తెలుగులో సినిమా స్క్రీన్‌పై వెలిగి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన స్టార్స్ ఎవరో తెలుసా?

నందమూరి తారకరామారావు: 1983లో టీడీపీని స్థాపించి మొదటి ప్రయత్నంలోనే విజయం సాధించి ఏపీ సీఎం అయ్యారు.

చిరంజీవి:  2008లో ప్రజారాజ్యం పార్టీని స్థాపించి రాజకీయ రంగప్రవేశం చేశారు. ఆ తర్వాత మళ్లీ సినిమాల్లోకి వెళ్లారు.

నందమూరి బాలకృష్ణ: మూడు సార్లు హిందూపురం ఎమ్మెల్యేగా గెలుపొందారు.

పవన్ కల్యాణ్: 2014లో జనసేన పార్టీని స్థాపించిన పవన్..2024లో ఏపీ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టారు.

మోహన్ బాబు: టీడీపీ నుంచి రాజ్యసభ సభ్యుడిగా చేసిన ఆయన..వైసీపీలో చేరారు.

మురళీ మోహన్ : టీడీపీ నుంచి ఎంపీ గెలిచాడు.

బాబు మోహన్: టీడీపీ నుంచి మంత్రిగా. టీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు.

విజయశాంతి : 2009లో 'తల్లి తెలంగాణ' అనే పార్టీని స్థాపించారు.

రోజా: రెండు సార్లు వైసీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు.

జయసుధ: కాంగ్రెస్ తరఫున ఎమ్మెల్యేగా గెలిచారు. తర్వాత బీజేపీలో చేరారు.