Realme తాజాగా మరొక చౌకైన 5G స్మార్ట్‌ఫోన్‌ను దేశీయ మార్కెట్లో లాంచ్ చేసింది. అదే realme C63 5G ఫోన్.
స్మార్ట్‌ఫోన్ రెండు కలర్ ఆప్షన్లలో వచ్చాయి. అవి స్టార్రి గోల్డ్, ఫారెస్ట్ గ్రీన్.
ఇది మూడు వేరియంట్లలో లాంచ్ చేయబడింది. అందులో 4GB+128GB వేరియంట్ ధర రూ.10999గా నిర్ణయించింది.
అయితే దీనిపై రూ. 1000 బ్యాంక్ పొందొచ్చు. ఆ తర్వాత ఇది రూ. 9999కే లభిస్తుంది.
అదేవిధంగా 6GB + 128GB వేరియంట్ ధర రూ. 11999, అలాగే 8GB + 128GB వేరియంట్ ధర రూ.12999గా కంపెనీ నిర్ణయించింది.
వీటిపై కూడా రూ.1,000 బ్యాంక్ డిస్కౌంట్ పొందవచ్చు. మొదటి సేల్ ఆగస్ట్ 20న ప్రారంభం అవుతుంది. దీనిని realme.com, Flipkartలో కొనుక్కోవచ్చు.
ఫోన్ 6.67-అంగుళాల (1604 x 720 పిక్సెల్‌లు) HD+ డిస్ప్లేను కలిగి ఉంది. ఇది 120Hz వరకు రిఫ్రెష్ రేట్‌కు మద్దతు ఇస్తుంది.
MediaTek Dimension 6300 ప్రాసెసర్‌ని ఫోన్లో ఇన్స్టాల్ చేశారు. సరికొత్త ఆండ్రాయిడ్ 14పై నడుస్తుంది.
ఇందులో 32MP వెనుక కెమెరా ఉంది. ఫ్రంట్ కెమెరా 8 మెగాపిక్సెల్.
ఇందులో సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్, 3.5ఎమ్ఎమ్ ఆడియో జాక్ ఉన్నాయి. realme C63 5G ఫోన్ IP64 రేట్ చేయబడింది.