EPAPER

Mob vandalises hospital: కోల్‌కతా వైద్యురాలి కేసు.. మిడ్‌నైట్ అట్టుడుకిన కోల్‌కతా, ఆసుపత్రిలో విధ్వంసం

Mob vandalises hospital: కోల్‌కతా వైద్యురాలి కేసు.. మిడ్‌నైట్ అట్టుడుకిన కోల్‌కతా, ఆసుపత్రిలో విధ్వంసం

Mob vandalises hospital: కోల్‌కతాలో అర్థరాత్రి ఏం జరిగింది? నిరసనలు ఎందుకు ఉద్రిక్తంగా మారాయి? మహిళలు ఆసుపత్రి వద్ద ధర్నా చేస్తున్న సమయంలో జరిగిన విధ్వంసం ఎవరి పని? ఆందోళనకారులు రెచ్చిపోయారా? ఆసుపత్రిపై దాడి చేసిన దుండగులు ఎవరు? ఈ కేసు రాజకీయ రంగు పులుముకుందా? ఇలా రకరకాల ప్రశ్నలు వెంటాడుతున్నాయి.


కోల్‌కత్తా ప్రభుత్వ ఆసుపత్రిలో జూనియర్ డాక్టర్‌పై అత్యాచారం, హత్య ఘటనపై బెంగాల్ అంతటా నిరసనలు మిన్నంటాయి. గురువారం అర్థరాత్రి వేలాది మంది మహిళలు ఆర్ జి కర్ మెడికల్ కాలేజీ ఎదుట ఆందోళనకు దిగారు. మిడ్‌నైట్ 12 గంటలు దాటిన తర్వాత కొందరు దుండగులు ఆర్ జి కర్  ఆసుపత్రిలో విధ్వంసానికి తెగబడ్డారు. ఆసుపత్రిలోకి ప్రవేశించి ఆస్తులను ధ్వంసం చేశారు. దుండగులు చివరకు ఎమర్జెన్సీ వార్డును సైతం వదల్లేదు. అక్కడ ఉంచిన మందులను సైతం డ్యామేజ్ చేశారు.

పరిస్థితి గమనించిన పోలీసులు ధర్నా చేస్తున్నవారిని చెదరగొట్టే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో లాఠీఛార్జ్ చేశారు. టియర్ గ్యాస్ ప్రయోగంచారు. దీంతో రెచ్చిపోయిన ఆందోళనకారులు వాహనాలు ధ్వంస చేశారు. అందులో పోలీసులకు సంబంధించిన వాహనాలున్నాయి. ఆసుపత్రికి రక్షణగా ఉన్న పోలీసులపై రాళ్లు, ఇటుకలతో దాడికి దిగారు. దాదాపు రెండు, మూడు గంటలపాటు ఉద్రిక్తత కొనసాగినట్టు వార్తలు వస్తున్నాయి. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదన్నది డాక్టర్ల మాట. పోలీసులు ఇప్పటివరకు ఎంతమందిని అరెస్టు చేశారో తెలీదు.


ALSO READ: ఎర్రకోటపై జాతీయ జెండాను ఎగురవేసిన ప్రధాని మోదీ

దాదాపు 40 మంది దుండగలు ఆసుపత్రికి చెందిన ఆస్తులను డ్యామేజ్ చేసినట్టు పోలీసులు చెబుతున్న మాట. ఈ ఘటనలో కొందరు పోలీసులు గాయడపడినట్టు అధికారులు చెప్పారు. సమాచారం అందుకున్న వెంటనే కోల్‌కతా పోలీసు కమిషనర్ వినీత్ గోయల్ అర్థరాత్రి రెండు గంటల సమయంలో అక్కడికి చేరు కున్నారు. పరిస్థితి సమీక్షించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ అల్లర్లు జరగడానికి వీల్లేదని, అదనంగా పోలీసులను మొహరించారు.

సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని, అందువల్లే ఈ దాడి జరిగిందన్నారు కోల్‌కతా పోలీసు కమిషనర్. కోల్‌కతాలో జూనియర్ డాక్టర్‌పై జరిగిన అత్యాచారం, హత్యకు నిరసనగా రీ క్లెయిమ్ ది నైట్ పేరుతో ఆందోళనకు దిగారు. తమకు న్యాయం చేయాలంటూ నిరసనలు, నినాదాలు చేశారు. సెల్ ఫోన్ల లైట్లతో నిరసన ర్యాలీ చేపట్టారు. మహిళలపై జరుగుతున్న హింసను అరికట్టాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.

ఈ వ్యవహారంపై ఆసుపత్రి వద్ద జరుగుతుండగానే మరోవైపు ఆర్ జి కర్ మెడికల్ కాలేజీలోకి గుర్తు తెలియ ని వ్యక్తులు చొరబట్టారు. వారు చేయాల్సినదంతా చేసి అక్కడి నుంచి సైలెంట్ అయ్యారు. దీనికి రాజకీయ రంగం పులుముకుంది. దీనిపై బెంగాల్ బీజేపీ రియాక్ట్ అయ్యింది.

దాడి వెనుక టీఎంసీకి చెందిన గుంపు ఉండవచ్చని సువేందు అధికారి అనుమానం వ్యక్తంచేశారు. అంతే కాదు ఈ కేసు సీబీఐ దర్యాప్తు చేస్తుండ డంతో ఆసుపత్రిలో కీలక ఆధారాలు ధ్వంసకావచ్చనే అభిప్రాయా న్ని వ్యక్తంచేశారాయన. అటు అధికార టీఎంసీ కూడా అదే రేంజ్ లో రియాక్ట్ అయ్యింది. దాడులకు పాల్పడినవారు ఎవరైనా, ఏ పార్టీ వారైనా 24 గంటల్లోపు చర్యలు తీసుకోవాలని అధికార పార్టీ డిమాండ్ చేసింది.

 

Related News

Cash for Vote Scam: ఓటుకు నోటు కేసులో సీఎం రేవంత్ రెడ్డికి భారీ ఊరట

MLA Bojju Patel: రవ్‌నీత్ సింగ్ తలను తీసుకొస్తే.. నా ఆస్తి రాసిస్తా : కాంగ్రెస్ ఎమ్మెల్యే సంచలనం

Uttarakhand Train: రైలు ప్రమాదానికి భారీ కుట్ర.. పట్టాలపై 6 మీటర్ల ఇనుప రాడ్

Mahalakshmi Scheme: కాంగ్రెస్ హామీని కాపీ కొట్టిన బీజేపీ

Rahul Gandhi: ఖర్గే, నడ్డాల లేఖల యుద్ధం

Toxic Workplace: వర్క్ ప్రెజర్‌ తట్టుకోలేక ప్రైవేట్ ఉద్యోగిని మృతి.. రంగంలోకి దిగిన సర్కారు

Delhi CM: ఢిల్లీ సీఎంగా అతిశీ ప్రమాణానికి డేట్ ఫిక్స్

Big Stories

×