EPAPER

Metro BIG Shock: మెట్రో ప్రయాణికులకు షాక్..పార్కింగ్ ఎత్తివేత!

Metro BIG Shock: మెట్రో ప్రయాణికులకు షాక్..పార్కింగ్ ఎత్తివేత!

Metro BIG SHock To Passengers Parking Cancel: మెట్రో ప్రయాణికులకు షాక్ తగిలింది. నాగోల్ మెట్రో స్టేషన్‌లో ఫ్రీ పార్కింగ్‌ను ఎత్తివేశారు. నాగోల్ మెట్రో స్టేషన్ లో నిన్నటి వరకు ఉన్న ఫ్రీ పార్కింగ్ ఎత్తివేసి కొత్త ధరలు నిర్ణయించారు. మెట్రో ప్రయాణికులకు పెయిడ్ పార్కింగ్ అని చెప్పడంతో కంగుతిన్నారు. దీంతో నాగోల్ మెట్రో స్టేషన్ పార్కింగ్ నిర్వాహకులపై వాహనదారులు తిరగపడ్డారు. ఫ్రీ పార్కింగ్ సౌకర్యాన్ని పునరుద్ధరించాలని కోరుతున్నారు.


ఫ్రీ పార్కింగ్ స్థలంలో పెయిడ్ పార్కింగ్ పెట్టడంతో ప్రయాణికులు మండిపడుతున్నారు. చాలా ఏళ్లుగా వాహనదారులు అక్కడ ఫ్రీగా పార్కింగ్ చేసుకుంటుండగా.. గురువారం నుంచి ధరలు నిర్ణయించడంతో ఒక్కసారిగా వ్యతిరేకత ఎదురైంది. ఈ పార్కింగ్ చేసుకోవడానికి ‘పార్క్ హైదరాబాద్’ అనే యాప్ నుంచి చేయాలని కండీషన్ పెట్టడంతో వాహనదారులు ఆందోళనకు దిగారు. నగదు చెల్లించేందుకు కూడా అనుమతి ఇవ్వకపోవడంతో కాసేపు నిర్వాహకులకు, వాహనదారులకు గొడవ జరిగింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.

నాగోల్ మెట్రో స్టేషన్ పార్కింగ్ స్థలంలో కొత్త ధరలు నిర్ణయించారు. ఈ స్టేషన్ లో పార్కింగ్ చేయాలంటే బైక్స్ ను 2 గంటల వరకు పార్కింగ్ చేస్తు రూ.10, 8 గంటల వరకు రూ.25, 12 గంటల వరకు రూ.40 చెల్లించాలి. అదనంగా ఒక్కో గంటలకు రూ.75, 12 గంటల వరకు పార్క్ చేస్తే రూ.120 చొప్పున ధరలు నిర్ణయించారు.


Also Read: హైదరాబాద్‌లో సీఎం రేవంత్‌రెడ్డి, ఎయిర్‌పోర్టులో ఘన స్వాగతం, కాకపోతే..

ఇదిలా ఉండగా, జేబీఎస్ పరేడ్ మైదానంలో ఇప్పటికే పార్కింగ్ కు డబ్బులు వసూలు చేస్తున్నారు. అయితే పార్కింగ్ కు సరిపడా స్థలం లేకపోవడంతో చాలా మంది మెట్రో ప్రయాణికులు తమ వాహనాలను ఎక్కడ పార్క్ చేయాలో తెలియక ఇబ్బంది పడుతున్నారు. ఇక్కడ కూడా ‘పార్క్ హైదరాబాద్’ నిర్వహిస్తుంది. స్థలం లేకపోవడంతో వర్షం పడే సందర్భాల్లో బురదతో ఇబ్బంది పడుతున్నామని వాహనదారులు ఆందోళన చేస్తున్నారు.

Related News

New Ration Card: ప్రజలకు శుభవార్త.. అక్టోబర్ 2 నుంచి రేషన్ కార్డులకు అర్జీలు.. అర్హతలు ఇవే!

Shankar Nayak: శంకర్ నాయక్.. వంకర బుద్ధి! దళితుల భూములతో ఆటలు

Chandrababu Naidu: సీఎం రేవంత్ రెడ్డి మీటింగ్‌లో నారా బ్రాహ్మణి.. స్కిల్ వర్సిటీ బాధ్యతలు?

Bandi Sanjay: ఆ దేవుడు క్షమించడు: తిరుపతి లడ్డూ వివాదంపై స్పందించిన బండి సంజయ్

Skill University: స్కిల్ వర్సిటీకి రూ.100 కోట్లు కేటాయిస్తాం.. ఈ ఏడాది నుంచే కోర్సులు ప్రారంభం: సీఎం రేవంత్ రెడ్డి

Mahesh Kumar: రాహుల్ గాంధీ వదిలిన బాణాన్ని నేను.. తగ్గే ప్రసక్తే లేదు: మహేశ్ కుమార్ గౌడ్

Rythu Bandhu: వ్యవసాయం చేసే వారికే రైతు బంధు: మంత్రి తుమ్మల

Big Stories

×