EPAPER

Nikki Haley warns : సొంత పార్టీ నేత ట్రంప్ నే హెచ్చరిస్తున్న నిక్కీ హేలీ..అందుకేనా?

Nikki Haley warns : సొంత పార్టీ నేత ట్రంప్ నే హెచ్చరిస్తున్న నిక్కీ హేలీ..అందుకేనా?

Nikki Haley makes bold declaration about Kamala Harris tells Trump to ‘quit whining’ about her: నిక్కీ హేలీ..భారత మూలాలు ఉన్న అమెరికన్. దక్షిణ కరోలినాకు ప్రథమ మహిళా గవర్నర్ గా పదవీ బాధ్యతలు చేపట్టి రికార్డు సృష్టించారు. అమెరికాలో స్థిర పడిన భారతీయుల మద్దతు కూడగట్టుకోవడంలో మిక్కీ విజయం సాధించారు. నిక్కీ ఫ్యామిలీ ఇండియాలోని పంజాబ్ లో స్థిరపడిన సిక్కు కుటుంబం. అమెరికాలో నవంబర్ నెలలో అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. రిపబ్లికన్ పార్టీ కి చెందిన నిక్కీ ట్రంప్ విజయానికి తీవ్రంగా కృషి చేస్తున్నారు. అయితే ఇటీవల ఎన్నికల ప్రచారంలో ట్రంప్ తన ప్రత్యర్థి ..అమెరికా అధ్యక్ష స్థానానికి పోటీ చేస్తున్న కమలా హ్యారిస్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారు.


సొంత పార్టీకే నష్టం

ఆమె ఓ నల్ల జాతీయురాలని..జాత్యాహంకారపు మాటలు మాట్లాడారు. దానిపై ట్రంప్ కు చాలా వ్యతిరేకత వచ్చింది. ఇలాంటి జాతి వివక్ష మాటలు అనడం సరికాదని దేశ వ్యాప్తంగా ట్రంప్ పై నిరసనలు ధ్వనించాయి. ఇక భారత మూలాలు ఉన్న రిపబ్లికన్ మాజీ అధ్యక్ష అభ్యర్థి నిక్కీ హేలీ ఇటీవల ఓ సమావేశంలో సొంత పార్టీ నేతలకు కొన్ని సూచనలు, సలహాలు ఇచ్చారు. డొనాల్డ్ ట్రంప్ జాతి వివక్ష మాటలు మాట్లాడుతున్నారని ..దాని వలన సొంత పార్టీకి తీవ్ర నష్టం వాటిల్లుతుందని..రాబోయే ఎన్నికలలో అది ప్రభావం చూపుతుందని పరోక్షంగా సూచిస్తున్నారు. డెమోక్రాట్స్ తరపున అధ్యక్ష బరిలో కమలా హ్యారిస్ పోటీ పడుతుండగా..రిపబ్లికన్స్ తరపున డొనాల్డ్ ట్రంప్ పోటీ చేస్తున్నారు.


వ్యక్తిగత విమర్శలు మానుకోవాలి

ఇటీవల జరిగిన ఎన్నికల ప్రచార సభలో కమలా హ్యారిస్ రంగు, జాతి గురించి అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు ట్రంప్. దీనికి స్పందనగా మాట్లాడుతూ నిక్కీ హేలీ ఇలా అన్నారు. వ్యక్తిగత విమర్శలకు ఫుల్ స్టాప్ పెట్టి..ముందు అమెరికన్ల కు తమ పార్టీ తరపున ఏం చేస్తామో తెలపాలని అన్నారు.అమెరికాలో ఉన్న సమస్యలను గుర్తించి తమ పార్టీ ని గెలిపిస్తే వ వాళ్లకు ఏమేం చేస్తామో ప్రమోట్ చేయాలని అన్నారు. సొంత పార్టీ నేతలకే నిక్కీ హేలీ ఇలా సలహాలు ఇవ్వడం చూసి అందరూ మెచ్చుకుంటున్నారు. హేలీ అమెరికా అధ్యక్ష పోటీలో బైడెన్ తప్పుకుంటారని అందరికన్నా ముందుగానే చెప్పడం విశేషం. మరో మూడు నెలలలో జరగబోయే అమెరికా అధ్యక్ష పదవి రేసులో ఇప్పటికే డెమోక్రాట్ అభ్యర్థి కమలా హ్యారిస్ దూసుకుపోతున్నట్లు వార్తలొస్తున్నాయి. చాలా చోట్ల ట్రంప్ వెనకబడి ఉన్నారని అంటున్నారు. కమలా హ్యారిస్ రావాలని భారతీయులంతా కోరుకుంటున్నారు.

Related News

Zimbabwe Elephants: 200 ఏనుగులను వధించేందుకు ప్రభుత్వం అనుమతి.. ప్రజల ఆకలి తీర్చేందుకేనా?!

Lebanon Pager Blasts: లెబనాన్‌లో పేజర్ పేలుళ్లు.. 12 మంది మృతి.. 2800 మందికి గాయాలు

Eswatini king Wife Zuma: 56 ఏళ్ల రాజుకు 16వ భార్యగా 21ఏళ్ల సుందరి.. ‘రాజకీయం కాదు ప్రేమే కారణం’!

Trump: రెచ్చగొట్టే వ్యాఖ్యల ఫలితమే ఇది.. కమలా హ్యారిస్ పై ట్రంప్ కామెంట్స్

Haiti fuel tanker: హైతీలో ఘోర ప్రమాదం..పెట్రోల్ ట్యాంకర్ పేలుడులో 25 మంది మృతి

Donald Trump: ట్రంప్ పై మరోసారి కాల్పులు.. పెద్ద ప్రమాదం తప్పింది

Myanmar Floods: భారీ వరదలు.. 74 మంది మృతి, 89 మంది గల్లంతు

Big Stories

×