EPAPER

Visakha MLC by Elections: సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం.. విశాఖ ఎమ్మెల్సీ ఉపఎన్నికకు కూటమి దూరం

Visakha MLC by Elections: సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం.. విశాఖ ఎమ్మెల్సీ ఉపఎన్నికకు కూటమి దూరం

Visakha MLC by Elections: ఉమ్మడి విశాఖ ఎమ్మెల్సీ ఉపఎన్నికల్లో కూటమి కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఉప ఎన్నికల్లో పోటీకి కూటమి దూరంగా ఉండనుంది. ఈ మేరకు కూటమితో నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్‌లో మెజార్టీ నేతల అభిప్రాయాల మేరకు సీఎం చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. విశాఖ ఎమ్మెల్సీ ఉపఎన్నికల్లో పోటీ చేస్తే గెలవడం కష్టమేమి కాదని, హుందా రాజకీయాలు చేయాలని సీఎం వెల్లడించారు.


సీఎం చంద్రబాబుతో టెలీకాన్ఫరెన్స్‌లో విజయం సాధించేందుకు అవసరమైన బలం లేనందున పోటీ చేయకపోవడమే మంచిదని కూటమి నాయకులు సైతం చెప్పారు. అలాగే ఒక ఎమ్మెల్సీ సీలు కోల్పోయినంత మాత్రాన వచ్చే నష్టమేమీ కాదని నేతలు అభిప్రాయం వ్యక్తం చేశారు. నామినేషన్ల దాఖలుకు మంగళవారం మధ్యాహ్నం మూడు గంటల వరకు ఉంది. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు తన నిర్ణయాన్ని పార్టీ నేతలకు తెలిపారు.

ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో మొత్తం 838 ఓటర్లు ఉన్నారు. ఈ ఎన్నికల్లో గెలిచేందుకు కనీసం 420 ఓట్లు రావాల్సి ఉంటుంది. ఇప్పటివరకు కూటమికి 300 మాత్రమే ఉన్నాయి. అయితే గెలిచేందుకు ఇంకా 120 ఓట్లు అవసరం ఉంటుంది. ఇలాంటి తరుణంలో ఆ 120 ఓటర్లను సమీకరించుకునేందుకు అధికార పార్టీకి ఉంది. కానీ హుందా రాజకీయాలు చేయాలని సీఎం నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే పోటీకి కూటమి దూరంగా ఉండనుంది.


Also Read: అగ్రిగోల్డ్ భూముల వ్యవహారం.. జోగి రాజీవ్ అరెస్ట్

ఇదిలా ఉండగా, విశాఖ ఎమ్మెల్సీ ఉపఎన్నికకు వైసీపీ అభ్యర్థి బొత్స సత్యనారాయణ పోటీ చేస్తుండగా.. స్వతంత్ర అభ్యర్థిగా షేక్ సఫీ నామినేషన్ వేశారు. ఒకవేళ స్వతంత్ర అభ్యర్థి ఉపసంహరించుకుంటే ఎకగ్రీవం కానుంది.

Related News

Kethireddy: ఇప్పటికైనా నోరు విప్పు జగన్.. ఎందుకు మౌనంగా ఉంటున్నావ్..? : కేతిరెడ్డి

Tirupati Laddu: తిరుమలలో నిత్యం 3 లక్షల లడ్డూలు విక్రయం.. 500 వార్షిక ఆదాయం.. కల్తీ నెయ్యి వివాదం తరువాత..

YS Jagan: తిరుమల లడ్డూ వివాదంపై స్పందించిన జగన్.. చంద్రబాబు పెద్ద దుర్మార్గుడు

Tirupati Laddu Row: ఆ సంస్థ నెయ్యిలోనే అవన్నీ కలిశాయి.. 39 రకాల టెస్టుల్లో తేలింది ఇదే: టీటీడీ ఈవో

Vidadala Rajini: మాజీ మంత్రి విడుదల రజనీకి కష్టాలు.. రేపో మారో అరెస్ట్ తప్పదా?

Dussehra Holidays: విద్యార్థులకు గుడ్ న్యూస్.. దసరా సెలవుల తేదీలు ఇవే!

YCP vs Janasena: జనసేనలో చేరికలు.. కూటమిలో లుకలుకలు

Big Stories

×