Iron Deficiency Symptoms: మన శరీరంలో రక్తం ముఖ్య పాత్ర పోషిస్తుంది. బ్లడ్‌లో ఏ చిన్న సమస్య వచ్చినా కూడా అది పెద్ద సమస్యగా మారే ప్రమాదం ఉంటుంది. శరీరంలో తగినంత రక్తం లేకపోతే దానిని ఎనీమియా అని అంటారు. శరీరంలో తగిన మోతాదులో ఐరన్ లేకపోవడంతో పాటు విటమిన్ లోపం కూడా రక్తహీనతకు ప్రధాన కారణమని నిపుణులు చెబుతుంటారు. తీవ్రమైన అనారోగ్య సమస్యలు వచ్చినప్పుడు బ్లడ్ టెస్ట్ చేయడం వల్ల ఈ సమస్య తెలుస్తుంది. అలా కాకుండా ముందుగానే మన శరీరంలో కొన్ని లక్షణాల వల్ల ఐరన్ లోపంను గుర్తించవచ్చు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
లివర్, కిడ్నీ, గుండె సంబంధిత వ్యాధులతో బాధపడే వారు, ఎక్కువ రోజుల నుంచి మందులు వాడే వారిలో ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది. అంతే కాకుండా క్యాన్సర్ చికిత్సలో భాగం అయిన కీమోథెరపీ ట్రీట్ మెంట్ చేసుకున్న వారిలో రక్తహీనత వచ్చే అవకాశం ఉంటుంది. సాధారణంగా ఏర్పడే ఎనీమియా ఐరన్ లోపం వల్ల ఏర్పడుతుంది. ఆహారం ద్వారా ఐరన్ లభించనప్పుడు లేదా శరీరంలోని కణాలు ఆహారంలోని ఐరన్‌ను శోషించనప్పుడు ఈ రకం ఎనీమియా వస్తుంది.
తీవ్రమైన అలసట: రక్తహీనతతో బాధపడేవారు బాగా విశ్రాంతి తీసుకున్నప్పటికీ తీవ్రమైన నీరసంతో బాధపడుతూ ఉంటారు. రోజు వారి పనులకు కూడా అలసిపోతారు. అలాగే వీరు చేయల్సిన పని పట్ల ద్యాసను పెట్టలేకపోతారు.
తలనొప్పి: రక్తహీనత ఉన్న వారిలో తీవ్రమైన తలనొప్పి ఉంటుంది. అంతే కాకుండా తరుచుగా మైకం వచ్చినట్లు కూడా అనిపిస్తుంది.