.

అన్నట్లు మాజీ సీఎం జగన్, గడిచిన రెండు నెలల్లో నాలుగైదు సార్లు విజయవాడ నుంచి బెంగుళూరుకి వెళ్లారు. పేరుకే బెంగుళూరు కానీ, అక్కడి వ్యవహారాలు మరోలా ఉన్నాయనే ప్రచారమూ లేకపోలేదు. ఐదు రోజుల కిందట బెంగుళూరుకి వెళ్లిన జగన్, అక్కడి నుంచి నేరుగా కోల్‌కతాకు వెళ్లారట. రెండు రోజులపాటు అక్కడి ఓ హోటల్‌లో స్టే చేశారంటూ టీడీపీ నుంచి ఓ ఫీలర్ బయటకు‌ వచ్చింది.

ఇంతకీ జగన్ కోల్‌కతాకి ఎందుకు వెళ్లినట్టు? అంత సీక్రెట్‌గా అక్కడికి వెళ్లాల్సిన అవసరం ఏమొచ్చింది? కోల్‌కతాలో పులివెందుల ఎమ్మెల్యే చేసిన నిర్వాకాలేంటి? కాంగ్రెస్ వైపు వెళ్లేందుకు రీజినల్ పార్టీతో మంతనాలు సాగించారన్నది అసలు పాయింట్. అటువైపు నుంచి ఎలాంటి సంకేతాలు వచ్చాయో తెలీదు. ఈ విషయం తెలిసి వైఎస్ షర్మిల అలర్ట్ అయ్యిందని అంటున్నారు. ఈ క్రమంలో జగన్ మళ్లీ అధికారం లోకి రారని తేల్చి చెప్పినట్టు తెలుస్తోంది. మొత్తానికి వైసీపీలో ఏదో జరుగుతోందని ఆ పార్టీ నేతలు బలంగా నమ్ముతున్నారు.

Related News

Tirumala Laddu: ఛీ, ఇంత నీచమా? ఏపీ ప్రజల సెంటిమెంట్‌పై గట్టి దెబ్బ.. వైసీపీని ఈ పాపం వెంటాడుతుందా?

Adani Foundation: ఏపీ వరద బాధితులకు అదానీ ఫౌండేషన్ భారీ విరాళం.. ఎంతనో తెలిస్తే ఆశ్చర్యపోతారు!

Tirupati Laddu: తిరుమల లడ్డూ ప్రసాదంలో గొడ్డు మాంసం? ఇదిగో ప్రూఫ్.. ల్యాబ్ టెస్ట్‌లో బయటపడింది ఇదే

Balineni Comments: జగన్ ఏరోజూ సభల్లో నా గురించి మాట్లాడలేదు.. అందుకే పార్టీని వీడా: బాలినేని

Ambati Rambabu: నాణ్యమైన మద్యం అంటే ఏంటి..? ఎంత తాగినా ఆరోగ్యం దెబ్బతినదా..? : అంబటి ఎద్దేవా

YS Jagan: జగన్‌కు మరో భారీ షాక్… తగలనుందా..?

YV Subba Reddy: పెద్ద పాపమే చేశాడు.. చంద్రబాబుకు సుబ్బారెడ్డి కౌంటర్

Big Stories

×