Astrology Today: జ్యోతిష్యశాస్త్ర ప్రకారం..మొత్తం 12 రాశులు. ఈ రాశుల్లో ఏ రాశి వారికి శుభప్రదంగా ఉంటుంది? ఏ రాశి వారికి అనారోగ్య సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది? వంటి విషయాలపై జ్యోతిష్యులు ఏం చెప్పారో తెలుసుకుందాం.
మేషం:
ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వృత్తి, వ్యాపార రంగాల్లో ఉత్సాహంగా పనులు పూర్తి చేస్తారు. ఉద్యోగంలో సవాళ్లు, ఇబ్బందులు ఎదుర్కొంటారు. కీలక పనుల్లో అప్రమత్తంగా ఉండాలి. ఇతరులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. తప్పుదోవ పట్టించే అవకాశం ఉంది. పెద్దల సలహాలు తీసుకోవాలి. అనారోగ్య సమస్యలు వేధిస్తాయి. సూర్య ఆరాధన శ్రేయస్కరం.
వృషభం:
వృషభం రాశి వారికి ప్రతికూల ఫలితాలు ఉంటాయి. అన్ని రంగాల వారు ఒత్తిడి, కోపానికి గురయ్యే అవకాశం ఉంది. ఉద్యోగాల్లో ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు పొందుతారు. వ్యాపారాల్లో ఆర్థిక నష్టం జరగవచ్చు. ఆరోగ్యం బాగానే ఉంటుంది. కుటుంబ సభ్యులతో ఆనందంగా ఉంటారు. ఇతరుల సహకారంతో పనులు సకాలంలో పూర్తి చేస్తారు. దుర్గా ఆరాధన శుభప్రదం.
మిథునం:
మిథునం రాశి వారికి శుభప్రదంగా ఉంటుంది. వృత్తి, వ్యాపార రంగాల్లో సకాలంలో పనులు పూర్తవుతాయి. లక్ష్మీకటాక్షం, పదవీయోగం ఉన్నాయి. ఉద్యోగులకు ప్రమోషన్స్, ఆదాయం వృద్ది చెందుతుంది. ఇతరుల సహకారంతో పనులు విజయవంతంగా పూర్తిచేస్తారు. వ్యాపారులకు ధనప్రవాహం ఉంటుంది. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. సానుకూలంగా వ్యవహరించి విజయం సాధించాలి. ఇష్ట దేవతారాధన శుభకరం.
కర్కాటకం:
ఈ రాశి వారికి సామాన్యంగా ఉంటుంది. ప్రారంభించిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. బంధుమిత్రులతో ఆచితూచి వ్యవహరించాలి. ఉద్యోగంలో తోటి వారి సహకారం లభిస్తుంది. ఆదాయం కంటే ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. ఒత్తిడి, కోపానికి దూరంగా ఉండాలి. ఆరోగ్యం క్షీణించవచ్చు. ఆదిత్య హృదయం పారాయణ శక్తినిస్తుంది.
సింహం:
సింహ రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వృత్తి, వ్యాపార రంగాల్లో చేపట్టిన కీలక పనులు విజయవంతంగా పూర్తవుతాయి. ఇతర వ్యవహారాల్లో తలదూర్చకండి. కొన్ని సంఘటనలు ఇబ్బందులకు గురిచేస్తాయి. అన్ని రంగాల వారికి శ్రమకు తగిన ఫలితం ఉంటుంది. ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకోవాలి. కోపాన్ని తగ్గించుకోవాలి. శ్రీవేంకటేశ్వర స్వామి సందర్శనం శుభప్రదం.
కన్య:
ఈ రాశి వారికి సామాన్యంగా ఉంటుంది. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు ఉంటాయి. తోటివారి సహకారంతో ప్రారంభించిన పనులు పూర్తవుతాయి. శ్రమ పెరుగుతుంది. కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ఆదాయాన్ని మించి ఖర్చులు ఉంటాయి. ఆర్థిక పరిస్థితి నిరాశాజనకంగా ఉంటుంది. శివారాధన శ్రేయస్కరం.
