Pragya Jaiswal: హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ తక్కువ సినిమాలతో టాలీవుడ్లో బాగా పాపులరైన బ్యూటీ. ఆలస్యంగా గ్లామర్ ఇండస్ట్రీలోకి ఆలస్యంగా వచ్చినా ఏమాత్రం వెనక్కి తగ్గలేదు.
యంగ్ హీరోయిన్లతో పోటీ పడుతూ తనకంటూ ఓ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది ప్రగ్యాజైస్వాల్. మధ్యప్రదేశ్‌కి చెందని ఈ బ్యూటీ ఇండస్ట్రీకి వచ్చి దశాబ్దం గడిచిపోయింది.
తానింకా యంగ్ అంటూ చెప్పే ప్రయత్నం చేస్తోంది. కోలీవుడ్ ఫిల్మ్ ద్వారా గ్లామర్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. కాకపోతే తెలుగులోనే బాగా పాపులర్ అయ్యింది.
యంగ్ హీరోలతోపాటు సీనియర్ నటులతో నటిస్తూ అన్నివర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంది. లక్షల్లో అభిమానులను పోగోసుకుంది. అఖండ సినిమాతో అభిమానులను అలరించింది కూడా.
ఇంతవరకు బాగానే ఉన్నా.. బాలీవుడ్లో అడుగుపెట్టేందుకు తెగ ప్రయత్నాలు చేస్తోంది. ఈ విషయంలో రెండు అడుగులు ముందుకు.. నాలుగు అడుగులు వెనక్కి అన్నచందంగా మారింది.
అయినా ట్రై చేస్తోంది ప్రగ్యా జైస్వాల్. ప్రస్తుతం అక్షయ్‌కుమార్‌తో కలిసి ఓ ప్రాజెక్టు చేసింది. దానిపై బోలెడంత ఆశలు పెట్టుకుంది.
అది హిట్టయితే.. తనకు అక్కడ తిరుగుండదని భావిస్తోంది. కాకపోతే మూడుపదుల వయస్సు పైబడడం తో ఛాన్స్ వస్తుందో లేదోనన్న బెంగ మాత్రం ఆమెని అనుక్షణం వెంటాడుతోంది.
ఈ క్రమంలో బీభత్సమైన ఫోటోషూట్స్ చేస్తూ.. తానింకా ఫ్రెష్ బ్యూటీనంటూ చెప్పే ప్రయత్నం చేస్తోంది. ప్రస్తుతం ఈ బ్యూటీకి బ్యాడ్ టైమ్ నడుస్తోందని, త్వరలో కెరీర్ స్పీడ్ అందుకోవడం ఖాయమని అంటోంది.