EPAPER

Hanuman Slokas: మీపై ఉన్న నరదృష్టి తొలగిపోవాలా ? అయితే ఇలా చేయండి

Hanuman Slokas: మీపై ఉన్న నరదృష్టి తొలగిపోవాలా ? అయితే ఇలా చేయండి

Hanuman Slokas: హనుమంతుడు బలం, భక్తి, విధేయతకు ప్రతిరూపంగా చెబుతారు. సప్త చిరంజీవులలో ఒకటిగా ప్రాచుర్యం పొందాడు హనుమంతుడు. హనుమంతుడు ఇప్పటికీ భూమి మీద ఎక్కడో ఒక చోట రామనామం జపిస్తూ ఉన్నాడని భక్తుల విశ్వాసం. తన నిజమైన భక్తులను రక్షించేందుకు హనుమంతుడు ఎప్పుడూ ముందుంటాడని నమ్ముతారు.


శ్రీరాముడి పట్ల హనుమంతుడి అచంచలమైన ప్రేమ, భక్తి వల్లే హనుమంతుడు భగవంతుడు అయ్యాడు. భయాలు, దుష్టశక్తుల పీడల నుంచి బయటపడేందుకు హనుమంతుడిని స్మరించుకోవడం వల్ల ధైర్యం వస్తుందని భక్తులు నమ్ముతుంటారు. తన భక్తుల మీద ఎటువంటి చెడు దృష్టి పడకుండా హనుమంతుడు రక్షిస్తాడని చెబుతుంటారు. హనుమంతుడికి సంబంధించి కొన్ని స్త్రోత్రాలు పఠించడం వల్ల జీవితంలో భయం అనేది ఉండదు. హనుమాన్ స్త్రోత్రాల్లో పంచముఖి హనుమాన్ కవచం చాలా ఉపయోగపడుతుంది.

ఇది భక్తులకు రక్షణ కవచంగా కూడా పనిచేసే శక్తివంతమైన సూత్రంగా చెబుతారు. హనుమాన్ కావచాన్ని పాటించడం వల్ల హనుమంతుడి ఆశీస్సులతో పాటు రక్షణ కూడా లభిస్తుంది. పంచముఖి హనుమాన్ గురించి వివరించే  స్తోత్రం చాలా పెద్దది. అయినప్పటికీ ఇందులో నాలుగు పంక్తులు ఎల్లప్పుడూ పాటించడం వల్ల ఎటువంటి చెడు దృష్టి మీపై ఉండదు. పంచముఖి హనుమాన్ శక్తి సామర్థ్యాలు ఈ శ్లోకం వివరిస్తుంది. హనుమంతుడు తనను కొలిచిన వారికి ఎలా తోడుగా ఉంటాడో వెల్లడిస్తుంది.


ఖడ్గం త్రిశూలం ఖట్వాంగం పాశమంకుశపర్వతం !
ముష్టి కౌమోదకీం వృక్షం ధారయన్తం కమణ్ణలుమ్ ! !
భిందిపాలం జ్ఞానముద్రాం దశభిర్మునిపుంగవం !
ఏతాన్యాయుధజాలాని ధారయన్తం భజామ్యహమ్ ! !

ఖడ్గం త్రిశూలం ఖట్వాంగం పాశమంకుశ పర్వతం !

ఇది చాలా శక్తివంతమైన శ్లోకం. ఇది హనుమంతుడు వద్ద ఉన్న అనేక ఆయుధాల గురించి వివరిస్తుంది .ప్రతి ఆయుధానికి ప్రతీకాత్మక అర్థం ఉంది. ఖడ్గం లేదా కత్తి అజ్ఞానం భ్రమలను తొలగించే శక్తికి చిహ్నంగా చెబుతుంటారు. త్రిశూలం వినాశనానికి దారి తీసే చెడును తొలగించడానికి సూచిస్తుంది. అలాగే ఖట్వంగా అనేది భౌతిక మరణ భయాన్ని తొలగించేందుకు ఉపయోగపడుతుంది. శక్తి, సామర్థ్యం, వివేకం మనసును నియంత్రించి సరైన దిశలో నడిపేందుకు అవసరమైన పాశ, అంకుశ, పర్వత కూడా ఉన్నాయి.
….

Also Read: వరలక్ష్మీ వ్రతం ఎందుకు ఆచరించాలి ? వ్రత ఫలితాలు..

ముష్టిం కౌమోదికీం వృక్షం ధరయాన్తం కమణ్ణలుమ్ ! !

ఈ పంక్తి హనుమాన్ చేతిలో ఉన్నఆయుధాలను గురించి వివరిస్తుంది. ముష్టి అంటే పిడికిలి. బిగించిన పిడికిలి రక్షణ, బలంకు చిహ్నంగా చెబుతారు. కౌమోదకి అంటే దుష్ట శక్తులపైన తన అధికారాన్ని చూపించడం. ఇంక వృక్షం తన భక్తులను అన్ని రకాల చెడు నుంచి ఎలా ఆశ్రయం ఇవ్వగలదో వివరిస్తుంది. కమండలం, నీటి కుండ స్వచ్ఛత, ఆధ్యాత్మిక జ్ఞానానికి చిహ్నంగా భావిస్తారు.

Related News

Horoscope 20 September 2024: ఈ రాశి వారికి పట్టిందల్లా బంగారమే! శ్రీలక్ష్మి ధ్యానం శుభప్రదం!

Lucky Rashi from Durga Sasthi 2024: దుర్గా షష్ఠి నుండి ఈ రాశులకు వరుసగా 119 రోజులు లక్ష్మీ అనుగ్రహం

Mahalaya Surya Grahan 2024: మహాలయలో సూర్యగ్రహణం, ఈ 3 రాశుల వారి జీవితంలో అన్నీ అద్భుతాలే

Surya Grahan 2024: త్వరలో సూర్య గ్రహణం.. ఈ రోజు ఈ పొరపాట్లు అస్సలు చేయకండి

Vriddhi Yog Horoscope: ఈ రాశుల వారిపై ప్రత్యేక యోగం వల్ల కోటీశ్వరులు కాబోతున్నారు

Guru Vakri 2024 : మరో 20 రోజుల్లో బృహస్పతి తిరోగమనం కారణంగా లక్ష్మీదేవి అనుగ్రహం పొందబోతున్నారు

Budh Shani Yuti Horoscope: బుధ-శని సంయోగంతో ఈ 3 రాశుల వారు సంపదను పొందబోతున్నారు

Big Stories

×