EPAPER

Horoscope: నేటి రాశి ఫలాలు..ఈ రాశి వారికి అవివాహితులకు వివాహయోగం!

Horoscope: నేటి రాశి ఫలాలు..ఈ రాశి వారికి అవివాహితులకు వివాహయోగం!

Astrology Today: జ్యోతిష్యశాస్త్ర ప్రకారం మొత్తం పన్నెండు రాశులు. ఇందులో ఏ రాశి వారికి ఎలా ఉంటుంది? ఏమైనా ఆటంకాలు వచ్చే అవకాశం ఉంటుందా? వంటి వాటిపై జ్యోతిష్యులు ఎలాంటి విషయాలు చెప్పారో తెలుసుకుందాం.


మేషం:
మేష రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ప్రారంభించిన పనులు సకాలంలో పూర్తవుతాయి. అందరితో కలిసి పనిచేస్తే మంచి ఫలితాలు పొందుతారు. పెద్దల సహకారం ఫలిస్తాయి. కోపం అదుపులో ఉంచుకోవాలి. ప్రయాణాలు వాయిదా వేసుకోవడం ఉత్తమం. కొన్ని సంఘటనలు బాధను కలిగిస్తాయి. సూర్య ఆరాధన శ్రేయస్కరం.

వృషభం:
ఈ రాశి వారికి సామాన్యంగా ఉంటుంది. వృత్తి, ఉద్యోగాల్లో శారీరక శ్రమ పెరుగుతుంది. కీలక వ్యవహారాల్లో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. ఇతరులతో ఆచితూచి వ్యహరించాలి. శుభకార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆదాయాన్ని మించి ఖర్చులు ఉంటాయి. ఆరోగ్యాంపై శ్రద్ధ తీసుకోవాలి. శివారాధన శుభకరం.


మిథునం:
ఈ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. ప్రారంభించిన పనుల్లో ఆర్థికంగా శుభ ఫలితాలుంటాయి. పెద్దల సలహాలు తీసుకోవడం మంచిది. అన్ని రంగాల వారికి లాభాలుంటాయి. ఉద్యోగులు శ్రద్ధతో పనిచేస్తే ఉన్నత ఫలితాలు పొందుతారు. కీలక వ్యవహారాల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించొద్దు. శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇష్టదైవ సందర్శనం శుభప్రదం.

కర్కాటకం:
ఈ రాశి వారికి శుభప్రదంగా ఉంటుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ప్రారంభించిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. మీ ప్రతిభకు ప్రశంసలు అందుకుంటారు. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. శత్రువులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. ఉద్యోగులకు ప్రమోషన్స్, స్థాన చలనం అవకాశం ఉంటుంది. దేవతారాధన శుభకరం.

సింహం:
సింహ రాశి వారికి సామాన్యంగా ఉంటుంది. ప్రారంభించిన పనుల్లో ఆటంకం ఏర్పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. కుటుంబ సభ్యులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ అవసరం. ప్రయాణాలు వృథా కావొచ్చు. ఉద్యోగాల్లో తీవ్ర ఒత్తిడి పెరిగే అవకాశం ఉంటుంది. జలాశయాలకు దూరంగా ఉండాలి.  శ్రీవేంకటేశ్వరస్వామి సందర్శనం శుభప్రదం.

కన్య:
ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వృత్తి, వ్యాపార, ఉద్యోగాల్లో అధిక లాభాలు ఉంటాయి. కీలక వ్యవహారాల్లో పెద్దల సహకారం అందుతుంది. ప్రయాణాలు ఉంటాయి.  బంధుమిత్రులతో ఆచితూచి వ్యవహరించాలి. అనారోగ్య సమస్యలు ఎదురుకావొచ్చు. ప్రతికూల ఆలోచనలు వీడితే మంచిది. ఉద్యోగస్తులకు ప్రమోషన్స్ ఉంటాయి. ఇష్ట దేవతారాధన శుభకరం.

తుల:
ఈ రాశి వారికి ప్రతికూల ఫలితాలు ఉంటాయి. వృత్తి, వ్యాపార రంగాల్లో కీలక పనులు పూర్తి చేస్తారు. ఆర్థికంగా లాభాలు ఉంటాయి. కొన్ని సమయాల్లో అనిశ్చితి చోటుచేసుకుంటుంది. ముఖ్యమైన పనుల్లో తోటివారి సహకరంతో పూర్తి చేస్తారు. కోపం, చిరాకు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఆదాయాన్ని మించి ఖర్చులు ఉంటాయి. ఆంజనేయ స్వామి ఆలయ సందర్శన మంచిది.

