EPAPER

Bandi sanjay vs Etela: కమలంలో కలహాలు? ఆ పదవి కోసం పంతం, రేసులో కొత్త పేరు

Bandi sanjay vs Etela: కమలంలో కలహాలు? ఆ పదవి కోసం పంతం, రేసులో కొత్త పేరు

Bandi sanjay vs Etela(BJP news in Telangana): తెలంగాణలో బీజేపీ పరిస్థితి? హైకమాండ్ ఎందుకు సైలెంట్‌గా ఉంది? కాంగ్రెస్ ప్రత్యామ్నాయం తామేనని బయటకు చెబుతున్నా.. ఆ లోటును ఎందుకు భర్తీ చేయలేకపోతోంది? అధ్యక్ష పదవిని ఎందుకు పెండింగ్‌లో పెట్టింది? తెలంగాణ బీజేపీలో గ్రూపుల రాజకీయం మొదలయ్యిందా? ఇప్పట్లో కొత్త అధ్యక్షుడు ఎంపిక లేనట్టేనా? బీఆర్ఎస్ దోస్తీ నేపథ్యంలో అధ్యక్ష పీఠాన్ని పెండింగ్‌లో పెట్టిందా? ఇలా రకరకాల ప్రశ్నలు రైజ్ అవుతున్నాయి.


తెలంగాణ కమలంలో అంతర్గత కలహాలు ముదిరిపాకాన పడినట్టు కనిపిస్తోంది. ఆ పార్టీలోని నేతలు ఎవరి కివారే అన్నచందంగా వ్యవహరిస్తున్నారు. రీసెంట్‌గా జరిగిన ఆ పార్టీ నేతల సమావేశానికి గెలిచిన ఎనిమిది మంది ఎమ్మెల్యేలు డుమ్మాకొట్టారు. రకరకాల కారణాలు చెప్పారనుకోండి. అదంతా తర్వాత విషయం. నేతలంతా ఒకతాటి మీదకు రాకపోవడంతో తెలంగాణ అధ్యక్షుడ్ని నియమించలేదన్నది బీజేపీ హైకమాండ్ నుంచి ఓ ఫీలర్ బయటకువచ్చింది. పార్టీలో అంతర్గత కుమ్ములాటలే దీనికి కారణంగా తెలుస్తోంది.

తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవి కోసం మంత్రి బండి సంజయ్-ఎంపీ ఈటెల రాజేందర్ మధ్య అంతర్గత విభేదాలే కారణమని తెలుస్తోంది. ముఖ్యంగా ఈటెలకు పదవి రాకుండా బండి సంజయ్ అడ్డుకుంటున్నా రన్నది కొందరి నేతల అభిప్రాయం. అధ్యక్ష పదవి కోసం ఇప్పటికే కర్చీఫ్ వేశారు ఈటెల రాజేందర్. ఆయనకు ఆ పదవి రాకుండా సంజయ్ తెరవెనుక పావులు కదుపుతున్నారన్నది పొలిటికల్ సమాచారం. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై ఇద్దరు నేతలు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.


ALSO READ: సీఎం రేవంత్‌రెడ్డి.. కాగ్నిజెంట్‌ న్యూ‌ క్యాంపస్‌ శంకుస్థాపన, కేవలం 9 రోజుల్లో..

ఈటెలకు పోటీగా మాజీ ఎమ్మెల్సీ ఎన్. రాంచందర్‌రావు పేరు తెరపైకి వచ్చింది. రాంచందర్‌రావు గురించి చెప్పనక్కర్లేదు. బీజేపీలో సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్సీ కూడా.. ఇంతకంటే సౌమ్యుడు ఉండరన్నది బండి సంజయ్ మద్దతుదారులు చెబుతున్నమాట. దీంతో తెలంగాణ అధ్యక్ష పీఠంపై బీజేపీ హైకమాండ్ ఎటూ తేల్చుకోలేపోతోంది. ప్రస్తుతం తెలంగాణలో జరుగుతున్న పరిణామాలను నిశితంగా గమనిస్తున్నారు బీజేపీ పెద్దలు.

ప్రస్తుతం కిషన్‌రెడ్డి కంటిన్యూ చేయాలనే ఆలోచన చేస్తోందట బీజేపీ హైకమాండ్. కొత్తవారికి అధ్యక్ష పదవి ఇస్తే మరో గ్రూపు తయారవుతుందని భావిస్తోందట. కొద్దిరోజులు అలాగే ఉంచాలన్నది హైకమాండ్ ఆలోచన గా వార్తలు వస్తున్నాయి. మొత్తానికి తెలంగాణ బీజేపీ అధ్యక్ష పీఠంపై కొద్దిరోజులు ఉత్కంఠ కొనసాగడం ఖాయమన్నమాట.

Related News

Johnny Master: ఢీ 11 లో ఎలిమినేట్.. జానీ మాస్టర్ ఇంత కథ నడిపారా.?

Prabhas – Hanu : గప్ చుప్ గా షూటింగ్… ఇంత సీక్రెట్ గా ఎందుకో..?

Hansika Motwani: అసభ్యకరంగా తాకాడు.. నొప్పి భరించలేకపోయా అంటూ హన్సిక ఎమోషనల్..!

Mokshagna: తొలి మూవీ బడ్జెట్ ఎంతో తెలుసా.. ఆల్ టైం రికార్డ్ సృష్టించబోతున్న బాలయ్య..!

Nagabubu: నాగబాబు సెటైరికల్ పోస్ట్.. జానీ మాస్టర్ కేనా..?

Jani Master : కేసులో మరో ట్విస్ట్.. కూపీ లాగనున్న మహిళా కొరియోగ్రాఫర్..!

Bigg Boss 8 Day 18 Promo: హౌస్ లో పెద్ద డ్రామా నడుస్తోందే.. సోనియా కి ఝలక్ ఇచ్చిన నబీల్..!

Big Stories

×