EPAPER

Cucumber Seeds: గింజలే కదా అని తీసి పారేస్తున్నారు.. తింటే ఎన్ని లాభాలో తెలుసా..!

Cucumber Seeds: గింజలే కదా అని తీసి పారేస్తున్నారు.. తింటే ఎన్ని లాభాలో తెలుసా..!

Cucumber Seeds: దోసకాయలో ఔషధ గుణాలు పుష్కలంగా ఉంటాయి. కీర దోసకాయను తినడం వల్ల ఆరోగ్యాన్ని అన్ని సమస్యల నుంచి రక్షించుకోవచ్చు. అందువల్ల కీరదోసను సలాడ్స్, వాటర్, రైతా ఇలా ఏదో ఒక రూపంలో తీసుకోవాల్సి ఉంటుంది. ఇది ముఖ్యంగా వేసవి కాలంలో మండే ఎండల వేడి నుంచి శరీరానికి ఉపశమనం కలిగించడానికి చలువగా పనిచేస్తుంది. వేసవి కాలం మొత్తంలో మార్కెట్లో ఎక్కడ చూసినా కూడా కీరదోస ఎక్కువగా కనిపిస్తుంది. అయితే కీరదోసతో పాటు అందులోని గింజలతో కూడా ఆరోగ్యానికి అద్భుతమైన ప్రయోజనాలు ఉంటాయి. ఇది ముఖ్యంగా డయాబెటీస్, హైబీపీ పేషెంట్లకు ఔషధంలా పనిచేస్తుంది. కీర దోస గింజలను నమలడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. అయితే ఆ ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.


జీర్ణక్రియ:

దోస గింజలను తింటే జీర్ణక్రియ వ్యవస్థ మెరుగుపడుతుంది. దోసకాయ గింజల్లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇందులో ఉండే పీచు కారణంగా మలబద్ధకం సమస్యలు కూడా తగ్గిపోతాయి. అందువల్ల రోజుకు ఒక చెంచా దోసకాయ గింజలను తీసుకుంటే మంచిది.


బరువు తగ్గడం:

బరువు తగ్గాలనుకునే వారికి దోసకాయ మంచి మార్గం అనే చెప్పాలి. తరచూ కీరదోసతో సలాడ్స్ చేసుకుని తింటే మంచి ఫలితం ఉంటుంది. అంతేకాదు దోసకాయ గింజలను తినడం వల్ల కూడా కడుపు త్వరగా నిండిపోయి ఆకలిని తగ్గిస్తుంది. ఈ క్రమంలో ఈజీగా బరువు తగ్గే అవకాశాలు ఉంటాయి.

గుండె ఆరోగ్యం:

దోసకాయ గింజల్లో ఉండే పొటాషియం, మెగ్నీషియం కారణంగా గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చు. అంతేకాదు అధిక రక్తపోటు వంటి సమస్యలను కూడా తగ్గించుకోవచ్చు.

ఎముకల బలం:

కీళ్ల నొప్పులు, ఎముకల్లో బలం కోసం కూడా కీరదోసను వాడుకోవచ్చు. ఇందులో ఉండే ఫాస్పరస్, కాల్షియం వల్ల ఆస్టియోరోసిన్ వంటి సమస్యను కూడా తగ్గించుకోవచ్చు.

చర్మ సంరక్షణ :

చర్మ సంరక్షణ కోసం కూడా దోసకాయ గింజలు అద్భుతంగా పనిచేస్తాయి. చర్మాన్ని అందంగా, యవ్వనంగా మార్చుకోవాలనుకునే వారు వీటిని తరచూ ఓ చెంచా తీసుకుంటే మంచిది. మరోవైపు మొటిమలు, మచ్చలతో బాధపడే వారు దోసగింజల పొడిని అప్లై చేసుకుంటే ఉపశమనం ఉంటుంది.

మధుమేహం:

దోసకాయ గింజల్లో ఉండే ఫైబర్ కారణంగా రక్తంలోని చక్కెర స్థాయిలను కూడా నియంత్రించుకోవచ్చు.

(గమనిక : ఇక్కడ ఇచ్చిన సమాచారం ఇంటర్నెట్ నుంచి సేకరించినది. bigtvlive.com దీనిని ధృవీకరించదు.)

Related News

Study on Men: మగాళ్లు మాయమైపోతారా? 2040 నాటికి ఆ గండం!

Weight Loss Drink: ఈ ఆకు నానబెట్టిన నీరు తాగితే వేగంగా బరువు తగ్గుతారు..

Pizza Dosa: ఇంట్లోనే పిల్లల కోసం పిజ్జా దోశ ఇలా చేసేయండి, ఒక్కటి తింటే చాలు పొట్ట నిండిపోతుంది

Golden Face Pack: ముఖాన్ని బంగారంలా మెరిపించే ఫేస్ ప్యాక్ ఇదే

Laryngeal Cancer: గొంతులో నొప్పి.. బొంగురు మాటలు.. స్వరపేటిక క్యాన్సర్ కావచ్చు జాగ్రత్త!

Wall Cleaning Tips: ఈ టిప్స్‌తో గోడలపై ఉన్న జిడ్డు, నూనె మరకలు మాయం !

Hair Care Tips: జుట్టు ఒత్తుగా, పొడవుగా పెరగాలంటే.. ఈ ఆహారాలు తినాల్సిందే!

Big Stories

×