EPAPER

Fraud Family: ఫారిన్‌లో ఉద్యోగం చేస్తున్న యువకుడు.. పెళ్లికి ముందు యువతిని ఎలా మోసం చేశాడంటే..

Fraud Family: ఫారిన్‌లో ఉద్యోగం చేస్తున్న యువకుడు.. పెళ్లికి ముందు యువతిని ఎలా మోసం చేశాడంటే..

Fraud Family| భారతదేశంలో పెళ్లి అంటే ఒక పవిత్ర బంధం. అమ్మాయి సంతోషంగా ఉండాలని తల్లిదండ్రులు ఒక మంచి అబ్బాయి కోసం వెతకడానికి చాలా కష్టాలు పడుతుంటారు. కానీ కొన్ని సార్లు పెళ్లి సంబంధం కుదిరినా.. ఆ తరువాత అనుకోని కారణాల వల్ల పెళ్లి ఆగిపోతుంది. గొడవలు జరిగి విషయం కోర్టు వరకు వెళ్తుంది. ఇలాంటిదే ఒక కేసులో ఫారిన్ ఉద్యోగం చేస్తున్న ఓ యువకుడిని ఇష్టపడిన యువతి.. అతడిని వివాహం చేసుకోవాలను కుంది. ఇరువైపుల పెద్దలు అంగీకరించడంతో పెళ్లి సంబంధం కుదిరింది. కానీ ఆ తరువాత ఆ పెళ్లి కొడుకు అమ్మాయిని మోసం చేసి తప్పించుకోవాలనుకున్నాడు. అయితే ఆ యువతి అతడిని కోర్టుకు లాగింది. ఈ ఘటన మహారాష్ట్ర రాజధాని ముంబై నగరంలో జరిగింది.


వివరాల్లోకి వెళ్తే.. 2022లో లతిక (25) అనే యువతికి ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. ఈ క్రమంలో ఒకరోజు లతిక తన తండ్రి స్నేహితుడి ఇంటికి వెళ్లినప్పుడు దిలీప్(36) అనే యువకుడిని కలిసింది. దిలీప్ బ్రెజిల్ దేశంలో ఒక ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. ఆ తరువాత మరోసారి దిలీప్ తో ఒక పార్టీలో కలిసింది. ఇక అప్పటి నుంచి ఇద్దరూ తరుచూ కలుసుకునేవారు. తండ్రి స్నేహితుడి దూరబంధువు కావడంతో అతని గురించి సమాచారం తెలుసుకుంది. ఆ తరువాత దిలీప్ అంటే తనకు ఇష్టమని తల్లిదండ్రులకు లతిక తెలిపింది.

Also Read: ఏడాదిలో 9 మహిళలను చంపిన సైకో.. హత్యకు చిహ్నంగా లిప్ స్టిక్ తీసుకెళ్లే అలవాటు!


దిలీప్ బాగానే సంపాదిస్తున్నాడు. అతని కుటుంబం గురించి కూడా స్నేహితుడి ద్వారా తెలుసుకొని.. లతిక తండ్రి పెళ్లికి ఒప్పుకున్నారు. ఆ తరువాత దిలీప్ అక్క, తల్లిదండ్రులు ఒకరోజు లతిక ఇంటికి వచ్చి పెళ్లి సంబంధం మాట్లాడారు. అలా లతిక, దిలీప్ కు నిశ్చితార్థం జరిగింది. కానీ దిలీప్ ఉద్యోగం రీత్యా బ్రెజిల్ వెంటనే వెళ్లాలని పెళ్లి వాయిదా వేసి వెళ్లిపోయాడు. 2023లో దిలీప్ తిరిగివచ్చాడు. కానీ పెద్దగా లతికతో కలిసేవాడు కాదు. దీంతో లతిక తల్లిదండ్రులు దిలీప్ తల్లిదండ్రులతో పెళ్లి ఎప్పుడని అడిగారు. కానీ వారి నుంచి స్పష్టమైన సమాధానం రావడం లేదు. ఒకరోజు లతిక.. దిలీప్ ఇంటికి ఫోన్ చేయగా.. అతని అక్క లతికతో అసభ్యంగా మాట్లాడింది. దిలీప్, అతని కుటుంబం తనతో ఎందుకు అలా ప్రవర్తిస్తున్నారో లతికకు అర్థం కాలేదు. దీంతో లతిక నేరుగా దిలీప్ ఇంటికి వెళ్లి కలిసింది. ఆ సమయంలో దిలీప్ ఒంటరిగా ఇంట్లోనే ఉన్నాడు.

