EPAPER

Telangana: కొలువుల గని.. కాగ్నిజెంట్

Telangana: కొలువుల గని.. కాగ్నిజెంట్

Cognizant: తెలంగాణకు పెట్టుబడులను ఆకర్షించటంతో బాటు తెలంగాణను ఒక బ్రాండ్‌గా ప్రమోట్ చేయాలనే లక్ష్యంతో తాము చేపట్టిన విదేశీ పర్యటన విజయవంతంగా సాగిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. బుధవారం సాయంత్రం కోకాపేటలో.. కాగ్నిజెంట్ సంస్థ ఏర్పాటు చేసిన ఐదవ ప్రాంగణాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించారు. తమ ప్రభుత్వం రాబోయే రోజుల్లో నిర్మించనున్న ఫ్యూచర్ సిటీలోనూ కాగ్నిజెంట్ సంస్థ కార్యకలాపాలు చేపట్టాలని ఆకాంక్షించారు. ప్రభుత్వాల పని విధానంలో మార్పులు రావాల్సిన అవసరముందని, తెలంగాణ దేశంలోని ఇతర రాష్ట్రాలతో గాక.. ప్రపంచంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాలతో పోటీ పడాలని పిలుపునిచ్చారు.


రాజధాని అభివృద్ధిపై..
హైదరాబాద్ నగరం ఉన్నపళంగా ఎవరో ఒకరి వల్ల అభివృద్ధి చెందలేదని సుమారు 430 ఏళ్ల క్రితం నుంచి కులీ కుతుబ్ షాలు, నిజాం రాజులు, బ్రిటీషర్లు కలిసి హైదరాబాద్, సికింద్రాబాద్ నగరాలను అభివృద్ధి చేశారన్నారు. ఆ తర్వాత రాజీవ్ గాంధీ పీఎంగా ఉన్న సమయంలో సైబరాబాద్‌కు పునాది పడితే ఆ తర్వాత చంద్రబాబు నాయుడు, వైఎస్సార్ మూడో నగరంలో సైబరాబాద్‌ను మరింతగా డెవలప్ చేశారన్నారు. నేతల మధ్య సిద్ధాంత పరమైన వైరుధ్యాలు ఉన్నా హైదరాబాద్ అభివృద్ధిని కొనసాగించారని అందువల్లే హైదరాబాద్ కు పెట్టుబడులు తరలి వస్తున్నాయన్నారు.

కాగ్నిజెంట్‌పై..
కోకాపేటలో జరిగిన కాగ్నిజెంట్ కొత్త క్యాంపస్ ప్రారంభోత్సవం అనంతరం జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. తెలంగాణలో అత్యధికంగా ఉద్యోగాలిచ్చిన రెండవ ఐటీ సంస్థ కాగ్నిజెంట్ అన్నారు. తమ అమెరికా పర్యటనలో ఆగస్టు 5 న న్యూజెర్సీలో కాగ్నిజెంట్ సంస్థతో ప్రభుత్వం ఒప్పందం చేసుకుందని గుర్తుచేశారు. ఫ్యూచర్ సిటీలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని, రాబోయే రోజుల్లో కాగ్నిజెంట్ కూడా అక్కడ తన కార్యకలాపాలు ప్రారంభిస్తుందని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. కాగ్నిజెంట్‌ లక్ష ఉద్యోగుల సంస్థగా ఎదగాలని, అందుు తమ ప్రభుత్వం అండగా నిలుస్తుందన్నారు. గత రెండేళ్లలో కాగ్నిజెంట్‌ సంస్థ తెలంగాణలోని 34 కాలేజీల నుంచి 7,500 మందికి ఉద్యోగాలిచ్చిందని గుర్తుచేశారు. గత ఐదేళ్లలో ఈ సంస్థ తన కార్పొరేట్‌ సామాజిక బాధ్యతలో భాగంగా రూ.22.5 కోట్లతో వివిధ కార్యక్రమాలు చేపట్టటం సంతోషంగా ఉందన్నారు.


Also Read: Kota Srinivasarao: కోటాను ఓవర్ నైట్ స్టార్ ను చేసిన సినిమా ఏంటో తెలుసా..?