తుల:
ఈ రాశి వారికి సామాన్యంగా ఉంటుంది. ప్రారంభించిన పనుల్లో ఇబ్బందులు ఎదురైనా విజయం సాధిస్తారు. వృత్తి, వ్యాపారాల్లో ఒత్తిడి పెరగవచ్చు. అనవసర విషయాలపై ఆలోచన చేయవద్దు. ఉద్యోగులు తోటివారితో ఆచితూచి వ్యవహరించాలి. వ్యాపారులకు సకాలంలో డబ్బులు అందుతాయి. ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. బంధుమిత్రులతో జాగ్రత్తగా ఉండాలి. శ్రీలక్ష్మీదేవి ధ్యానం శుభకరం.
వృశ్చికం:
ఈ రాశి వారికి సాధారణంగా ఉంటుంది. వృత్తి, వ్యాపారంలో శ్రమకు తగిన ఫలితం ఉంటుంది. కీలక పనుల్లో చిత్తశుద్ధితో చేస్తే విజయం సాధిస్తారు. శుభకార్యక్రమాల్లో పాల్గొంటారు. అనవసర ఖర్చులకు దూరంగా ఉండాలి. ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకోవాలి. ఇతరులతో వాదనలు పెట్టుకోకపోవడం మంచిది. అధికారుల నుంచి సహాయ, సహకారాలు ఉంటాయి. శ్రీ ఆంజనేయ దర్శనం శ్రేయస్కరం.
ధనుస్సు:
ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. అన్ని రంగాల వారికి శ్రమకు తగిన ఫలితం ఉంటుంది. వృత్తి, వ్యాపార రంగాల వారికి ఆర్థికంగా లాభాలు ఉంటాయి. ప్రయాణాలు చేయకపోవడం మంచిది. ఉద్యోగులకు ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు ఉంటాయి. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. గతంలో ఉన్న ఇబ్బందులు తొలగిపోతాయి. ఇష్టదైవారాధన శుభప్రదం.
మకరం:
మకర రాశి వారికి శుభప్రదంగా ఉంటుంది. వృత్తి, వ్యాపారాల్లో సొంత నిర్ణయాలు తీసుకోకుండా పెద్దల సలహాలు పాటించాలి. ఒత్తిడి, శ్రమ పెరగకుండా చూసుకోవాలి. వ్యాపారులకు పట్టిందల్లా బంగారం అవుతుంది. ఉద్యోగంలో హోదా పెరుగుతుంది. ఖర్చులను అదుపులో ఉంచుకోవడం మంచిది. ప్రయాణాలు ఉంటాయి. శ్రీసుబ్రహ్మణ్యస్వామి సందర్శనం ఉత్తమం.
Also Read: ఒకే వారంలో 3 రాజయోగాలు.. ఈ రాశులపై కుబేరుడి అనుగ్రహం
కుంభం:
కుంభ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. వృత్తి, వ్యాపారంలో లాభాలు ఉంటాయి. ముఖ్యమైన పనులను సకాలంలో పూర్తి చేస్తారు. అన్ని రంగాల వారికి ప్రోత్సాహకర వాతావరణం ఉంటుంది. నిరుద్యోగులకు అవకాశాలు ఉంటాయి. ఉద్యోగులకు ప్రమోషన్స్, స్థాన చలనం ఉండవచ్చు. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పొందుతారు. ఇష్టదేవతారాధన మంచిది.
మీనం:
మీనం రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. చేపట్టిన ప్రయత్నాలు ఫలిస్తాయి. అన్ని రంగాల వారు మానసికంగా ధృఢంగా ఉంటారు. వ్యాపారంలో రావాల్సిన పెండింగ్ బకాయిలు చేతికి అందుతాయి. ఆర్థిక లాభాలు ఉంటాయి. ఆరోగ్యం సహకరిస్తుంది. బంధువులతో కలిసిమెలిసి ఉంటారు. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. శ్రీలక్ష్మీదేవి ధ్యానం శుభప్రదం.