EPAPER

Kejriwal Supreme Court: ఢిల్లీ మద్యం పాలసీ కేసు.. కేజ్రీవాల్ బెయిల్ పిటీషన్ పై నేడు సుప్రీంకోర్టులో విచారణ

Kejriwal Supreme Court: ఢిల్లీ మద్యం పాలసీ కేసు.. కేజ్రీవాల్ బెయిల్ పిటీషన్ పై నేడు సుప్రీంకోర్టులో విచారణ

Supreme Court on Kejriwal bail(Telugu breaking news): ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ అధ్యక్షుడు అరవింద్ కేజ్రీవాల్ బెయిల్ పిటీషన్‌పై సుప్రీం కోర్టులో బుధవారం, ఆగస్టు 14 విచారణ జరుగనుంది. ఢిల్లీ మధ్యం పాలసి కేసులో అవినీతి ఆరోపణలపై ఆయనను సిబిఐ, ఈడీ శాఖ అధికారులు అరెస్టు చేశారు. అయితే ఆయనకు కొన్ని రోజుల ముందే ఈడీ కేసులో సుప్రీం కోర్టు నుంచి బెయిల్ లభించినా.. సిబిఐ మాత్రం ఆయనను కస్టడీలో ఉంచింది.


సిబిఐ కస్టడీకి వ్యతిరేకంగా కేజ్రీవాల్ ఢిల్లీ హై కోర్టుకు వెళ్లగా ఆయనకు నిరాశే ఎదురైంది. ఆయనకు బెయిల్ ఇవ్వడం కుదరదని హైకోర్టు చెప్పడంతో కేజ్రీవాల్ సుప్రీం కోర్టును మళ్లీ ఆశ్రయించారు. హై కోర్టు తీర్పును సవాల్ చేస్తూ.. కేజ్రీవాల్ సుప్రీం కోర్టులో బెయిల్ పిటీషన్ వేశారు.

కేజ్రీవాల్ తరపున ప్రముఖ సుప్రీం కోర్టు లాయర్ అభిషేక్ మను సింఘ్వీ ఈ కేసును వాదిస్తున్నారు. బెయిల్ పిటీషన్ తో పాటు కేజ్రీవాల్ అరెస్టు చట్టవ్యతిరేకమని మరో పిటీషన్ వేశారు. ఈ రెండు పిటీషన్లపై అత్యవసర విచారణ జరపాల్సిందిగా లాయర్ సింఘ్వీ సుప్రీం కోర్టును కోరారు. దీంతో దేశ అత్యున్నత్త కోర్టులో జస్టిస్ సూర్య కాంత్, జస్టిస్ ఉజ్జల్ భూయాన్ తో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఈ రెండు పిటీషన్లపై ఒకేసారి విచారణ చేపట్టనున్నారు.


ఇంతకుముందు ఆగస్టు 5న ఢిల్లీ హైకోర్టు కేజ్రీవాల్ బెయిల్ పిటీషన్ తిరస్కరిస్తూ.. ఆయనను కస్టడీలోనే ఉంచాలని చెప్పింది. కేజ్రీవాల్ ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి అని ఆయన సాక్ష్యాధారాలను తారుమారు చేయగలడని సిబిఐ లాయర్ వాదనతో హైకోర్టు ఏకీభవించింది. సిబిఐ అధికారులు తనను అరెస్టు చేయడం వెనుక రాజకీయ కుట్ర ఉందనే కేజ్రీవాల్ వాదనను హైకోర్టు తిరస్కరించింది.

Also Read: ‘కలియుగం.. ఆడవాళ్లు ఇలా కూడా చేస్తున్నారు’.. పాకిస్తాన్ లో డివోర్స్ పార్టీపై ట్రోలింగ్

అయితే ఢిల్లీ మద్యం పాలసీలో ప్రధాన నిందితుడు మాజీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోదియాకు ఇటీవలే సుప్రీం కోర్టు బెయిల్ పై విడుదల చేసింది. ఆయన గత 17 నెలలుగా జైలులోనే ఉన్నారు. పైగా ఆయన కేసులో ఇంతవరకు విచారణ కూడా ప్రారంభం కాకపోవడంతో సుప్రీం కోర్టు ఈడీ, సిబిఐ అధికారులపై మండిపడింది. సుదీర్ఘ కాలం ఒక వ్యక్తిని నేరం రుజుకు చేయకుండా జైలులో ఖైదు చేయడం రాజ్యంగ విరుద్ధమని చెప్పింది. హైకోర్టు, ట్రయల్ కోర్టు న్యాయమూర్తులు ఇంతకాలం పాటు బెయిల్ ఇవ్వకుండా కాలక్షేపం చేశారని.. ఘాటు వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

Also Read: త్వరలో జమ్ము కశ్మీర్‌లో ఎన్నికలు.. 20 నాటికి ఎన్నికల షెడ్యూల్

Related News

Star Health Data: స్టార్ హెల్త్ కస్టమర్లకు షాక్.. డేటా మొత్తం ఆ యాప్ లో అమ్మకానికి ?

Jammu Kashmir Elections: జమ్ము ఎన్నికల వేళ.. పాక్ మంత్రి కీలక వ్యాఖ్యలు

Cash for Vote Scam: ఓటుకు నోటు కేసులో సీఎం రేవంత్ రెడ్డికి భారీ ఊరట

MLA Bojju Patel: రవ్‌నీత్ సింగ్ తలను తీసుకొస్తే.. నా ఆస్తి రాసిస్తా : కాంగ్రెస్ ఎమ్మెల్యే సంచలనం

Uttarakhand Train: రైలు ప్రమాదానికి భారీ కుట్ర.. పట్టాలపై 6 మీటర్ల ఇనుప రాడ్

Mahalakshmi Scheme: కాంగ్రెస్ హామీని కాపీ కొట్టిన బీజేపీ

Rahul Gandhi: ఖర్గే, నడ్డాల లేఖల యుద్ధం

Big Stories

×