అభివృద్ధి ఫలాలు అందరికీ..
తెలంగాణను ఫ్యూచర్ స్టేట్‌గా తీర్చిదిద్దేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి ప్రకటించారు. మొత్తం రాష్ట్రాన్ని అర్బన్, సెమీ అర్బన్, రూరల్ భాగాలుగా విడదీసి, ఆయా ప్రాంతాల్లోని వనరులు, అవకాశాల ప్రాతిపదికన పరిశ్రమల ఏర్పాటు చేయటం జరుగుతుందన్నారు. హైదరాబాద్ ను ప్రపంచ ముఖచిత్రంలో నిలబెడతామని చెప్పారు. ప్రపంచ ప్రమాణాలకు తగిన రీతిలో ఫోర్త్ సిటీని నిర్మిస్తున్నామని, అందుకే పారిశ్రామిక వేత్తలు ఈ ప్రాంతంలో పెట్టుబడులు పెట్టాలని, పెట్టిన ప్రతి రూపాయికి భద్రత, అదనపు విలువ చేకూరతాయని, పెట్టబడులు పెట్టేవారికి తగిన ప్రోత్సాహాన్ని ప్రభుత్వం అందిస్తుందని హామీ ఇచ్చారు. విదేశీ పర్యటనలో రూ. 31వేల 500 కోట్ల పెట్టుబడులు సాధించామని సీఎం వివరించారు. ప్రభుత్వాలు మారినా పని విధానం మారలేదనీ, తెలంగాణ దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోటీ పడటం కాదనీ, అభివృద్ధి చెందుతున్న దేశాలతో పోటీ పడాల్సిన అవసరముందని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. రానున్న రోజుల్లో మరిన్ని ఒప్పందాలు కుదరనున్నాయి. ఒప్పందాలు ఫాలో చేయడానికి ఇన్వెస్టర్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రకటించారు.

ఏడున్నర నెలల్లోనే రెడీ..
ఉమ్మడి ఏపీలో 2002లో కేవలం 180 మంది ఉద్యోగులతో హైదరాబాద్‌లో తొలి కార్యాలయాన్ని ప్రారంభించింది. కాగా, కాగ్నిజెంట్‌ సంస్థకు ఇప్పుటికే నాలుగు క్యాంపస్‌లుండగా, వాటిలో మొత్తం 18,000 మంది ఉద్యోగులు పనిచేస్తు్న్నారు. తాజాగా, బుధవారం కోకాపేటలోని బహుళ అంతస్తుల జీఏఆర్‌ టవర్‌లో 10 లక్షల చదరపు అడుగుల్లో ఏర్పాటు చేసిన అయిదవ క్యాంపస్‌ను సీఎం ప్రారంభించారు. ఈ కొత్త క్యాంపస్‌ ద్వారా 15 వేల కొత్త ఉద్యోగావకాశాలు లభిస్తాయని కంపెనీ ఇప్పటికే ప్రకటించింది. 2024 జనవరిలో సీఎం రేవంత్ దావోస్‌ పర్యటన సందర్భంగా హైదరాబాద్‌లో తన ఐదవ క్యాంపస్ ఏర్పాటుకు ఆసక్తి కనబరచగా, కేవలం ఏడున్నర నెలల కాలంలోనే అది అది కార్యరూపం దాల్చటం విశేషం. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌, మెషిన్‌ లెర్నింగ్‌, డిజిటల్‌ ఇంజనీరింగ్‌, క్లౌడ్‌ సొల్యూషన్స్‌ సహా పలు అధునాతన సాంకేతికతలపై కొత్త క్యాంపస్‌లో దృష్టిసారించనున్నారు.

Related News

New Ration Card: ప్రజలకు శుభవార్త.. అక్టోబర్ 2 నుంచి రేషన్ కార్డులకు అర్జీలు.. అర్హతలు ఇవే!

Shankar Nayak: శంకర్ నాయక్.. వంకర బుద్ధి! దళితుల భూములతో ఆటలు

Chandrababu Naidu: సీఎం రేవంత్ రెడ్డి మీటింగ్‌లో నారా బ్రాహ్మణి.. స్కిల్ వర్సిటీ బాధ్యతలు?

Bandi Sanjay: ఆ దేవుడు క్షమించడు: తిరుపతి లడ్డూ వివాదంపై స్పందించిన బండి సంజయ్

Skill University: స్కిల్ వర్సిటీకి రూ.100 కోట్లు కేటాయిస్తాం.. ఈ ఏడాది నుంచే కోర్సులు ప్రారంభం: సీఎం రేవంత్ రెడ్డి

Mahesh Kumar: రాహుల్ గాంధీ వదిలిన బాణాన్ని నేను.. తగ్గే ప్రసక్తే లేదు: మహేశ్ కుమార్ గౌడ్

Rythu Bandhu: వ్యవసాయం చేసే వారికే రైతు బంధు: మంత్రి తుమ్మల

Big Stories

×