EPAPER

Telangana: పంద్రాగస్ట్‌కి తెలంగాణ హెడ్‌ కానిస్టేబుల్‌కి గ్యాలంటరీ అవార్డు..

Telangana: పంద్రాగస్ట్‌కి తెలంగాణ హెడ్‌ కానిస్టేబుల్‌కి గ్యాలంటరీ అవార్డు..

Telangana Head Constable Gallantry Award for August 15th : స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని తెలంగాణ రాష్ట్రానికి చెందిన పోలీస్ ఫైర్ సర్వీసెస్ హోంగార్డ్స్ సివిల్ డిఫెన్స్‌ అధికారులకు భారత కేంద్ర హోంశాఖ బుధవారం ఆయా పోలీస్ శాఖలకు సంబంధించి పతకాలను అనౌన్స్ చేసింది. భారత్‌ వ్యాప్తంగా 1037 మంది గ్యాలంటరీ సర్విస్ మెడల్స్‌ని అందించనున్నారు. ఈ మేరకు ప్రకటించిన అవార్డు గ్రహీతల జాబితాలో తెలంగాణ రాష్ట్రానికి చెందిన హెడ్ కానిస్టేబుల్ యాదయ్య చోటు దక్కింది. దేశంలోనే అత్యున్నత రాష్ట్రపతి గ్యాలంటరీ పోలీస్ పతకాన్ని తెలంగాణ నుండి యాదయ్య ఒక్కడికే దక్కడం స్పెషల్.


తెలంగాణ పోలీస్ శాఖలో వర్క్‌ చేస్తున్న హెడ్ కానిస్టేబుల్ యాదయ్య 2002 ఏడాదిలో జరిగిన ఓ చోరీ కేసులో తన ప్రాణాలను పణంగా పెట్టి ఎంతో ధైర్యంతో చాకచక్యంగా వ్యవహరించాడు. అంతేకాదు ఇషాన్ నిరంజన్, రాహుల్ చైన్ స్నాచింగ్‌తో పాటుగా అక్రమంగా ఆయుధాలను ఎక్స్‌పోర్ట్ చేస్తుండేవారు. వీరిని హెడ్ కానిస్టేబుల్ యాదయ్య వెంబడించి సాహసించి వారిని పట్టుకున్నాడు. అదే ఏడాది జూలై 25 రోజున చోరికి పాల్పడుతుండగా యాదయ్య నిందితులను అడ్డుకున్నాడు. దుండగులు యాదయ్యపై కత్తితో దాడికి పాల్పడి తీవ్రంగా గాయపరిచారు.

Also Read: కనువిందు చేయనున్న 40 ఫీట్ల మట్టి గణపతి, ఫస్ట్‌ టైం ఓరుగల్లులో..!


తనకు తీవ్ర రక్తస్రావం అవుతున్నప్పటికి పట్టించుకోకుండా నిందితులను పట్టుకున్నాడు. దీంతో నిందితులు తీవ్రంగా గాయపరచడంతో యాదయ్య దవాఖానలో జాయిన్ అయ్యాడు. అందులోనే 18 రోజుల పాటు చికిత్స తీసుకున్నాడు. ఆయన ధైర్య సాహసాన్ని మెచ్చి కేంద్రం తనని కొనియాడింది. స్వాతంత్ర్య దినోత్సవం ఆగష్టు 15న గ్యాలంటరీ అవార్డును అందించనున్నట్టు హోంశాఖ అనౌన్స్ చేసింది.

దేశవ్యాప్తంగా ఈ పతకాలను 1037 మందికి అందించనున్నారు. ఇందులో 214 మందికి మెడల్స్ ఫర్ గ్యాలెంటరీ,,95 మందికి రాష్ట్రపతికి విశిష్ట సేవా మెడల్స్,, 730 మందికి పోలీస్ విశిష్ట సేవా పతకాలను అందించనుంది కేంద్ర హోంశాఖ. ఇందులో తెలుగు రాష్ట్రాల నుండి 46 పతకాలు సాధించారు. తెలంగాణ నుండి 21, ఏపీ నుండి 25 మందికి ఈ పతకాలు దక్కనున్నాయి.

Related News

Shankar Nayak: శంకర్ నాయక్.. వంకర బుద్ధి! దళితుల భూములతో ఆటలు

Chandrababu Naidu: సీఎం రేవంత్ రెడ్డి మీటింగ్‌లో నారా బ్రాహ్మణి.. స్కిల్ వర్సిటీ బాధ్యతలు?

Bandi Sanjay: ఆ దేవుడు క్షమించడు: తిరుపతి లడ్డూ వివాదంపై స్పందించిన బండి సంజయ్

Skill University: స్కిల్ వర్సిటీకి రూ.100 కోట్లు కేటాయిస్తాం.. ఈ ఏడాది నుంచే కోర్సులు ప్రారంభం: సీఎం రేవంత్ రెడ్డి

Mahesh Kumar: రాహుల్ గాంధీ వదిలిన బాణాన్ని నేను.. తగ్గే ప్రసక్తే లేదు: మహేశ్ కుమార్ గౌడ్

Rythu Bandhu: వ్యవసాయం చేసే వారికే రైతు బంధు: మంత్రి తుమ్మల

Mystery Deaths: శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో ఇద్దరు మృతి

Big Stories

×