లతిక.. దిలీప్ ని సమస్య ఏంటని అడిగింది. తనను ప్రేమించడం లేదా? అని నిలదీసింది. దానికి దిలీప్ తన జీవితంలో కొన్ని సమస్యలు వచ్చాయని చెప్పాడు. బ్రెజిల్ లో ఒక కంపెనీ ప్రారంభించనని.. దాని వల్ల చాలా నష్టం జరిగిందని.. దీనంతటికీ లతిక దురదృష్టవంతురాలని దిలీప్ కుటుంబం నమ్ముతోందని అందుకే పెళ్లి రద్దు చేసుకోవాలని తనపై ఒత్తిడి చేస్తున్నారని వివరించాడు. కానీ తను మాత్రం ఇంకా లతికనే ప్రేమిస్తున్నట్లు చెప్పాడు. ఇదంతా విని లతిక మనసు కొంచెం కుదుటపడింది. ఆ తరువాత లతికతో దిలీప్ శృంగారం చేశాడు.

Also Read:  వెబ్ సిరీస్ చూసి బాలుడి మర్డర్.. ప్రేమ కోసం హంతకురాలిగా మారిన ఎంబిబియస్ విద్యార్థిని

దిలీప్ కుటుంబమంతా రెండు రోజుల కోసం బంధువుల ఇంట్లో ఫంక్షన్ కోసం భోపాల్ వెళ్లడంతో.. దిలీప్, లతిక కాస్త బయటతిరగడానికి రత్నాగిరికి పిక్నిక్ వెళ్లారు. అక్కడ ఒకరోజు షికారుకు వెళ్లి రిసార్ట్ లో మళ్లీ శృంగారం చేశారు. రత్నాగిరి నుంచి తిరిగి వచ్చాక దిలీప్.. పూర్తిగా మారిపోయాడు. అతను లతికతో మాట్లాడడం మానేశాడు. ఆమె నెంబర్ బ్లాక్ చేశాడు. దీంతో లతిక మళ్లీ కంగారు పడింది. అతని తల్లిదండ్రులు తామిద్దరి పెళ్లికి అడ్డుపడుతున్నారనుకుంది. కానీ అదే రోజు లతిక తండ్రి స్నేహితుడు వారి ఇంటికి వచ్చి అసలు విషయం చెప్పాడు. ఆయన చెప్పిన కారణం విని లతిక షాక్ కు గురైంది.

నిజానికి దిలీప్ కు మరో ధనిక కుటుంబానికి చెందిన అమ్మాయితో పెళ్లి కుదిరింది. దీంతో లతికను తప్పించుకోవడానికి దిలీప్ ఆమెతో అబద్ధాలు చెప్పాడు. ఇదంతా విని లతిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి తనతో మోసపూరితంగా శృంగారం చేశాడని, అత్యాచారం కేసు నమోదు చేసింది. పోలీసులు దిలీప్, అతని కుటుంబ సభ్యులపై చీటింగ్ కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.

Also Read: ‘రైల్వే ఉద్యోగం కావాలా? రూ.20 లక్షలు ఖర్చు అవుతుంది!’.. యువతిని మోసం చేసిన ‘అమిత్ షా సెక్రటరీ’

Related News

Deadbody In Suitcase: సూట్‌కేసులో యువతి డెడ్ బాడీ, ముక్కలుగా నరికి.. దారుణ హత్య

Chennai’s IT Corridor: ఐటీ కారిడార్, సూట్ కేసులో మహిళ మృతదేహం.. ఏం జరిగింది?

Cambodia Cyber Slaves Agent: విదేశాల్లో బానిసలుగా భారతీయులు.. ఉద్యోగాల పేరుతో మోసం.. యువతి అరెస్ట్

Woman Cop Kidnap: మహిళా పోలీస్ కిడ్నాప్.. 112 డయల్ చేసి ఎలా తప్పించుకుందంటే?.

Fatal Extramarital Affair: భర్త పనికి వెళ్లగానే ఇంట్లో ప్రియుడితో రొమాన్స్ షురూ.. ఆ తరువాత ఎంత హింస జరిగిందంటే..

Head Master Harassment: హెచ్‌ఎం కామాంధుడు.. సబ్బు, షాంపూలతో ఎర, విద్యార్థిణులపై వేధింపులు..

Lover Knife Attack: పెళ్లికి నిరాకరణ.. ప్రియురాలిపై ప్రియుడు కత్తితో.. ఆపై ఇద్దరూ

Big Stories

×