EPAPER

Mister Bachachan review : మెచ్చని పాత్రలో ‘బచ్చన్’ వచ్చెన్..గుచ్చెన్

Mister Bachachan review : మెచ్చని పాత్రలో ‘బచ్చన్’ వచ్చెన్..గుచ్చెన్

Hero Raviteja director Harish Shankar movie Mister Bachachan review : రవితేజ సినిమా అనగానే ఎంటర్ టైన్ మెంట్ పక్కా అని ఆడియన్స్ నమ్మకం. అయితే గత కొంతకాలంగా రవితేజ చేస్తున్న ప్రయోగాలన్నీ వికటిస్తున్నాయి. ముఖ్యంగా రొటీన్ కథలను ఎంచుకుంటూ..మూస డైలాగులతో మెప్పించలేక గత చిత్రాలన్నీ బాక్సాఫీస్ వద్ద రివర్స్ ఫలితాలనిచ్చాయి. రావణాసుర, టైగర్ నాగేశ్వరరావు, ధమాకా వంటి ఫ్లాపుల్లో ఉన్న రవితేజ ఈ సారి గద్దలకొండ గణేష్ సినిమా తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న దర్శకుడు హరీష్ శంకర్ కాంబినేషన్ లో ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. గతంలో షాక్, మిరపకాయ్ సినిమాలు వీరిద్దరి కాంబినేషన్ లో హిట్టు సినిమాలుగా ప్రేక్షకుల ఆదరణ పొందాయి. దీనితో ఈ మూవీపై హైప్ కూడా బాగానే పెరిగింది.


రైడ్ రీమేక్

హిందీలో వచ్చిన హిట్ మూవీ రైడ్ కాన్సెప్ట్ తీసుకుని హరీష్ శంకర్ తనదైన మార్పులు చేర్పులతో ఈ మూవీని తీశారు. పవన్ కళ్యాణ్ తో తీసిన గబ్బర్ సింగ్ కూడా రీమేక్ అయినా తెలుగు నేటివిటీకి తగ్గ ట్లుగా మార్పులు చేసి కమర్షియల్ బ్లాక్ బస్టర్ గా తీర్చిదిద్దిన హరీష్ శంకర్ ఆ స్థాయిలో ఈ బచ్చన్ పాత్రను మెప్పించలేక చతికిల పడ్డాడు. ప్రధాన విలన్ పాత్ర పోషించిన జగపతి బాబును గ్రాడ్యుయల్ గా కమెడియన్గా మార్చేశారు. సినామాకు మెయిన్ డ్రాప్ బ్యాక్ గా మారింది జగపతి బాబు క్యారెక్టర్.


5 ఏళ్లు వెనక్కి..

ఉండటానికి స్క్రీన్ నిండుగా సీనియర్ నటులు ఉన్నారు. కథ, కథనాలు ఆసక్తి కరంగా లేకపోవడంతో వాళ్ల పాత్రలు కూడా తేలిపోయాయి. హరీష్ శంకర్ ఓ పాత చింతకాయ పచ్చడి లాంటి సినిమాతో మూస చిత్రాన్ని ప్రేక్షకులకు అందించే ప్రయత్నం చేశాడు. ఐదేళ్లు గ్యాప్ తీసుకుని చేసిన చిత్రం ఎంత పవర్ ఫుల్ గా ఉంటుందో అని ఆశించిన అభిమానులకు నిజంగానే ఆయన 5 సంవత్సరాలు వెనెక్కి వెళ్లిన స్టోరీలోనే ఉండిపోయాడనిపిస్తుంది.

నవ్వించాలని నవ్వులపాలు

చాలా చోట్ల హరీష్ శంకర్ ప్రేక్షకులను నవ్వించాలని చేసే ప్రయత్నం అంతా నవ్వులపాలయిందని పిస్తుంది. హీరోయిన్ భాగ్యశ్రీ బోరా లిప్ సింకింగ్ కూడా సరిగ్గా కుదరలేదు. మిక్కీ జే మేయర్ పాటలు వినసొంపుగా ఉన్నాయి. కానీ తెరపై మాత్రం అంతంతమాత్రంగా ఉన్నాయి. ఇవాళ ప్రేక్షకుడు బాగా తెలివిమీరి పోయాడు. కేవలం పాటలు, ఫైట్లు ఉంటే సరిపోదు. థ్రిల్ కలిగించే అంశాలుండాలి..తర్వాత వచ్చే సన్నివేశం తెలిసిపోయేలా ఉండకూడదు. కేవలం బీ,సీ సెంటర్ ఆడియన్స్ ను దృష్టిలో పెట్టుకుని సినిమా తీసినట్లు ఉంది. హిందీ మూవీ అజయ్ దేవగన్ హీరోగా నటించిన రైడ్ చూసి మిస్టర్ బచ్చన్ చూడకపోవడమే మంచిది.

గబ్బర్ సింగ్ మెరుపులేవి?

గబ్బర్ సింగ్ మూవీ తెలుగు వెర్షన్ లో కామెడీ సీన్స్ చూసి సల్మాన్ ఖాన్ హరీష్ ను మెచ్చుకున్నాడు. తన హిందీ వెర్షన్ లో కూడా ఈ తరహా కామెడీని పెట్టివుంటే బాగుండేది అనుకున్నాడట. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణ విలువలు బాగున్నాయి. డీజే టెల్లు సిద్దూ జొన్నలగడ్డ స్పెషల్ ఎంట్రీ ఎందుకు వస్తుందో తెలియదు. ఏది ఏమైనా ఈ‘బచ్చెన్’ మెప్పించలేక ప్రేక్షకుల గుండెల్లో గుచ్చెన్ అంటున్నారంతా..

Related News

Comedian Sapthagiri: ఇండస్ట్రీకి దూరమయ్యారా లేక దూరం పెట్టారా..?

Johnny Master: ఢీ 11 లో ఎలిమినేట్.. జానీ మాస్టర్ ఇంత కథ నడిపారా.?

Pushpa 2: వార్నర్ మామ ఇండస్ట్రీ ఎంట్రీ,రీల్స్ నుంచి రియల్ సినిమాలోకి

Devara: ఒకవైపు రాజమౌళి హీరో, మరో వైపు త్రివిక్రమ్ చీఫ్ గెస్ట్ ఇక శివ ను ఆ శివయ్యే కాపాడాలి

Prabhas – Hanu : గప్ చుప్ గా షూటింగ్… ఇంత సీక్రెట్ గా ఎందుకో..?

SSMB29 : మహేష్- రాజమౌళి మూవీ బిగ్ అప్డేట్.. ఫ్యాన్స్ రెడీ అవండమ్మా..!

Devara Pre Release Event : దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ ఫిక్స్.. చీఫ్ గెస్టులు గా స్టార్ డైరెక్టర్స్?

Big Stories

×