వృశ్చికం:
ఈ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి ఆశించిన ప్రయోజనాలు ఉంటాయి. ఉద్యోగంలో హోదా పెరుగుతుంది. బంధుమిత్రుల సహకారం ఉంటుంది. శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ప్రయాణాలు ఉంటాయి. కుటుంబ సభ్యులతో ఆనందంగా ఉంటారు. ఆదాయం పెరుగుతుంది. ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకోవాలి. కనకధారాస్తోత్రం చదవడంతో శుభఫలితాలు కలుగుతాయి.

ధనుస్సు:
ధనుస్సు రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. వృత్తి, వ్యాపారాల్లో ఆశించిన ప్రయోజనాలు ఉంటాయి. ఉద్యోగులకు అప్పగించిన బాధ్యతలను సకాలంలో పూర్తి చేస్తారు. ఉద్యోగులకు హోదా పెరుగుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఎట్టి పరిస్థితుల్లోనూ దైవారాధన మానవద్దు. ఆదాయం పెరుగుతుంది. శనిశ్లోకం చదవండి.

మకరం:
ఈ రాశి వారికి అద్భుతంగా ఉంటుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఆశించిన ఫలితాలను అందుకుంటారు. ప్రారంభించిన పనులను సకాలంలో విజయవంతంగా పూర్తి చేస్తారు. శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. పెండింగ్ లో ఉన్న సమస్యలు పూర్తవుతాయి. అవివాహితులకు వివాహం నిశ్చయమవుతుంది. ఇష్టదేవతారాధన శుభప్రదం.

కుంభం:
కుంభ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. వృత్తి, వ్యాపారాల్లో అద్భుతంగా రాణిస్తారు. కీలక పనులను సకాలంలో పూర్తి చేస్తారు. ఉద్యోగాల్లో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. కోర్టు వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. వ్యాపారంలో అధిక లాభాలు ఉంటాయి. హనుమాన్ చాలీసా చదవడం మంచిది.

మీనం:
మీన రాశి వారికి సామాన్యంగా ఉంటుంది. ముఖ్యమైన వ్యవహరాల్లో మంచి నిర్ణయాలు తీసుకోవాలి. ప్రారంభించిన పనులు సకాలంలో పూర్తికాకపోవడంతో నిరాశకు గురవుతారు. వ్యాపారాల్లో నష్టాలు ఎదురుకావొచ్చు. అనారోగ్యానికి గురి కావొచ్చు. కుటుంబంలో కలహాలు ఏర్పడవచ్చు. కోపాన్ని అదుపులో పెట్టుకోవాలి. శ్రీలక్ష్మీ నారాయణ సందర్శన శుభప్రదం.

Related News

Bhadra Mahapurush Rajyog Horoscope: ఈ రాశి వారిపై ప్రత్యేక రాజయోగంతో జీవితంలో భారీ అభివృద్ధి

Dussehra 2024 Date: ఈ ఏడాది దసరా పండుగ ఏ రోజున జరుపుకుంటారు? శుభ సమయం, ప్రాముఖ్యత వివరాలు ఇవే

Sun Transit Horoscope: సూర్యుని దయతో ఈ రాశుల వారికి గోల్డెన్ టైం రాబోతుంది

Tirumal Laddu: పవిత్ర తిరుమల లడ్డూ తయారీలో 8 మంది కీలక పాత్ర, ఇంతకీ వాళ్లు ఎవరో తెలుసా?

Tulasi Plant: తులసి పూజ ఎప్పుడు చేయాలి, వాయు పురాణం ఏం చెబుతోందంటే..

Horoscope 20 September 2024: ఈ రాశి వారికి పట్టిందల్లా బంగారమే! శ్రీలక్ష్మి ధ్యానం శుభప్రదం!

Lucky Rashi from Durga Sasthi 2024: దుర్గా షష్ఠి నుండి ఈ రాశులకు వరుసగా 119 రోజులు లక్ష్మీ అనుగ్రహం

Big Stories

×