EPAPER

Gym Mistakes: జిమ్‌లో మీరు ఈ పొరపాట్లు చేస్తున్నారా ? అయితే జాగ్రత్త !

Gym Mistakes: జిమ్‌లో మీరు ఈ పొరపాట్లు చేస్తున్నారా ? అయితే  జాగ్రత్త !

Gym Mistakes: అధిక బరువు సమస్యతో ప్రస్తుతం చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. పెరిగిన బరువు తగ్గించుకోవడానికి పడరాని పాట్లు పడుతున్నారు. కొంతమంది బరువు తగ్గడం కోసం జిమ్‌లకు వెళ్తుంటారు. శరీర బరువు తగ్గడానికి , కండరాలను దృఢంగా మార్చడానికి వ్యాయామం ఎంతో ఉపయోగపడుతుంది. ఈ క్రమంలోనే చాలా మంది వాకింగ్, జాగింగ్ వంటివి కూడా చేస్తూ ఉంటారు .


ముఖ్యంగా యువత బాడీ ఫిట్ గా ఉండటం కోసం జిమ్‌లో గంటల తరబడి కసరత్తు చేస్తూ ఉంటారు. వారిలాగే మీకు కూడా జిమ్ అలవాటు ఉందా.. అయితే మీరు కొన్ని విషయాల గురించి ముందుగా తెలుసుకోవాల్సిందే. ఈ తప్పులను పదే పదే చేయడం వల్ల గుండెపై ఒత్తిడి పెరిగి ప్రాణాలకే ప్రమాదం జరుగుతుంది. ఇంతకీ జిమ్‌లో చేయకుూడని పొరపాట్లు ఏంటో ఇప్పుడు ఇప్పుడు తెలుసుకుందాం.

వార్మ్- అప్, కూల్- డౌన్:
వర్కౌట్ తొందరగా అయిపోవాలని వార్మ్- అప్ కూల్- డౌన్ స్కిప్ చేస్తూ ఉంటారు. ఇది చాలా ప్రమాదకరమని నిపుణులు చెబుతున్నారు. వర్కౌట్ ముందు వార్మ్ అప్, శరీర ఉష్ణోగ్రతను పెంచి మజిల్స్ ను వ్యాయామం కోసం సిద్ధం చేస్తుంది . వర్కౌట్ తర్వాత చేసే కూల్- డౌన్ హార్ట్ బీట్‌ను క్రమంగా తగ్గించి శరీరాన్ని రిలాక్స్ స్థితికి తీసుకువస్తుంది. ఇవి రెండు మీ గుండెపై ఒత్తిడి తగ్గించడంలో పాటు బాగా సహాయపడతాయి.


సామర్థ్యానికి మించిన వర్కౌట్స్:
జిమ్‌కు వెళ్లే చాలా మంది చేసే మిస్టేక్స్ ఏంటంటే.. త్వరగా కండరాలు పెరగాలని లేక తొందరగా బరువు తగ్గాలని కెపాసిటీకి మించి వర్కౌట్స్ చేస్తూ ఉంటారు. ఇది కూడా ఆరోగ్యానికి చాలా హాని చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. సామర్థ్యానికి మించి జిమ్‌లో అధికంగా బరువులు ఎత్తడం ట్రెడ్‌మిల్‌పై పరిగెత్తడం వంటివి చేయడం వల్ల రెడ్ మిల్ పై పరిగెత్తడం వంటివి చేయడం వల్ల గుండెపై ఆకస్మిక ఒత్తిడి కలుగుతుంది. ఫలితంగా హృదయ స్పందన రేటు, రక్తపోటు వేగంగా పెరుగుతాయి, ఇది గుండెపోటు లేదా స్ట్రోక్ ప్రమాదాన్ని పెంచుతుందని నిపుణులు చెబుతున్నారు.

నొప్పిని విస్మరించడం:
సాధారణంగా జిమ్‌లో వర్కౌట్ చేసేటప్పుడు అప్పుడప్పుడు చిన్నపాటి మజిల్ పెయిన్ రావడం సాధారణం. కానీ అలా కాకుండా వ్యాయామం చేసేటపుడు ఛాతిలో నొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఎదుర్కొంటే మాత్రం వెంటనే ఆపేసి విశ్రాంతి తీసుకోవాలి. అవసరమైతే వైద్యులను సంప్రదించాలి. ఇలా కాకుండా నొప్పిని విస్మరిస్తూ వ్యాయామం చేస్తే మాత్రం గుండెకు చాలా ప్రమాదకరం.

తక్కువ నీరు తాగడం:
వ్యాయామం చేసేటప్పుడు చెమటలు పడుతుంటాయి. చెమటలు పట్టినప్పుడు శరీరం నుంచి వాటర్ కూడా బయటకు వెళ్లిపోతుంది. టైమ్‌కు తగినంత వాటర్ తీసుకోకపోతే డీహైడ్రేషన్‌కు దారితీస్తుంది. .ఫలితంగా రక్తప్రసారం నెమ్మదించి గుండెకు రక్తాన్ని పంపించడానికి ఎక్కువ కష్టపడాల్సి ఉంటుంది. వర్కౌట్ ముందు తర్వాత తగినంత వాటర్ తాగడం చాలా ముఖ్యం.

Also Read: రోజ్ వాటర్‌తో మెరిసే చర్మం మీ సొంతం !

హెల్త్ కండీషన్:
అన్నింటికంటే ముఖ్యంగా జిమ్‌కు వెళ్లేముందు మీకు ఇప్పటికే ఏదైనా గుండె సంబంధిత వ్యాధి ఉంటే డాక్టర్‌ని కన్సల్ట్ అవ్వడం మంచిది. ఆయన సూచన మేరకు నడుచుకోవడం మంచిదని నిపుణులు చెబుతున్నారు. అలా కాకుండా హెల్త్ కండీషన్ దాచిపెట్టి జిమ్‌లో తీవ్రమైన కసరత్తులు చేస్తే మాత్రం ప్రాణాలకే ప్రమాదం అవుతుంది.

Related News

Multani Mitti Face Pack:ముల్తానీ మిట్టితో స్మూత్, గ్లోయింగ్ స్కిన్..

Rosy Cheeks: ఇలా చేస్తే మేకప్ వేసుకోకుండానే ముఖం లేత గులాభీ రంగులో మెరిసిపోతుంది

Ginger Juice Benefits : అల్లం రసం తీసుకుంటే శరీరంలో ఎన్ని మార్పులు జరుగుతాయో తెలుసా !

2050 నాటికి 4 కోట్లకు పైగా మరణాలు.. వాటివల్లే ఆ ముప్పు, తాజా స్టడీలో షాకింగ్ విషయాలు వెల్లడి

Burping: తేన్పులు అతిగా వస్తున్నాయా? మీరు డేంజర్‌లో ఉన్నట్టే!

Tomato Face Pack: పార్లర్‌కు వెళ్లకుండానే టమాటో ఫేస్ ప్యాక్‌తో రెట్టింపు అందం మీ సొంతం !

Prawns Masala: ఆంధ్ర స్టైల్‌లో రొయ్యల మసాలా కూర ఇలా వండారంటే నోరూరిపోతుంది, రెసిపీ ఇదిగోండి

Big Stories

×